కడప

గుప్తనిధుల నిందితులు కోర్టుకు హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోరుమామిళ్ల, జనవరి 9: పట్టణంలో వెలసిన బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరాలయంలో నంది విగ్రహాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై ఓబన్న తెలిపారు. సోమవారం సాయంత్రం విలేఖరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ పట్టణంలోని శివాలయంలో నంది విగ్రహాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించిన ఏడుమంది ముద్దాయిలను విలేఖరుల ఎదుట హాజరుపరచడం జరిగిందన్నారు. ఈ సందర్భభంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో రాత్రి నంది విగ్రహాన్ని దొంగిలించేందుకు ఆలయ తలుపులు పగులగొడుతున్న సమయంలో చప్పుడురావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమందివ్వగా సిబ్బందితో సహా వెళ్లేసరికి ఏడుమంది ముద్దాయిలను పట్టుకున్నామని, వారిని విచారించగా గతంలో ఈ ఆలయంలో పున్నాగు నాగుపాము తిరిగి టివిలు, పత్రికల్లో రావడం గమనించి ఇక్కడ గుప్తనిధులు ఉంటాయన్న నమ్మకంతో ఇక్కడకొచ్చి తవ్వకాలు చేపట్టామని వారు చెప్పారన్నారు. ప్రకాశంజిల్లా బేస్తవారుపేటకు చెందిన కర్ణాటి రమణారెడ్డి, కడపకు చెందిన సాయిక్రిష్ణ, రాయచోటికి చెందిన అశ్వినీకుమార్, రణధీర్, ఎర్రగుంట్లకు చెందిన ఆరవేటి రాజా, బేతంచెర్లకు చెందిన రమేష్, చెన్నారెడ్డిపేటకు చెందిన సుబ్బారెడ్డిలను గుప్తనిధుల కేసులో అరెస్టుచేశామన్నారు. వీరు చాలాఏళ్ల నుంచి జిల్లాలో కడప, రాయచోటి ప్రాంతాల్లో నిధులకోసం ప్రయత్నించినట్లు విచారణలో తేలిందన్నారు. రమణారెడ్డి అలియాస్ స్వామి క్షుద్రపూజలు నేర్చుకుని నిధులు వెలికితీయడంలో సిద్ధహస్తుడని, ఈ ప్రాంతంలో కూడా కొన్నిరోజులుగా రెక్కీ నిర్వహించి, రాత్రిపూట తవ్వకాలలో వీరిని స్వాధీనం చేసుకున్నామని, వీరిని బద్వేలు కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమం కోసం
రూ.710కోట్లు కేటాయింపు

కడప,జనవరి 9: రాష్ట్రప్రభుత్వం మైనార్టీ సంక్షేమం కోసం రూ.710కోట్లు కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రైనార్టీ కమిషన్ చైర్మన్ హిదాయత్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఏపి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారాగతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా రూ.710కోట్లు నిధులు మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించడం జరిగిందన్నారు. మైనార్టీలు, మైనార్టీల పథకాల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందాలన్నారు. 40అంశాల్లో రాష్ట్రప్రభుత్వం శిక్షణను ఇచ్చి జాబ్ మేళాల ద్వారా మైనార్టీలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. ఇప్పటికే విజయవాడ, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రభుత్వం స్వయం ఉపాధికోసం సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తోందని ఇప్పటికే చాలా మంది ప్రయోజనం పొందారని గుర్తు చేశారు. రాష్ట్రప్రభుత్వం మైనార్టీల కోసం బ్యాంకుల ద్వారా సబ్సిడీ పథకం, రోషిణి పథకం, శిక్షణ, ఉపాధి, న్యాయశాస్త్ర పట్ట్భద్రులకు శిక్షణ, ఆర్థికసహాయం, దుల్హన్ పథకం, దుకాణ్ మకాన్ పథకం, ప్రీ మెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాలు అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ షరీఫ్ మాట్లాడుతూ మైనార్టీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికోసం రాష్ట్రప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధి దశలో ముందుకెళుతోందన్నారు. దుల్హన్ పథకం కింద పేద ముస్లింలకు వివాహానికి రూ.50వేలు ఇస్తున్నామన్నారు. సమావేశంలో ఏపి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్లు అన్వర్ హుస్సేన్, మహబూబ్‌బాషా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇడి సంజీవరావు, టిడిపి నాయకులు అమీర్‌బాబు, సుభాన్‌బాషా, జిలానిబాషా, అక్బర్ పాల్గొన్నారు.