కడప

ముంపువాసులకు ప్రత్యేక ప్యాకేజీ చెక్కులు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, జనవరి 9: గండికోట నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ చెక్కులను సోమవారం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మొదటివిడత ముంపునకు గురైన 8 గ్రామాల నిర్వాసితులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముంపుగ్రామాల ప్రజలకు పరిహారం చెక్కులు అందజేస్తున్నామని, ముంపువాసులందరికీ చెక్కులు అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. గ్రామాల వారీగా కౌంటర్లను ఏర్పాటుచేసి అందిస్తున్నామన్నారు. మొదట ముంపుకు గురయ్యే చెవిటిపల్లె, ఓబన్నపేట, సీతాపురం, గండ్లూరు, కె.బొమ్మేపల్లె, దొరువుపల్లె, బుక్కపట్నం, గంగాపురం గ్రామాల నిర్వాసితులకు 16 కౌంటర్లను ఏర్పాటుచేశామని, విడతల వారీగా అందిస్తామన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గండికోట సమస్యలను ఎప్పటికప్పుడు మంత్రి దేవినేని ఉమాతో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శశిభూషణ్‌కుమార్ దృష్టికి ఇక్కడి సమస్యలను తెలుపుతూ వచ్చామన్నారు. ఎవరూ ఊహించనివిధంగా గతంలోనున్న రూ.1.86 లక్షల ప్యాకేజీని రూ.6.75 లక్షలకు పెంచడం, పునరావాసంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి రూ.3.75 లక్షలు అందించడం ఆనందించదగ్గ విషయమన్నారు. గత ఏడాది అక్టోబర్ 8వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో తాను, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం.రమేష్, మండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి ముంపువాసులతో కలిసి పునరావాస ప్యాకేజీ తక్కువగా ఉందని, ప్యాకేజీని పెంచాలని నివేదికలను ముఖ్యమంత్రికి పంపించగా ముఖ్యమంత్రి పెద్దమనస్సుతో అంగీకరించారన్నారు. అనంతరం రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ముంపువాసుల సమస్యలను ఉన్నతాధికారులతోపాటు ముఖ్యమంత్రి, మంత్రి దేవినేని ఉమా, పునరావాస కమిషనర్ దృష్టికి తీసుకుపోయామని, అధికారులను సైతం గ్రామాలకు పిలిపించి ఇక్కడి సమస్యలను తెలిపామన్నారు. ముఖ్యమంత్రిని అనేకసార్లు కలిసి ముంపువాసుల సమస్యలను గుర్తుచేశామని, ఆయన ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకొని కలెక్టర్ సమక్షంలో పంపించిన నివేదికలను ఆమోదించారన్నారు. డిసెంబర్ 31వ తేదీ క్యాబినెట్ సమావేశంలో ముంపువాసులకు రూ.479.35 కోట్ల పరిహారాన్ని ఆమోదించారన్నారు. ఈనెల 4వ తేదీ జిఒను విడుదలచేశారని, ఇంత పెద్దఎత్తున ముంపుపరిహారం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 11వ తేదీన పైడిపాళెముకు ముఖ్యమంత్రి రానున్నారని, సభకు పెద్దఎత్తున ముంపువాసులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆది, రామసుబ్బారెడ్డిలు కోరారు. అనంతరం ముంపువాసులకు చెక్కులు పంపిణీచేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శే్వత, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేష్‌నాయుడు, జిఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావు, ఎంపిపి అనురాధ, మార్కెట్‌యార్డు ఛైర్మన్ వైవి.నారాయణరెడ్డి, లాయర్ మురళి, ఉప మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి, తహశీల్దార్ ఉదయ్‌సంతోష్, పెద్ద ఎత్తున ముంపువాసులు పాల్గొన్నారు.