కడప

ఉక్కుపరిశ్రమపై నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు టౌన్, జనవరి 21: విభజనచట్టంలో పొందుపరిచినవిధంగా కడపజిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబు, బిజెపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి, మాజీమంత్రి డాక్టర్ ఎంవి.మైసూరారెడ్డిలు పేర్కొన్నారు. శనివారం ఉక్కుపరిశ్రమ సాధనకై ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి మద్దతు తెలిపిన అనంతరం వారు ప్రసంగించారు. ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబునాయుడులు జిల్లాలో ఉక్కుపరిశ్రమ, కేంద్ర విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వాలు ఏర్పడి మూడు సంవత్సరాలైనా ఇంతవరకు కనీసం వాటి ఏర్పాటుకు శంఖుస్థాపన కూడా చేయని ప్రభుత్వాల తీరు విమర్శనీయమన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై వైకాపా ఆద్వర్యంలో చాలాసార్లు ప్రశ్నించడం జరిగిందని, అలాగే జీరో అవర్‌లో కేంద్ర ఉక్కుపరిశ్రమశాఖ మంత్రితో కూడా రెండుమూడుసార్లు చర్చించానని అవినాష్‌రెడ్డి తెలిపారు. సీమ ప్రాంత ప్రజల అభివృద్ధికై ఉక్కుపరిశ్రమను సాధించాలనే తపనతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పోరాడుతున్నాడన్నారు. గత నాలుగునెలల నుంచి పాఠశాలలు, కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటుచేసి విద్యార్థులను చైతన్యవంతులనుచేస్తూ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పట్టుదలతో ముందుకెళ్తున్నాడని అన్నారు. అంతేకాకుండా తన ప్రాణాలకుసైతం తెగించి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకొని తిండీతిప్పలు లేకుండా నాలుగురోజులపాటు దీక్షను కొనసాగిస్తున్నాడని ఇది అభినందించదగ్గ విషయమన్నారు. ప్రవీణ్‌కు మద్ధతుగా తమ పార్టీ వెన్నంటి ఉంటుందని, ప్రజలుకూడా తమ పూర్తి సహకారాలనందించి, సమష్టి కృషితో ఉక్కుపరిశ్రమను సాధించుకుందామని వారు పిలుపునిచ్చారు. నాలుగురోజులైనా వైద్యులతో ప్రవీణ్‌కు ఎటువంటి పరీక్షలు జరగకపోవడం, ప్రభుత్వ నేతలు పట్టించుకోకపోవడం బాధాకరమని, ప్రవీణ్‌కు జరగరానిది జరిగితే రాయలసీమ ప్రజల ఆగ్రహాన్ని గురికాక తప్పదని చంద్రబాబును ఆయన హెచ్చరించారు. జిల్లా ప్రజల కోర్కెలను త్చీలన్నారు. అవినాష్‌రెడ్డి వెంట జమ్మలమడుగు వైకాపా ఇన్‌చార్జ్ డాక్టర్ సుధీర్‌రెడ్డి, రైతుసంఘాల ప్రతినిధులు, విద్యార్థిసంఘాలు, వ్యాపారవేత్తలు వచ్చి మద్దతు తెలిపారు.

చౌటపల్లెపై వివక్ష ఎందుకు
కొండాపురం,జనవరి 21: గండికోట ప్రాజెక్టు కింద మొదటి ముంపుగ్రామమైన చౌటపల్లెల్లి అంటే ప్రభుత్వానికి వివక్షత ఎందుకని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అన్నారు. ఆమె శనివారం ఉదయం చౌటపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో సమస్యను తెలుసుకుని కొండాపురంలోని తహశీల్దార్ కార్యాలయానికి ముంపువాసులతో కలిసి వచ్చి తహశీల్దార్ ఉదయసంతోష్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం గండికోట ప్రాజెక్టులో 5 టిఎంసిల నీరు నింపితే ఆరుగ్రామాలు మునకకు గురౌతాయన్నారు. మొదటి గ్రామమైన చౌటపల్లి గ్రామానికి పూర్తి స్థాయిలో పరిహారం అందించకుండా వివక్షత చూపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మునగని గ్రామాలకు 80శాతం పరిహారం అందించి మొదటి గ్రామమైన చౌటపల్లెకు 20 శాతం పరిహారం అందించడం ఎంతవరకు సబబని ఆమె ప్రశ్నించారు. గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకులస్తులకు ఇంకా చెక్కులు అందజేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పరిహారం చెక్కులు అందజేయాలని ఆమె తహశీల్దార్‌ను కోరారు.
అర్హులందరికీ పరిహారం : తహశీల్దార్
ముంపుపరిహారానికి అర్హులైన అందరికీ పరిహారం అందిస్తామని తహశీల్దార్ ఉదయ్ సంతోష్ తెలిపారు. గ్రామాల్లో ఏ ఒక్కరూ ఆందోళన చెందవద్దన్నారు. ప్రతిరోజు తాము ముంపుగ్రామాలు పర్యటిస్తున్నామన్నారు. గ్రామంలోకి గండికోట నీరు ఎక్కువగా చేరుతున్న నేపధ్యంలో ముంపుప్రజలు గ్రామాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో చేరాలని ఆయన సూచించారు. పరిహారం ప్రతి ఒక్కరికీ అందుతుందన్నారు. అలాగే ఇక్కడి సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తున్నామని ఆయన తెలిపారు.