కడప

కడప రిమ్స్‌లో ఉక్కు ఉద్యమనేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 22: జిల్లాలో ఉక్కుపరిశ్రమ స్థాపన కోసం స్థాపించాలని డిమాండ్ చేస్తూ గత ఐదురోజులుగా ప్రొద్దుటూరులో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని ఆదివారం పోలీసులు అరెస్టుచేశారు. ఈనెల 18వ తేదీ నుంచి శివాలయం సెంటర్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన ఉద్యమ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రజల మద్దతుతోపాటు వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి నుంచి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి దీక్షా శిబిరాన్ని బలవంతంగా ఎత్తివేయాలని పోలీసులు ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆదివారం ఉదయం 8.15గంటల ప్రాంతంలో వైద్యపరీక్షల పేరుతో నిర్వహిస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కడప రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో కూడా ఆయన వైద్య పరీక్షలను నిరాకరించారు. ఈలోపు ఉద్యమసాధన సమితి కార్యకర్తలు వందలాది మంది రిమ్స్‌కు చేరుకుని కొంతమంది ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సతీమణి వౌనికారెడ్డి, అక్క హరితారెడ్డిలు ప్రొద్దుటూరులో ఆందోళనకు దిగారు. తన భర్త తీవ్రవాది కాదని పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సివస్తుందని హెచ్చరించారు. ఉక్కుసాధన సమితి కార్యదర్శి అమర్‌నాథరెడ్డి ప్రొద్దుటూరులో కార్యకర్తలతోపాటు పెద్ద ఎత్తున మానవహారాన్ని నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. రిమ్స్‌లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైద్యపరీక్షలకు నిరాకరించగా డిఎస్పీ, ఎస్పీలు సంప్రదించినట్లు సమాచారం. త్వరలో తిరిగి దీక్షను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని అమరనాధరెడ్డి ప్రొద్దుటూరులో విలేఖర్లకు తెలిపారు.

టెన్త్ ఫలితాల్లో హ్యాట్రిక్ సాధనే ధ్యేయం

కడప,జనవరి 22: జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లోనూ రాష్టవ్రిభజన అనంతరం రాష్ట్రంలోనే ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం, ఈమారు కూడా అదేస్థానం నిలబెట్టుకుని ఫలితాల్లో హ్యాట్రిక్ సాధనకు ఉపాధ్యాయులు అహర్నిశలు కృషి చేస్తూ ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. ముఖ్యంగా డిఇఓ బి.ప్రతాప్‌రెడ్డి డిసెంబర్ 1వ తేదీ నుంచి 55రోజులపాటు పదవ తరగతి విద్యార్థుల పరీక్షలపై ప్రణాళికను రూపొందించి సిలబస్ పూర్తిచేయించి డిసిఇ పద్ధతిలో పరీక్ష నిర్వహణ ఉన్నందున సదరు కేరీర్ ఫౌండేషన్ కోర్సుతో విద్యార్థులకు అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సుగా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. డిఇఓ రాత్రిం బవళ్లు డిప్యూటీ డిఇఓలతో, హెడ్మాస్టర్లతో, మండల విద్యాశాఖాధికారులతో సర్వశిక్ష అభియాన్ అధికారులతో సంప్రదింపులు చేస్తూ అందర్నీ సమన్వయం చేసుకుని పదవ తరగతి ఫలితాలపై నిమగ్నమై ఉన్నారు. డిఇఓ సంక్రాంతి సెలవులు అని కూడా చూడకుంటా అధికారులతో సమావేశాలు ఏర్పాటుచేసి విద్యార్థులపై వత్తిడి పెంచకుండా వారి సామర్థ్యం ప్రకారమే పాఠం నేర్పించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిభావంతుల విద్యార్థుల తరహాలోనే వారిని తీసుకుపోవాలని, ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు సంప్రదిస్తూ ఈమారు టెన్త్ఫ్‌లితాల్లో హ్యాట్రిక్ సాధించాలని ధ్యేయంగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు. గత ఏడాది టెన్త్ పరీక్షలకు 36243 మంది పరీక్షలకు హాజరుకాగా 35840 మంది ఉత్తీర్ణులై 98.94శాతం ఉత్తీర్ణత శాతం సాధించి రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం ఫలితాల్లో నిలిచింది. 306 మందికి రాష్టస్థ్రాయిలో ఉత్తమ ప్రతిభా అవార్డులు లభించాయి. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ 850 హైస్కూల్స్‌లో 35వేల మంది పైబడి విద్యార్థులు హాజరుకానున్నారు. పదవ తరగతి ఫలితాల్లో జిపిఏ సాధనే ధ్యేయంగా ప్రతి విద్యార్థి కృషి చేస్తున్నారు. అంధ, మూగ, చెవుడు పాఠశాలలు, అలాగే డిఇఓ గురుకుల పాఠశాలలు, ఆదర్శపాఠశాలలు, కస్తూరీబా పాఠశాలలు ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ, బిసి వసతి గృహాల అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో ఈమారు కూడా మొదటిస్థానం సంపాదించేందుకు ఆయన చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాలలో హెడ్మాస్టర్లతోపాటు సంబంధిత పాఠ్యం బోధించే ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధపెట్టి పరీక్షలు నెగ్గేందుకు కసరత్తు చేస్తున్నారు. కడప,ప్రొద్దుటూరు పురపాలక సంఘం పాఠశాలల్లో డిఇఓ 52వ కార్యాచరణ ప్రణాళిక పూర్తిచేసి 10/10 ఫలితాల్లో జిపిఏ ర్యాంకుపైనే హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు దృష్టిపెట్టి తమ పాఠశాలల్లో వందశాతం ఫలితాలకోసం కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులు చదవడమేగాకుండా అక్షర దోషాలు లేకుండా చేతిరాతపై కూడా అధికారులు, ఉపాధ్యాయులు దృష్టిపెట్టారు.

గడువులోగా రోడ్డు పనులు
పూర్తయ్యేనా..?
కొండాపురం, జనవరి 22: గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన కడప - తాడిపత్రి ప్రధానరహదారి ముద్దనూరు మండలం శెట్టివారిపల్లె నుండి కొండాపురం మండలం సుగుమంచిపల్లె వరకు సుమారు 30కి.మీ.ల పొడవున ముంపుకు గురవుతోందని నీటిపారుదలశాఖ అధికారులు అంచనా వేసి ప్రత్యామ్నాయ పనులు ప్రారంభించారు. ఈ పనులకు శ్రీకారం చుట్టి దాదాపు ఆరు సంవత్సరాలైనా వివిధ కారణాలతో దారి మళ్లింపు రహదారి నిర్మాణానికి గ్రహణం పట్టుకుంది. కాలం గడిచేకొద్దీ రహదారి నిర్మాణ వ్యయం రెండింతలు దాటి ప్రస్తుతం సుమారు వందకోట్లరూపాయలకు చేరుకుంది. గండికోట జలాశయం నందు సుమారు 5.7 టి ఎంసీల నీరు చేరితే ముద్దనూరు - తాడిపత్రి ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు కష్టమవుతాయి. గత యేడాది అక్టోబర్ 2వ తేదీ నుండి అవుకు జలాశయం నుండి గండికోట జలాశయానికి నీరు వస్తున్నా కృష్ణా జలాలు ఆదివారం నాటికి 5.060 టి ఎంసీలకు చేరుకున్నాయి. శనివారం రాత్రికే కొద్దిపాటి కృష్ణాజలాలు గంగాపురం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపైకి చేరుకున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా అధికారులు చుట్టూ మట్టికట్ట ఏర్పాటుచేశారు. అలాగే చెవిటిపల్లె వద్దనున్న చిత్రావతి బ్రిడ్జి ప్రమాదకరంగా ఉంది. దీంతో ముద్దనూరు నుంచి తాడిపత్రికి వెళ్లే వాహనాలను ఈ రహదారిలో అనుమతించలేదు. గతంలో నిత్యం ఎంతోమంది ఈ రహదారి గుండా తాడిపత్రి, అనంతపురం, గుంతకల్, గుత్తి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు. రోడ్డు డైవెర్షన్ కారణంగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేస్తున్న రోడ్లు పూర్తికాకపోవడంతో వాహనదారులను గ్రామాల నుంచి పంపిస్తున్నారు. కొందరు వాహనదారులు రహదారి అర్థంకాక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం పూరె్తై వుంటే వాహనదారులకు ఈ ఇబ్బందులు తప్పేవి. ప్రధాన రహదారికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటుచేస్తున్న శెట్టివారిపల్లె నుంచి సుగుమంచిపల్లె వరకు 30కి.మీ.ల పొడవు గల రహదారి గత ఏడాది డిసెంబర్ నాటికి గడువు ముగియడంతో మళ్లీ రహదారి నిర్మాణం పూర్తి చేయటానికి ఈ ఏడాది మార్చి వరకు నిర్మాణ సంస్థకు గడువు పెంచారు. ఈ గడువులోనైనా ప్రత్యామ్నాయ రోడ్డు పనులు పూర్తయ్యేనా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. పనులలో వేగంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. గండికోట ప్రాజెక్టుకు నీరొస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయ రోడ్డుమార్గమును మరింత వేగంగా పూర్తిచేయాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
కొనసాగుతున్న పైప్‌లైన్ మరమ్మతులు
గండికోట ఎత్తిపోతల పథకం నుండి పైడిపాలెంకు నీటిని తరలించేందుకు ఏర్పాటుచేసిన పైప్‌లైన్ పగిలిపోవడంతో గత మూడురోజుల నుంచి పైడిపాళెంకు కృష్ణాజలాలు నిలిపివేశారు. ఈ నేపద్యంలో పైప్‌లైన్‌ను అధికారులు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. పైప్‌లైన్‌లో నిల్వవున్న నీటిని మోటర్లసాయంతో తీసి పైప్‌కు వెల్డింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పైప్‌లైన్ పగిలిపోవడం వలన గండికోట ఎత్తిపోతల పథకం నందున్న మోటర్లను నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మరమ్మతు పనులను శాసనమండలి ఉపాధ్యక్షుడు ఎస్‌వి.సతీష్‌కుమార్‌రెడ్డి వచ్చి పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

బూచుపల్లె చేరిన కృష్ణాజలాలు..
తొండూరు, జనవరి 22: మండలపరిధిలోని బూచుపల్లె గ్రామానికి ఆదివారం కృష్ణాజలాలు చేరాయి. గండికోట నుండి పైడిపాళెం రిజర్వాయర్‌కు నీరు విడుదలచేసిన 11రోజుల తర్వాత పైడిపాళెం రిజర్వాయర్ నుండి ఆదివారం జలాలు గ్రామానికి చేరుకున్నాయి. దీంతో అక్కడి ప్రజలు నీటిని చూసేందుకు పెద్దసంఖ్యలో వచ్చారు. నీరు వచ్చేందుకు కృషిచేసిన శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండలాధ్యక్షుడు శివమోహన్‌రెడ్డి, సర్పంచ్ నాగిరెడ్డి, టిడిపి నాయకులు నరాల రవికుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

అగ్నిప్రమాదంలో ఇళ్లు దగ్ధం

రాజంపేట, జనవరి 22: రాజంపేట పట్టణం నాగులమానువీధిలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగి రూ.2.5 లక్షల ఆస్తినష్టం సంభవించింది. గ్యాస్ స్టౌవ్‌ల తయారీ ఇతరత్రా వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్న వృద్ధుడైన గూనిపూటి పాండురంగయ్య ఇదే ఇంట్లో ఉంటున్నారు. నైట్ డ్యూటీ చేసుకొని ఈ దారినపోతున్న పోలీసులకు ఈ ఇంట్లో నుండి మంటలు, పొగలు రావడం గమనించి, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి, లోపలున్న పాండురంగయ్యను బయటకు తీసుకొని వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడం జరిగింది. అయితే అప్పటికే ఇంట్లోని సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యూట్‌వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వృద్ధుడైన గూనిపూటి పాండురంగయ్య తన జీవనభృతిని కోల్పోవడమే కాకుండా సర్వస్వం కోల్పోవడం అక్కడివారిని కలచివేసింది. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు అగ్నిప్రమాదంలో నష్టపోయిన గూనిపూటి పాండురంగయ్యను ఆదుకోవాల్సి ఉంది.

వామికొండ, సర్వరాయసాగర్‌కు
గండికోట నీరు విడుదల చేయండి

వేంపల్లె, జనవరి 22: గాలేరు-నగిరి ప్రాజెక్టులో అంతర్భాగమైన వామికొండసాగర్, సర్వరాయసాగర్‌లకు గండికోట రిజర్వాయర్ నుండి తక్షణమే నీటిని విడుదల చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ముద్దనూరు, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో తీవ్ర అనావృష్టి పరిస్థితులు ఉన్నాయని, భూగర్భజలాలు అడుగంటి బోర్లలో నీరు రావడం లేదని, దీంతో చీనీచెట్లు, సన్ననిమ్మచెట్లు, అరటికాయ గెలలు పంటలు ఎండిపోతున్నాయని ఆయన తెలిపారు. గండికోట రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీరు ఉందని, గేట్లు ఎత్తితే గ్రౌవిట్ ద్వారా వామికొండ సాగర్, సర్వరాయసాగర్‌లకు నీళ్లు వస్తాయని, ఈ రిజర్వాయర్ల కాలువలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. వామికొండ సాగర్‌కు అర టీఎంసీ, సర్వరాయసాగర్‌కు అర టీఎంసీ విడుదల చేస్తే సరిపోతుందన్నారు. వామికొండసాగర్ కింద ముద్దనూరు, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మండలాల్లో 10 వేల ఎకరాలు ఆయకట్టు ఉందని ఆయన అన్నారు. సర్వరాయసాగర్ కాలువ వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల, కమలాపురం మండలాల్లో సుమారు 25 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. తక్షణమే గండికోట రిజర్వాయర్ నుండి పైడిపాలెం రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ధృవకుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబ్రహ్మణ్యం, బాబు, రామకృష్ణ, నరసింహారెడ్డి, ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి!

సుండుపల్లె, జనవరి 22: మండల వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడింది. మండలానికి సమీపంలోని మడితాడు పంచాయతీ వానరాచపల్లె బిడికి కొలిమిమిట్టలతో పాటు యల్లారెడ్డిగారిపల్లె, మల్లక్కగారిపల్లె గ్రామాల్లో సంవత్సరం నుండి తాగునీటి ఎద్దడి ఉంది. యల్లారెడ్డిగారిపల్లెలో సుమారు 15 గృహాలు మల్లక్కగారిపల్లెలో 40 గృహాలు ఉన్నాయి. అయితే సంవత్సరం కిందట ప్రభుత్వ బోరు నుండి రెండు గ్రామాలకు నీళ్లు వస్తుండేవి. ట్రాన్స్‌ఫార్మర్ రైతులకు సంబంధించింది కావడంతో ఈ ట్రాన్స్‌ఫార్మర్ నుండి మంచినీటి పథకం బోరుకు వైరు తెచ్చుకున్న సొంత డబ్బులు వెచ్చించి ట్రాన్స్‌ఫార్మర్ తెచ్చుకున్నా ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు మూడు బోర్లు ఉన్నాయి. కాబట్టి ఇంకొక ట్రాన్స్‌ఫార్మర్ తెచ్చుకోవాలని సదరు రైతులు తెలిపారు. సంవత్సరం కిందట వైరు కనెక్షన్ తీయడంతో రెండు గ్రామాలకు తాగునీటి ఎద్దడి నెలకొంది. జన్మభూమిలోను, రెండు సార్లు మండల సర్వసభ్య సమావేశంలోను తహసిల్దార్, ఎంపీడీవో అధికారులకు గొంతు ఎండిపోతున్నదని అనేకమార్లు అర్జీలు ఇచ్చారు. అయినా మల్లక్కగారిపల్లె, యల్లారెడ్డిగారిపల్లె ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. అలాగే మడితాడు పంచాయతీలో మంచినీటి సమస్య అధికంగా ఉందని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ దృష్టికి వెళ్ళినా ఫలితం మాత్రం శూన్యం వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. విద్యుత్ ఉన్న సమయంలో మాత్రమే బోర్ల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. రైతులు ఆ భూముల్లోకి రావద్దండి, మీకు నీళ్లు ఇవ్వము, మా పొలాలకే నీళ్లు సరిపోవడం లేదని చీవాట్లు పెడుతున్నారని పలు గ్రామాల్లోని మహిళలు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేర్చడం లేదు. మా ఓట్ల పుణ్యమా అని గెలిచి చివరకు మమ్మల్ని పట్టించుకోవడం ఏమిటని చాలా దౌర్బాగ్య పరిస్థితుల్లో మేము జీవనం గడుపుతున్నామని వారు తెలిపారు. సంవత్సరం నుండి ప్రజాప్రతినిధులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
నీరిచ్చి పుణ్యం కట్టుకోండి..
ఇస్మాయిల్, మడితాడు ఉపసర్పంచ్..
నీటి కోసం వ్యవసాయ బోర్ల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. కరెంటు ఉన్నపుడే నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మడితాడు గ్రామ పంచాయతీ ప్రజలది. ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. రేపు నెలలోగా నీరు రాకపోతే ప్రజలు ఇబ్బందుల పాలవుతారు. రాబోవు వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సమస్యలు తక్షణమే తీర్చండి.

26న రాజంపేటలో మెగా జాబ్‌మేళా

రాజంపేట, జనవరి 22:రాజంపేట నారాయణాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్టు విప్ మేడా మల్లికార్జునరెడ్డి తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి నుండి ఇంజనీరింగ్, ఎంబిఎ తదితర కోర్సులు పూర్తి చేసిన వారి వరకు ఉద్యోగావకాశాలు ఈ మేళాలో కల్పిస్తున్నామన్నారు. 10కి పైగా వివిధ కంపెనీల ద్వారా 1230కి పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్‌మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ జాబ్ మేళాలో రూ.8వేల నుండి రూ.25వేల వరకు జీతాలు అందించే ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. దేశ, విదేశాలు తిరుగుతూ మన ముఖ్యమంత్రి రాష్ట్భ్రావృద్ధికి వివిధ కంపెనీలను రాష్ట్రానికి రప్పించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని, అందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ మెగా జాబ్ మేళాలో హైదరాబాద్‌కు చెందిన సాప్ట్‌బూట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జావా డవలపర్స్, నెట్ డవలపర్స్ తదితరుల కోసం బిటెక్, బిఎస్సీ, ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన నిరుద్యోగులకు కు 20 ఉద్యోగాలకు, ఇండియన్ హెల్త్ బిపిఓ ద్వారా బి ఫార్మశీ, ఎం ఫార్మశీలతో గ్రాడ్యువేట్లకు కస్టమర్ సర్వీసు కోంస 120 ఉద్యోగాలకు, జి4ఎస్ కంపెనీ 10, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సెక్యూరిటీ గార్డ్స్ కోసం 600 మందికి, ఓన్లీ సక్సెస్ కంపెనీ ద్వారా ఐఐటి, 10, ఇంటర్, డిగ్రీ చేసిన విద్యార్థులకు మల్టిపుల్ ఓపెనింగ్స్‌కు 80 మందికి, ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా గ్రాడ్యువేట్, ఎంబిఎ చేసిన విద్యార్థులకు సేల్స్ ఆఫీసర్స్ కోసం 30 మందికి, వినుత్న ఫర్టిలైజర్స్ కంపెనీ గ్రాడ్యువేట్, ఎంబిఎ చేసిన విద్యార్థులకు సేల్స్ కోసం 60 మందికి, మార్గ్ హ్యూమన్ రిసోర్స్ కంపెనీ, సిఐపిఇటి కంపెనీలు ఎస్‌ఎస్‌సీ చేసిన విద్యార్థులకు మల్టిపుల్ ఓపెనింగ్స్‌కు 250 మందికి, వర్‌టెక్స్ బిపిఓ కంపెనీ ఇంటర్, గ్రాడ్యువేట్ విద్యార్థులకు వాయిస్ ప్రాసెస్‌కు 50 మందికి, ఫాసస్ కంపెనీ బిహెచ్‌ఎం చేసిన విద్యార్థులకు మేనేజిమెంట్ కోసం 20 మందికి ఇంటర్వూలు నిర్వహిస్తుందన్నారు. ఈ కంపెనీలే కాకుండా మరిన్ని కంపెనీలు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనే అవకాశాలున్నాయని మేడా చెప్పారు.
ఉచిత కంటి వైద్య శిబిరం
ఈ నెల 26వ తేదీనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బెంగుళూరుకు చెందిన శంకర్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత కంటి వైద్య చికిత్సలతో పాటు అవసరమైన వారికి ఉచిత బస్సు సౌకర్యాలతో ఉచితంగా బెంగుళూరుకు తీసుకెళ్ళి ఆపరేషన్లతో పాటు కంటి అద్దాలు, మందులు అందిస్తామ న్నారు. కార్యక్రమంలో కడప ఎపిఎస్‌ఎస్‌డిసి ఇన్‌ఛార్జ్ సంపత్‌కుమార్, నారాయణాద్రి ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి ప్రసాద్‌రెడ్డి, రాజంపేట ఆసుపత్రి ఆడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు వడ్డి రమణ, జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు జి.గుల్జార్‌బాషా, రాజంపేట పట్టణ టిడిపి అధ్యక్షులు టి.సంజీవరావు పాల్గొన్నారు.

రాజంపేటలో పోలీసుల స్పెషల్‌డ్రైవ్
సత్ఫలితాలిచ్చేనా?

రాజంపేట, జనవరి 22: పట్టణంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలు నియంత్రించేందుకు పోలీసులు చర్యలు మొదలెత్తారు. ఈ చర్యలు సత్ఫలితాలిస్తాయా? ఇవ్వవా? అన్న విషయాన్ని ప్రక్కనుంచితే ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు మొదలవ్వడం సంతోషించదగ్గ విషయం. అయితే పూర్తిస్థాయి చర్యలు లేకుండా ట్రాఫిక్‌ను ఏ విధంగా నియంత్రిస్తారో అర్థం కావడంలేదు. అయితే ట్రాఫిక్‌ను తమ పరిధిలో క్రమబద్దీకరించేందుకు రాజంపేట అర్బన్ సిఐ అశోక్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ముందుగా ఆర్టీసీ డిఎం సహకారంతో పట్టణ ప్రధాన రహదారిలో పాత బస్టాండు నుండి ఆర్టీసీ బస్టాండు వరకు ఆర్టీసీ బస్సులు మధ్యలో నిలపకుండా చర్యలు మొదలెత్తారు. ఇందువల్ల ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ప్రధాన రహదారిలో ఆగినప్పుడు బస్సు వెనుక ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితులు తప్పుతాయన్నది పోలీసుల ఆలోచన. అలాగే ప్రధాన రహదారిలో ఆటోలు ఇతరత్రా వాహనాలు కూడా రోడ్డు మధ్యలో ఆగకుండా అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఈనెల 19వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులు, ఆటోలు తదితర ఇతరత్రా వాహనాలు నిలవకుండా చర్యలు మొదలెత్తినా ఇంకా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆటోలను నియంత్రించడం ద్వారా కూడా ట్రాఫిక్ ఇబ్బందులను అదుపు చేయవచ్చని పోలీసు లు భావిస్తూ ఈ మేరకు కూడా చర్యల కు ఉపక్రమిస్తున్నారు. ముందుగా పట్టణంలో అవసరమైన కూడళ్ల వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని వన్‌వే పద్దతి అమలుపై కూడా స్థానికులు, పట్టణ ప్రముఖుల తో సమావేశమై ప్రజలకు ఇబ్బందులు లేనివిధంగా అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తామని అర్బన్ సిఐ అశోక్‌కుమార్ చెపుతున్నారు. అలాగే మార్కెట్ వద్ద రోడ్డుపై వ్యాపారాలను అదుపుచేసి, అన్నిరకాల వ్యాపారాలను మార్కెట్‌లోకి పంపడం ద్వారా మార్కెట్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించే పరిస్థితులను కూడా పోలీసు లు అధ్యయనం చేస్తున్నారు. తోపుడు బండ్లవద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలపై లోతుగా పరిశీలనచేసి తోపుడుబండ్ల వ్యాపారస్తుల వ్యాపారానికి ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చన్న దానిపై కూడా మున్సిపల్ శాఖ అధికారులతో పోలీసులు దృష్టిపెట్టారు. ముందుగా ఆర్‌అండ్ బి వద్ద రోడ్డు విశాలంగా ఉన్నందున ఇక్కడ బస్టాప్ లాంటి వసతులు సమకూర్చి పట్టణ ప్రజలు పాత బస్టాండు తరువాత బస్సులు ఎక్కేందుకు వసతు లు ఇక్కడ సమకూరించేందుకు ఉన్న అవకాశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలన మొదలెత్తారు. ఇకపోతే రాజంపేట ఆర్డీఓగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన వీరబ్రహ్మం కూడా పట్టణంలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు అవసరమైన చర్యలపై దృష్టి పెట్టడం విశేషం. ఇందులో భాగంగా పట్టణంలో విద్యుత్తు, టెలీకం, ఆర్టీసి, ఆర్ అండ్ బి, మున్సిపాలిటీ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి ఆయా శాఖల ద్వారా తీసుకునే చర్యలతో ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమించవచ్చన్న దానిపై చర్చించనున్నారు. ఇకపోతే పట్టణ ప్రధాన రహదారిని తీసుకుంటే పాత బస్టాండు నుండి ప్రధాన మార్కెట్ వరకు రోడ్డు చాలా ఇరుకుగా ఉండడం రోడ్డు విస్తరణ ఇప్పుడిప్పుడే సాధ్యం కాని వ్యవహారం కనుక వాహనాలు ప్రాంతంలో నిలవకుండా ఉంటే చాలా వరకు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయవచ్చన్న ఆలోచన చేస్తున్నప్పటికి పోలీసులు ఈ విషయంలో ఎంతవరకు సఫలీకృతులవుతారన్నది వేచిచూడాలి.

పింఛా ప్రాజెక్టు మరమ్మతుకు మోక్షం కలిగేనా..

సుండుపల్లె, జనవరి 21: సుండుపల్లె మండలంలో కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన పింఛా నదిపై నిర్మించిన ఆదినారాయణరెడ్డి పింఛా ప్రాజెక్టుపై వాలిన నీలినీడలు 2017 సంవత్సరంలోనైనా తొలగేనా అని రైతులు ఎదురుచూస్తున్నారు. మండలంలోని రైతులకు పింఛా ప్రాజెక్టు వరప్రసాదిని. ప్రాజెక్టు నేడు రైతులకు ఆందోళనకు గురిచేస్తోంది. తుప్పు పట్టిన గేట్లు నీరు వచ్చినా వృధా అవుతుండటం రైతులకు పింఛా ప్రాజెక్టుపై కలవరపాటు మొదలైంది. 1954లో ప్రాజెక్టు పనులను ప్రారంభించి 1960లో పూర్తి చేయడం జరిగింది. 1961 నుండి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు సుమారు 4 వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందిస్తుంది. కుడి, ఎడమకాల్వల ద్వారా పొలాలకు నీటిని విడుదల చేస్తారు. అయితే ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయు ప్రధాన గేట్లు తుప్పుపట్టడం, ఆ గేట్లకు సరైన మరమ్మత్తులు చేయకపోవడంతో గేట్లు నేడు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పవచ్చు. గత ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు పించా అధికారులు నివేదికలు పంపుతున్నా ప్రాజెక్టు మరమ్మత్తులు మాత్రం జరగడం లేదు. ఈ సంవత్సరంలో నైనా ప్రాజెక్టుపై వాలిన నీలినీడలు తొలగించి ప్రాజెక్టుకు నాణ్యమైన పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాజెక్టు దిగువలో ఉన్న కుడి, ఎడమకాల్వల మరమ్మతుల నిమిత్తం సుమారు రూ.1.60 కోట్లు నిధులు మంజూరైనా అరకొరగా పనులు చేసి నిధులను మింగేసినట్లు పలువురు మాజీ సర్పంచులు, రైతులు లబోదిబోమంటున్నారు. కాలువ పనుల్లో నిర్లక్ష్యంతో కాలువలలో పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. దీంతో రైతులు తమ పొలాలకు నీరు అందేదెప్పుడు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కుడి కాలువ పనులను కాలువ పనులకు మహర్దశ చేరే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఆయకట్టుదారు రైతులు కోరుకుంటున్నారు.

ఏపి గిరిజన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో
ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు
కడప,(కలెక్టరేట్)జనవరి 22: ఆంధ్రప్రదేశ్ గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు చేస్తుంది. గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ సంస్థను స్థాపించింది. మరోపక్క గిరిజనుల నుంచి అటవీప్రాంతాల నుంచి సేకరించిన ముడిసరుకును శుద్ధిచేసి రసాయనిక రహిత ప్రకృతి సిద్దమైన ఆహార ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ ఉసిరిక, తేనె, మారే డు, నన్నారి, పసుపు, త్రిఫలా చూర్ణం, రసాయనం, కలబంధ, సబ్బులు, షాంపులు తదితర 20 రకాల ఆహార ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. రాష్టవ్య్రాప్తంగా ప్రతి జిల్లాలో ఒక జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. వివిధ జిల్లాల నుంచి గిరిజనుల ద్వారా ప్రతి ఏడాది పొడవునా అటవీ ముడిసరుకులు కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేసిన ముడిసరుకులను నేరుగా తయారీకేంద్రమైన విశాఖ పట్టణానికి ఎగుమతి చేస్తారు. ఇలా సేకరించిన ముడిసరుకులను విశాఖపట్టణంలోని తయారీ కేంద్రంలో ముడిసరుకులు శుద్ధిచేసి రసాయనాలు తొలగించి జీవపదార్థాలు కలిగిన వాటిని వివిధ అందమైన ప్యాకింగ్‌ల్లో నింపి మార్కెట్‌లో విడుదల చేస్తారు. కడప జిల్లాలో గత ఏడాది దాదాపు రూ.50లక్షలు అమ్మకాలు చేపట్టింది. 2017-18వ సంవత్సరానికి కోటిరూపాయల ఆహార ఉత్పత్తుల అమ్మకాలు లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకుసాగుతోంది. గిరిజన కార్పొరేషన్ ద్వారా ఉత్పత్తి అవుతున్న ఆర్గానిక్ ఆహార వస్తువులు వినియోగించుకుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపి గిరిజన్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ జిల్లా అధికారి రమణారెడ్డి పేర్కొన్నారు. ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని మరిన్ని కొత్త ఉత్పత్తులు విడుదల చేస్తామన్నారు.