కడప

కృష్ణా జలాలకు జగన్ ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 4: గండికోట ప్రాజెక్టులో అంతర్భాగమైన పైడిపాలెం రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు వస్తున్న తరుణంలో శనివారం ప్రతిపక్షనేత, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించి కృష్ణాజలాలకు ప్రత్యేక పూజలు చేశారు. జగన్ పులివెందుల నుంచి భారీ ఎత్తున కాన్వాయ్‌తో పైడిపాలెం ఎత్తిపోతల ప్రాంతానికి చేరుకున్నారు. జగన్‌రాక ముందుగానే ఆ ప్రాంత ప్రజలకు తెలియడంతో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆయన రైతులతో మమేకమై జలాలు వద్దకు ప్రజలతోపాటు చేరుకుని ఆయన పూజలు నిర్వహించారు. రైతులతో ఆయన ముచ్చటిస్తూ తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల సాకారమైందని, తన తండ్రి, తమపార్టీ రైతు పక్షపాతమని జిల్లాకు సాగునీరు, తాగునీరు తెప్పించే ఉద్దేశ్యంతో దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధిక ప్రాముఖ్యత కల్పించినట్లు జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెంగయ్యకుమార్ (జగన్‌కు వివరించారు. పైడిపాలెం ఎత్తిపోతల పథకం నుంచి ఏ ప్రాజెక్టుకునీరు చేరుతుందో ఎన్ని క్యూసెక్కుల నీరు పంపుతారో వివరించారు. గతనెల 11న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు రిజర్వాయర్‌కు గేట్లు ఎత్తివేసి, జాతికి అంకితం చేసి పులివెందులకు నీరు అందించే విధంగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ తన తండ్రి హయాంలో ఈప్రాజెక్టుకు 90శాతం నిధులు ఇచ్చామని టిడిపి ప్రభుత్వం మూడేళ్లుగా ముష్టి అంత ఖర్చుపెట్టి ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి తమ హయాంలో నిర్మాణం పూర్తిచేశామని టిడిపి నేతలుగొప్పలు చెప్పుకుంటున్నారని జగన్ ఎద్దేవాచేశారు. ఈకార్యక్రమంలో ఆయన వెంట కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షుడు ఏ.అమరనాధరెడ్డి, జమ్మలమడుగు పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ సుధీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై వైకాపా ఎమ్మెల్యేల దృష్టి..

కడప,్ఫబ్రవరి 4: గత మూడు రోజులుగా జగన్ జిల్లాలో పర్యటిస్తుండడంతో స్థానిక వైకాపా నేతల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిమిత్తం మూడురోజులపాటు జిల్లాలో పర్యటించి నియోజకవర్గాల వారీగా ఓటు హక్కు కలిగిన స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నిన్నా మొన్నటి వరకు వైకాపా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిడిపి అభ్యర్థులకు ఓటు వేసేందుకు సంసిద్దతగా ఉండగా జగన్ జిల్లా పర్యటనతో అంతర్మధనంలో పడ్డారు. జగన్ గురు, శుక్ర, శని వారాల్లో వైసిపి ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాన్ని రచించడం, జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, మున్సిపల్ చైర్మర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో నియోజకవర్గాల వారీగానే సమీక్షించి ఎమ్మెల్సీ ఎన్నికలపై వాడివేడిగా చర్చించారు. చర్చల్లో పలువురు వివిధ రకాల అనుమానాలు, ప్రశ్నలు జగన్‌కు సంధించడంతో జగన్ ఓపిగ్గా విని మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం రావడం ఖాయమని, రెండేళ్లు ఓపిక పట్టాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తానిరూపించుకుంటే పార్టీకి భవిష్యత్ ఉంటుందని, ఏ ఒక్కరు తమ ఓటును తమ ఓటును పార్టీ అభ్యర్థులకే వేయాలని ఆయన పదే పదే నొక్కిచెప్పారు. వైఎస్ కుటుంబ సభ్యులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించడంతోపాటు జిల్లాలోని వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులతో క్యాంపులు ఏర్పాటుచేసి తమ పార్టీ నుంచి చేజారిపోకుండా చూసుకోవాలని గట్టి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు, బద్వేలు వైకాపా ఎమ్మెల్యేలు సి.ఆదినారాయణరెడ్డి, టి.జయరాములు పార్టీకి గుడ్‌బై చెప్పి టిడిపిలో చేరడంతో పార్టీ నుంచి గెలుపొందిన జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లతో నేతలు చర్చించాలని ఆ నేతలకు ప్రత్యామ్నాయంగా నేతలను నియామకం చేశామని వారి ద్వారా స్థానిక నేతలు పక్కకుపోకుండా చూడాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని జగన్ పార్టీ నేతలకు హితబోధ చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు విషయంలో ఏవైనా తేడాలు వస్తే పార్టీకి, తమకు రాజకీయ భవిష్యత్‌తోపాటు ఉనికే ఉండదని, ప్రతి ఒక్కరు అధికారపార్టీ ప్రలోభాలకు లొంగకుండా ఈ ఎన్నికల్లో సొంత ఎన్నికలుగా భావించి పనిచేయాలని ఆయన కోరినట్లు తెలిసింది. ఆయన మూడురోజుల పర్యటనలో ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాథరెడ్డి, ఎమ్మెల్యేలు జి.శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు వెంకటశివప్రసాద్‌రెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, కె.శ్రీనివాసులు, ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి, ముఖ్యనేతలను వెంటపెట్టుకుని పర్యటించారు. శనివారం పైడిపాలెం ప్రాజెక్టును సందర్శించి తెలుగుదేశంపార్టీపై ఘాటుగా విమర్శలు చేశారు. మొత్తంమీద జగన్ జిల్లా పర్యటనతో వైసిపికి చెందిన స్థానిక సంస్థలప్రజాప్రతినిధులు నేతలంతా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

తమిళ ఎర్ర కూలీల అరెస్టు

కడప,్ఫబ్రవరి 4: కడప జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో 31 మంది తమిళ ఎర్రచందనం కూలీలు, నెల్లూరు జిల్లా కావలి ఆర్టీసీ డిపోకు చెందిన ముగ్గురు డ్రైవర్లను అరెస్టుచేసినట్లు ఏఎస్పీ (ఓఎస్‌డి) బి.సత్యయేసుబాబు శనివారం జిల్లా పోలీసుపేరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. తమిళ కూలీల వద్ద నుంచి టన్ను బరువుగల 39 ఎర్రచందనం దుంగలు, 18 సెల్‌ఫోన్స్, స్కార్పియో, టాటాసుమోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శనివారం తెల్లవారు జామున విశ్వసనీయ సమాచారం మేరకు దువ్వూరు ఎస్‌ఐ, సిబ్బంది కలిసి దువ్వూరు మండలం కృష్ణంపల్లె గ్రామానికి తూర్పువైపున గల నల్లమల అటవీప్రాంతంలో నారాయణస్వామి మఠం సమీపాన అక్రమ రవాణా చేసేందుకు సిద్దంగా ఉంచిన 14 ఎర్రచందనం దుంగలు, 10సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని అంతర్ రాష్ట్ర స్మగ్లర్ల శివకుమార్, 10మంది కూలీలను అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టయిన వారిలో తిరువన్నామళై జిల్లాకు చెందిన శివకుమార్ (25) ఎర్రచందనం స్మగ్లర్ కాగా, వెల్లియాన్ బాబు (29) , పొన్నుస్వామి మురుగన్ (20), హనుమాన్ ముత్తు (20) వేలూరు జిల్లా. హనుమాన్ మార్గంధన్ (19), సుబ్రమణి రమేష్ (35), ఆనందన్ లోకేష్ (33), అండి పరమశివన్ , వెడికలి (37), వెడికుమార్ (30), కలికలి (21)లు అలాగే కావలి డిపోకు చెందిన డ్రైవర్ గల్లా యేసుపాదంను (45) అరెస్టు చేసినట్లు వారి వద్దనుంచి 14 ఎర్రచందనం దుంగలు, 10సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే శనివారం తెల్లవారు జామున మైదుకూరు రూరల్ సిఐ, సిబ్బంది కలిసి ఖాజీపేట మండలం నాగపట్నం గ్రామానికి సమీపాన గల లంకమల ఫారెస్టు వద్దవున్న కనె్నలవాగు చెరువు వద్ద టాటా సుమో వాహనంలోకి ఎర్రచందనం లోడు చేస్తుండగా తమిళ స్మగ్లర్ రామన్ అండీ గోవిందన్‌తోపాటు తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టయిన వారి వద్ద నుంచి 13 ఎర్రచందనం దుంగలు, 7 సెల్‌ఫోన్లు, టాటా సుమో వాహనం స్వాధీనం చేసుకుని వారు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నూరు పట్టణంలో శివరామ్ హోటల్ వద్ద కావలి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు గోపాల్‌రెడ్డి, సప్తగిరిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఖాజీపేట సంఘటనలో ఎర్రచందనం స్మగ్లర్ అండీ గోవిందన్ (35), గోవిందన్ మహేంద్రన్ (36), రామన్ మురుగన్ (28), గోవిందరాజ్ సంపత్ (27),పెరుమాళ్ క్రిష్ణమూర్తి (23), కులాన్ వెంకటేషన్ (39), మణిశ్రావణ్ (20), మణి మోహన్‌రాజ్ (20), పెరుమాల్ శంకర్ (27)తోపాటు ధర్మపురి పట్టణం తమిళనాడు డ్రైవర్ షణ్ముగం గోపీనాధన్ (27)ను అరెస్టు చేశామన్నారు. మైదుకూరు సంఘటనలో శనివారం ఉదయం మైదుకూరు సిఐ, సిబ్బంది కలిసి మైదుకూరు మండలం వనిపెంట అటవీప్రాంతంలోగల బైరవకోన వద్ద స్కార్పియో వాహనంలోకి ఎర్రచందనాన్ని లోడ్ చేస్తుండగా తమిళస్మగ్లర్ తుక్కన్‌తోపాటు తొమ్మిది మందిని అరెస్టుచేసి వారి వద్ద నుంచి 12 ఎర్రచందనం దుంగలు, సెల్‌ఫోన్, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ సంఘటనలో వేలూరుకు చెందిన స్మగ్లర్ తుక్కన్ నంది (36)తోపాటు తుక్కన్ తుక్కన్ (30), లక్ష్మణ్ హనుమాన్ (29), యువరాజ్ మురళి (27), మురుగన్ (43), ఏ.అన్నామళై (43), ఎం.మున్నుస్వామి (55), పాండిచ్చేరికి చెందిన చిన్న తంబి (40), ఓసూరుకు చెందిన గోవింద్ స్వామిగన్ (27), పొలందై రామచంద్రన్ (34)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. కావలి డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లుగా పనిచేస్తున్న వీరు కావలి-బెంగళూరు బస్సు సర్వీసుకు డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తు ఎర్రచందనం స్మగ్లర్లు ఆశచూపిన డబ్బులకు ప్రలోభపడి తమిళ స్మగ్లర్లను, కూలీలను బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఎక్కించుకుని మైదుకూరు అటవీప్రాంతానికి సమీపాన గల హైవేరోడ్డు పాయింట్లలో దించుతూ వారు అక్కడి నుంచి సమీప అటవీప్రాంతంలోకి వెళ్లి ఎర్రచందనం చెట్లను నరికేందుకు సహాయ సహకారాలు అందించారన్నారు. డ్రైవర్లు స్మగ్లర్లతో కుమ్మక్కై ఒక్కొక్కరు ఇప్పటికి నాలుగు నుంచి ఆరు మార్లు వారు డ్యూటీలో ఉన్నప్పుడు స్మగ్లర్లను బెంగళూరు నుంచి మైదుకూరుకు తరలించినట్లు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. స్మగ్లర్లందరూ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వేలూరు, తిరువన్నామళై, ధర్మపురి, తిరుపూర్ జిల్లాలకు చెందిన వారని , అటవీప్రాంతాల్లోని చిన్న చిన్న గ్రామాల్లో నివసిస్తున్నారని , మేస్ర్తిలు, అంతర్ రాష్టస్మ్రగ్లర్లతో సంబంధాలు కలిగివుండి, ఎర్రచందనం స్మగ్లర్లకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసులను చేధించేందుకు కృషి చేసిన మైదుకూరు డిఎస్పీ కె.లక్ష్మి, ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ బి.శ్రీనివాసులు, మైదుకూరు అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు, మైదుకూరు రూరల్ సిఐ ఎం.నాగభూషణం, ఎస్‌ఐలు రంగారావు, విద్యాసాగర్, రామకృష్ణ, కొండారెడ్డి, హేమకుమార్, ఆర్‌ఎస్‌ఐ జయరామ్, జిల్లాస్పెషల్‌పార్టీ సిబ్బంది, మైదుకూరు సబ్ డివిజనల్ స్పెషల్‌పార్టీ సిబ్బంది, ఖాజీపేట, దువ్వూరు, మైదుకూరు పోలీసుస్టేషన్ల సిబ్బందిని అడిషనల్ ఎస్పీ సత్యయేసుబాబు అభినందించారు.

టిడిపి ఫ్లెక్సీలో డిఎల్ ఫొటో..
దువ్వూరు, ఫిబ్రవరి 4: మండల కేంద్రమైన దువ్వూరు నడిబొడ్డున ఉన్న నీటి ట్యాంక్‌కు టిడిపికి చెందిన పుట్టా సుధాకర్‌యాదవ్, డిఎల్.రవీంద్రారెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని గుర్తుతెలియని కొందరు వ్యక్తులు శనివారం తెల్లవారుజామున ఏర్పాటుచేశారు. శనివారం తెల్లవారేసరికి ఈ ఫ్లెక్సీ ప్రజలకు దర్శనమివ్వడంతో మండలానికి చెందిన టిడిడి, వైకాపా నాయకుల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గానికి తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జి అయిన సుధాకర్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే అయిన డిఎల్.రవీంద్రారెడ్డిలు ఇద్దరూ బలమైన నాయకులుగా పేరుంది. అయితే ఇటీవల రవీంద్రారెడ్డి వైకాపాలో చేరుతున్నట్లు ప్రచారం ఊపందుకున్న తరుణంలో టిడిపికి చెందిన నాయకులతో కూడిన ఫ్లెక్సీలో డిఎల్ ఫొటో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా వైకాపా, టిడిపి నాయకులు ఖంగుతిన్నట్లయింది. ఈ ఫ్లెక్సీ వ్యవహారం ఇటు సుధాకర్‌యాదవ్‌కు, అటు డిఎల్ దృష్టికి వెళ్లిందని సమాచారం. కాగా ఫ్లెక్సీని ఏర్పాటుచేసిన వారి వివరాలు మాత్రం బయటకు తెలియకపోవడంతో పోలీసులు ఈ విషయంపై దృష్టిసారించినట్లు తెలిసింది.