కడప

పోషకాల లోపంతోనే నులిపురుగులు వ్యాప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు,్ఫబ్రవరి 10: మానవుని శరీరంలో నులిపురుగులు చేరడం వల్ల రక్తహీనత పోషకాలలోపం ఆకలి మందగించడం, విరోచనాలు వంటి సమస్యలు ఎదురౌతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రామిరెడ్డి పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలనదినం కార్యక్రమంలో భాగంగా చెన్నూరు బాలికల ఉన్నతపాఠశాలలో శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ రామిరెడ్డి చిన్నారులకు నులిపురుగుల నివారణ మందులు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నపిల్లల్లో నులిపురుగులు వ్యాప్తి చెందుతాయని ఇందుకు కారణం పోషకాల లోపం, ఆకలి మం దగించడమే కారణమన్నారు. నులిపురుగులు ఉండటం వల్ల కడుపునొప్పి, వికారం, విరోచనాలు, మలంలో రక్తం పడుట వంటి సమస్యలు ఎదురౌతాయన్నారు. నులిపురుగుల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఏర్పాటుచేసి చిన్నపిల్లల్లో నులిపురుగులు నిర్మూలించేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఒక సంవత్సరం పిల్లల నుంచి రెండు సంవత్సరాలు లోపు పిల్లలకు 200 మి.గ్రాములు, 3నుంచి 19సంవత్సరాల పిల్లలకు ఆల్‌బెండాజోల్, 400మి.గ్రా మాత్రలు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలకు మింగించాల్సి వుంటుందన్నారు. నులిపురుగుల నివారణ మందులు తీసుకోవడం ద్వారా రక్తహీనత తగ్గిం చి పోషకాలు పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాధికారి ఉమామహేశ్వరకుమార్, వైద్యాధికారి శ్రీనివాసులురెడ్డి, సూపర్ వైజర్లు మరియకుమారి, భారతి, హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గండికోట ఉత్సవాలను
విజయవంతం చేయాలి
* ఆర్డీవో కె.వినాయకం
జమ్మలమడుగు, ఫిబ్రవరి 10: గండికోట వారసత్వ ఉత్సవాలను విజయవంతం చేయడానికి అందరూ తమ వంతు కృషి చేయాలని ఆర్డీవో కె.వినాయకం పేర్కొన్నారు. స్థానిక ఎంపిడివో కార్యాలయ సభాభవనంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆర్డీవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలు నియమావళి ఉన్నందున ప్రజాప్రతినిథులు ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం లేదన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాల్సి వుందన్నారు. అలాగే అన్ని వర్గాల వారు ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు సహకరించాలని ఆర్డీవో వినాయకం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో మల్లయ్య, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.