కడప

పోటాపోటీ శిబిరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,్ఫబ్రవరి 13: జిల్లాలో ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చ జరుగుతూ అసలు జిల్లాలో ఏమి జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి ఎన్నికల బరిలో దిగడంతో తెలుగుదేశంపార్టీ అధిష్ఠానం వివేకానందరెడ్డి అయినా జగనైనా ఒకటేనని ధ్యేయంగా పెట్టుకుని సర్వశక్తులు వడ్డుతూ అధికార పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి బిటెక్ రవి (రవీంద్రారెడ్డి) గెలుపే ధ్యేయంగా పెట్టుకుని ప్రత్యేక దృష్టి సారించారు. జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, నగర పాలక కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఓటు హక్కు కలిగివుండటంతో అధికారపార్టీ నేతలు విజయవాడ శిబిరంగా స్థానిక ప్రజాప్రతినిధులను తరలించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులను తాత్కాలికంగా బెంగళూరుకు తరలించినట్లు తెలుస్తోంది. జిల్లాలో అధికారపార్టీ అధిష్ఠానం జగనే టార్గెట్‌గా పెట్టుకుని పనిచేస్తోంది. అధిష్ఠానం కూడా జిల్లా నేతలను నమ్మకుండా తమకంటూ ప్రత్యేకత చాటుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పశ్చిమ రాయలసీమ జిల్లాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. జిల్లాలో అధికారపార్టీ నేతల మభ్య ఉన్న కుమ్ములాటలు, ఆధిపత్యపోరు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తమ స్వయపర్యవేక్షణలో ముఖ్యంగా జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లోకేష్‌బాబు ఎమ్మెల్సీ ఎన్నికలు ఆషామాషిగా తీసుకోకుండా గెలుపే ధ్యేయంగా పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు.

వైకాపాలోనే కొనసాగుతా..
* చిట్లూరు ఎంపీటీసీ లక్ష్మిదేవి
సంబేపల్లె, ఫిబ్రవరి 13: తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రామాపురం మండలం చిట్లూరు ఎంపీటీసీ లక్ష్మిదేవి సోమవారం పేర్కొన్నారు. ఎంపీటీసీ లక్ష్మిదేవి కనపడటం లేదంటూ ఆమె బంధువులు రామాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న చిట్లూరు ఎంపీటీసీ లక్ష్మిదేవి
ఆదివారం రాత్రి తిరుపతి పోలీసులు సంబేపల్లె పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను వైసీపీ శిబిరంలో ఉన్నానని ఆమె వివరించారు. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ ఎంపీటీసీ లక్ష్మిదేవిని ఆమె స్వగ్రామానికి తరలించారు.

నన్ను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదు..
* జంగాలపల్లె ఎంపీటీసీ దస్తగిరి
వేంపల్లె, ఫిబ్రవరి 13: నన్ను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం జంగాలపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ శివపెద్దదస్తగిరి స్పష్టం చేశారు. వైసీపీ క్యాంపులో ఉన్న ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడారు. తన భార్య సుబ్బమ్మతో కలిసి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కిడ్నాప్ కేసు పెట్టించాడన్నారు. కానీ తాను వైఎస్‌ఆర్ క్యాంపులోకి వస్తున్నట్లు తన భార్య సుబ్బమ్మతో చెప్పి వచ్చానని తెలిపారు. కక్ష సాధింపుతో కిడ్నాప్ కేసును నమోదు చేసేందుకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. తాను దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వీరాభిమానినని, వైఎస్‌ఆర్ గుర్తుతో గెలిచానని తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్‌ఆర్ కుటుంబసభ్యులకు మద్దతుగా ఉంటానని తెలిపారు. అలాగే వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన వివరించారు.

విద్యా సంవత్సరం.. ముందుకొస్తోంది..

జమ్మలమడుగు, ఫిబ్రవరి 13:కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యావిధానాల్ని మెరుగుపరచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అందుకు తగ్గ సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. వేసవి సెలవులు ముగిశాక ప్రారంభమయ్యే విద్యాసంవత్సరం మార్చి నుండే ప్రారంభించడానికి చర్యలు చేపడుతోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఎ) కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఈతరహా విద్యావిధానం ప్రయోజనకరమన్న భావన పలు ఉపాధ్యాయ సంఘాలతో పాటు, తల్లిదండ్రుల్లో కూడా వ్యక్తం అవుతోంది. మార్చి నుండే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు, డ్రాపౌట్స్‌ను నివారించవచ్చన్న భావనతో ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ సమర్పించిన ప్రతిపాదనలను పరిగణలోనికి తీసుకొని త్వరలో ఆదేశాలు జారీచేయనుంది. విద్యాసంవత్సరం ముందుకు మార్చే విషయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది 1నుండి 9వ తరగతుల వరకు అన్ని పరీక్షలను మార్చి 20లోగా పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మార్చి మూడవ వారం నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం మూడు మాసాలు ముందుగా ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
* ఇదీ నూతన షెడ్యూలు
1-5వరకు పరీక్షలు మార్చి 15 నుండి 18వరకు, 6-9వరకు పరీక్షలు మార్చి 6నుండి 20లోపు, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 3వ వారంలో, 2017-18 సంవత్సరం విద్యాబోధన మార్చి 20నుండి ఏప్రిల్ 24 వరకు, వేసవి సెలవులు ఏప్రిల్ 24నుండి జూన్ 12వరకు వుంటాయి. జూన్ 13వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇప్పటి వరకు ఏప్రిల్‌లో విద్యాసంవత్సరం ముగియగానే వేసవి సెలవులు ఇచ్చేవారు. జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేవి. అయితే కొత్త విధానం వల్ల 2017-18 విద్యా సంవత్సరం మార్చి 20నుండి ప్రారంభం అవుతుంది. మార్చి 20నాటికి ఆయా తరగతుల పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులు పైతరగతుల ప్రవేశం చేస్తారు. వేసవి సెలవులు ప్రారంభం అయ్యే ఏప్రిల్ 24వరకు నూతన విద్యాసంవత్సరంనకు సంబంధించిన తరగతుల విద్యాబోధన చేస్తారు. సెలవుల అనంతరం బోధన పూర్తి స్థాయిలో కొనసాగుతాయి. వేసవి సెలవులకు ముందే పైతగరతులకు విద్యార్థులు వెళ్లడం వల్ల చదువు ఆపించాలనుకునే తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చే అవకాశం వుంది.
ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రాలేదు- ఎంఈవో చిన్నయ్య
నూతన విద్యావిధానం అమలు విషయం వాస్తవమే. జిల్లా విద్యాశాఖాధికారి నుండి ఆదేశాలు రాలేదు.

ఐదుగురు కిడ్నాపర్ల అరెస్టు

రాయచోటి, ఫిబ్రవరి 13: ఈ నెల 8వ తేదీన జరిగిన కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సోమవారం స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన జగదాంబసెంటర్‌లోని శ్రీ బాబా మెడికల్‌స్టోర్ యజమాని మన్మోహన్‌రెడ్డి కిడ్నాప్‌కు గురైన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అప్పట్లో కిడ్నాప్ జరిగిన రెండు గంటల్లోనే సుండుపల్లె మండలం మోపాలకుంట సమీపంలోని మామిడితోపు వద్ద కిడ్నాప్‌కు గురైన మన్మోహన్‌రెడ్డిని, స్కార్పియో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆ దాడిలో కిడ్నాపర్లు అప్పట్లో పారిపోగా వారిని సోమవారం ఉదయం సుండుపల్లె మార్గంలోని ఆర్‌ఆర్ కళ్యాణ మండపం వద్ద తమకు అందిన సమాచారం మేరకు కిడ్నాపర్లు అయిన తుమ్మల కుమార్‌రెడ్డి, వంమళ్ళ లక్ష్మిరెడ్డి, పోల్‌రెడ్డి నరసింహారెడ్డి, పెద్దపోగు శ్రీరాములు, మందా నరసింహులులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మన్మోహన్‌రెడ్డి మహిళలను వేధింపులకు గురిచేయడమే కాకుండా అమ్మాయిల ఫోన్ నెంబర్లు సేకరించి వారిని ప్రలోభాలకు గురిపెట్టేవాడని, ఈ క్రమంలోనే కుమార్‌రెడ్డి అతని అనుచరులు మన్మోహన్‌రెడ్డిని కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని తమ విచారణలో తేలినట్లు అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండుకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రమేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

కడప,(కల్చరల్)్ఫబ్రవరి 13: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డా.బి.స్వాతి పేర్కొన్నారు. పాత కలెక్టరేట్‌లో ఉన్న జిల్లా పర్యాటకరంగ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో సోమవారం జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆమె తొలుత కేక్ కట్‌చేశారు. అనంతరం డా.స్వాతి మట్లాడుతూ నేడు సమాజంలో మహిళలు అనేక విధాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఇటు కుటుంబంలో అటు సమాజంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందని తెలియజేశారు. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ సమానంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉండాలని, మహిళలు తమ పిల్లలకు రోల్‌మాడల్‌గా ఉండాలని సూచించారు. నేడు ఉద్యోగాల్లో మహిళలు అతి తక్కువ మంది ఉన్నారని, మహిళలు తమ హక్కులను తెలుసుకుని ముందుకెళ్లాలన్నారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి.్భగ్యలక్ష్మి మాట్లాడుతూ అవకాశాల కోసం ఎదురు చూడకుండా స్వయం శక్తితో ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి చెంది ప్రగతి పథంలో పయనించాలని హితవుపలికారు. మహిళలు పోరాడి సాధించుకోవాల్సిన హక్కులు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. సమాజంలో స్ర్తి పురుషులిద్దరూ సమానంగా గౌరవం పొందగలిగినప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందన్నారు. సమానత్వం సాధికారిత ద్వారా మహిళలు అభివృద్ది చెందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపి చరిత్ర, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి జ్యోతి జార్జి, మహిళా విభాగం అధ్యక్షురాలు నెమళ్లదినె్న నాగవేణి, మహిళలు అన్నారెడ్డి మనెమ్మ, తులశమ్మ, సుశీలమ్మ, సభ్యులు చంద్రశేఖర్, ప్రసాద్, శ్రీనివాసులు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు పరిష్కరించాలి

కడప,(కల్చరల్)్ఫబ్రవరి 13: మీకోసం ప్రజావినతుల కార్యక్రమానికి పేదలు జిల్లా నలుమూలల నుంచి వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు వస్తారని వారి నమ్మకాన్ని వమ్ముచేయక సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం మీకోసం సభాభవన్‌లో మీకోసం ప్రజావినతులు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించి ఆయాశాఖల జిల్లా అధికారులకు తగు చర్యలు నిమిత్తం ఎండార్సు చేశారు. వచ్చిన వినతులలో సంబేపల్లి మండలం గౌనిగారిపల్లెకు చెందిన మహ్మద్ రఫి తనకు రేషన్‌కార్డు మంజూరు చేయాలని, చెన్నూరు మండల కేంద్రానికి చెందిన పి.వెంకటసుబ్బయ్య తాను నిరుపేదనని తనకు ఏఏవై రేషన్‌కార్డు మంజూరు చేయించాలని, చెన్నూరు మండలం బయనపల్లికి చెందిన నంద్యాల వెంకటలక్షుమ్మ తనకు ఇళ్లు మంజూరు చేయాలని, రాయచోటి మండలం అబ్బవరం గ్రామానికి చెందిన గొల్ల రామకృష్ణ తన ఆధీనంలో ఉన్న భూమికి సర్వే చేయించి హద్దులను చూపాలని, చింతకొమ్మదినె్న మండలం ఎస్సీ కాలనీకి చెందిన మూడే లలిత ఎన్‌టిఆర్ పథకం కింద ఇళ్లు మంజూరు చేయించాలని, కడప మండలం శివానందపురం కాలనీకి చెందిన ఐసాక్ తన ఆధీనంలో ఉన్న భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయించాలని, గోపవరం మండలం లక్కివారిపల్లె గ్రామానికి చెందిన జి.రామిరెడ్డి తన భూమి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని కోరుతూ మీకోసం ప్రజావినతులు కార్యక్రమంలో వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శే్వత, జాయింట్ కలెక్టర్ -2 నాగేశ్వరరావు, డిఆర్వో ఈశ్వరయ్య, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పొలతల క్షేత్రాన్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యే

పెండ్లిమర్రి,్ఫబ్రవరి 13: మండల పరిధిలోని గంగనపల్లె పంచాయతీ పరిధిలోని శేషాచల అటవీ ప్రాంతంలోని వెలసివున్న శ్రీ పొలతల మల్లికార్జునస్వామి ఆలయాన్ని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి పర్యవేక్షించి ఆలయ ఇఓ కృష్ణానాయక్‌తో ఆలయ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రూ.20లక్షలు వ్యయంతో నూతనంగా నిర్మించిన 12 అడుగుల శివపార్వతుల విగ్రహాలను ప్రారంభించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని స్వామి వార్లకు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈనెల 24న మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని పొలతల క్షేత్రానికి భక్తులు వేలాది సంఖ్యలో వస్తారని వారికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఇఓను ఆదేశించారు. ముఖ్యంగా నీటి సమస్య, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అలాగే మహిళలకు స్నానాల గదులు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే ఎస్పీ రామకృష్ణ, ఆర్టీసీ అధికారులతో సంప్రదించి రవాణా సౌకర్యంతోపాటు బందోబస్తుకోసం తగినంత సిబ్బందిని నియమించేలా కోరాలని ఆలయ ఇఓకు సూచించారు. క్షేత్రం అభివృద్ధికోసం దాతలు ఇచ్చిన విరాళాలతో భక్తులకు భోజనాలు తయారుచేసేందుకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ చంద్రారెడ్డి, వైకాపా నాయకులు నాగమల్లారెడ్డి, రామమోహన్‌రెడ్డి, జడ్పీటిసి భాస్కర్, సర్పంచ్‌లు రఘునాథరెడ్డి, పెద్దశిద్దారెడ్డి, నాగమల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో
ఇంటి దొంగలు!

కడప,్ఫబ్రవరి 13: ఎర్రచందనం అక్రమరవాణా అరికట్టడంలో ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ సఫలీకృతులైనా, స్మగ్లింగ్‌లో పోలీసుశాఖ, అటవీశాఖలో కొంతమంది అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉండడంతో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించి ఎనిమిది మాసాలు పైబడినా అసాంఘిక కార్యకలాపాల్లో కీలకమైన ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తూ మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లు, గ్యాంబ్లింగ్ అరికట్టడంలో ఎస్పీ అధిగమించారు. అయితే దశాబ్దాలు తరబడి పోలీసు ఉన్నతాధికారుల్లో కొంతమంది కళ్లు గప్పి, మరికొంతమంది భాగస్వామ్యంతో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్చగా జిల్లాలో కొనసాగడం షరామామూలుగానే ఉంది. అయితే ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఆయన తెలిసి గానీ, తెలియ కానీ అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహించడం కానీ, భాగస్వామ్యం ఉందన్న రాజకీయ నేతలు, ఆయన శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, ఏ ఇతర అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉన్నా ఉపేక్షించడం లేదని గట్టిగా చెబుతున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం వేయడం ఇప్పటి వరకు పదుల సంఖ్యలో పోలీసు అధికారులు, సిబ్బంది పై వేటు వేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ వస్తున్నారు. అయితే కరుడుగట్టిన తీవ్ర వాదులు తరహాలో పోలీసుశాఖలో కొంతమంది అధికారులు, సిబ్బంది సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్న వారిపై ఎస్పీ నిఘా పెట్టారు. ఎస్పీ రామకృష్ణ ఎక్కడ పనిచేసినా తనశాఖ లోని అవినీతి అధికారులను ప్రక్షాళన చేయడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. జిల్లాలో ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అడుగడుగునా అధికార పార్టీ నేతలు అడ్డుతగులుతూ వచ్చినా ఆయన సంబంధిత నేతలకు క్లాస్ తీసుకుని అసాంఘిక శక్తులు ప్రోత్సహిస్తే జిల్లా అధోగతే అని తాను మనసును చంపుకుని పనిచేయనని తన పనితీరు ఇష్టం లేక పోతే బదిలీ చేయాలని ఆయనే స్వయంగా అధికారపార్టీకి చెందిన జిల్లా, అధిష్ఠానానికి సైతం విన్నవించుకున్నారు. గతంలో కొంతమంది ఎస్పీలుగా పనిచేసిన ఉన్నతాధికారులు ఆరంభ సూరత్వంగా పనిచేసి అనంతరం అసాంఘిక శక్తులతో చేతులు కలిపి పనిచేశారనేది జగమెరిగిన సత్యం. ఎస్పీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నేటి వరకు పార్టీలకు అతీతంగా ఇసుక మాఫియా, ఎర్రచందనం స్మగ్లింగ్, మట్కా, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని కొరకని కొయ్యగా తయారై శాంతి భద్రతల పరిరక్షణతో పోరాటంచేస్తు వస్తున్నారు. అయితే ఎస్పీ మాత్రం ఎంతటి వ్యక్తికైనా లొంగే ప్రసక్తేలేదని ఆయన వ్యవహరిస్తూ తనదైన శైలిలో పనిచేస్తున్నారనేది జగమెరిగిన సత్యం.

కులవ్యవస్థరూపుమాపాలంటే
అణగారిన వర్గాలకు చేయూతనివ్వాలి

కమలాపురం, ఫిబ్రవరి 13: సమాజంలో కులవ్యవస్థ రూపుమాపాలంటే ప్రభుత్వం అణగారిన వర్గాలకు పూర్తిగా చేయూతనిచ్చి వారిని అర్థికంగా అబివృద్ది పరచాల్సిన అవసరం ఉందని జిల్లా రైతుసంఘం ప్రధాన కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు. ఆయన సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో చైతన్యశంఖారావంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 26న కమలాపురం నియోజకవర్గంలో జరుగనున్న చైతన్యశంఖారావంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమాజంలో ఈనాటికి అణచివేతకు గురైనవారు 80 శాతంమంది ఉన్నారని అందులో ఎస్సీ, ఎస్టీ బిసి, మైనార్టీ వర్గాలకు చెందినవారంతా ఏదో ఒక ప్రాంతంలో పెత్తందార్ల చేతిలో అణచివేతకు గురవుతున్నారన్నారు. ఇందుకోసం ప్రభుత్వంపై పోరాటాలు జరపాల్సిన అవసరం అసన్నమైందన్నారు. కేంద్రప్రభుత్వం నల్లధనం పేరుతో పెద్దనోట్లను రద్దుచేసి సామాన్యుల జీవనప్రయాణాన్ని దెబ్బతీసిందన్నారు. దీంతో సామాన్యప్రజలు మరింతగా పేదరికానికి దగ్గరయ్యారన్నారు. నల్లకుబేరులు మాత్రం ఏ మాత్రం దెబ్బతినక తమ విశిష్ట పలుకుబడితో నల్లధనాన్ని మార్చుకుని మరింత కుబేరులయ్యారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్‌ప్లాన్ నిధులను వారి అభివృద్దికే వినియోగించాలే తప్ప ఇతర వాటికి మళ్లించరాదని డిమాండ్ చేసారు. సి పి ఐ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఇప్పటికీ 80 శాతం దళితగ్రామాలు నీరు,కరెంటు,రోడ్లు లాంటి వౌలిక సదుపాయాలకు కూడా దూరంగా ఉన్నాయని విమర్శించారు. లక్షలాదిమంది దళితులు సెంటు భూమి కూడా లేక దరిద్య్రాన్ని అనుభవిస్తున్నారన్నారు. దళిత హక్కుల పోరాట సమితి ఏరియా కో ఆర్డినేటర్ ఆర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ దళితుల అభివృద్దికోసం ప్రభుత్వం సాగులో ఉన్న భూములు కొనుగోలుచేసి 3 ఎకరాల చొప్పున వారికి పంపిణీ చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన ఉదయ్ మంజుల, సంటన్న, సావిత్రమ్మ, నరసింహులు, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

లారీ ఢీకొని బాలుడికి గాయాలు
దువ్వూరు, ఫిబ్రవరి 13: దువ్వూరులోని శ్రీలక్ష్మీవెంకటరమణ రైస్‌మిల్ వద్ద రోడ్డు దాటుతున్న ఓ బాలుడిని ఆల్విన్ లారీ ఢీకొనడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే... దువ్వూరులో నివాసముంటున్న తోటా శంకర్ కుమారుడైన గురుసాయిజశ్వంత్ అనే నాల్గుసంవత్సరాల వయస్సు గల బాలుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని హైదరాబాద్‌కు తరలించినట్లు బంధువులు తెలిపారు. ఆల్విన్ లారీని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గండికోట ఉత్సవాలపై
దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి

కడప,్ఫబ్రవరి 13: గండికోట వారసత్వ ఉత్సవాలు దేశవ్యాప్తంగా తెలిసే విధంగా గ్రామస్థాయి నుంచి ప్రచారం చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ కెవి సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీ కోసం సభాభవన్‌లో గండికోట వారసత్వ ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18,19వ తేదీల్లో జరిగే గండికోట వారసత్వ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని సూచించారు. అలాగే మనదేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు, స్థానిక ఆటలపోటీలు, వంటకాలు, గాలిపటాల పోటీలు తదితరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగా 14న మున్సిపల్ స్టేడియంలో ఖోఖో, స్కిప్పింగ్, సిపి బ్రౌన్‌లో జూనియర్స్‌కు వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, 15న మున్సిపల్ స్టేడియంలో కబడ్డీ, 16న కళాక్షేత్రంలో వంటలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తారన్నారు. 17న ఉదయం 10గంటలకు కడప నుంచి, సాయంత్రం 4గంటలకు ప్రొద్దుటూరు నుంచి, 18వ తేదీ ఉదయం 10గంటలకు జమ్మలమడుగు నుండి కళాకారులతో శోభాయాత్ర ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 18న కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా సాయంత్రం 4గంటల నుంచి గండికోటలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, కూచిపూడి, క్లాసికల్ డ్యాన్స్, కేరళ నుంచి సింగారిమేళా టీం, ప్రదర్శన, టిటిడి నుండి అన్నమయ్య కీర్తనలు, శివారెడ్డి మిమిక్రీ షో, ఖాన్ టీం తరపున కూచిపూడి డ్యాన్స్, గంగాధరశాస్ర్తీ ఆధ్వర్యంలో సంగీత విభావరి ఉంటుందన్నారు. 19న సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 5గంటల నుంచి 20మంది కళాకారులతో భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, రాజస్థానీ, ఒడిస్సి నృత్యాల ప్రదర్శనలు , 62 మంది కళాకారులతో హనుమాన్ చాలీసా నృత్యప్రదర్శన, శ్రీవెంకటేశ్వర వైభవం నాటక ప్రదర్శన, వందేమాతరం శ్రీనివాస్ బృందంచే సంగీత విభావరి, మెయిన్ దిల్‌షాద్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇవాళి ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల్లో ప్రజల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ స్టాల్స్, ఫుడ్ కోర్టు ఏర్పాటుచేస్తున్నామన్నారు. కడప జిల్లా ప్రాముఖ్యతను అందరికీ చాటిచెప్పేవిధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శే్వత, డిఆర్‌ఓ ఈశ్వరయ్య, పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు బి.గోపాల్, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, సిపిఓ తిప్పేస్వామి, స్టెప్ సిఇఓ మమత, ఎస్సీ కార్పొరేషన్ ఇడి శ్రీలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.