కడప

హజ్‌హౌస్ భవన నిర్మాణ పనులకు తొలగిన అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు,్ఫబ్రవరి 14: హజ్‌హౌస్ చెన్నూరు సమీపంలో నిర్మిస్తుండటంతో ముస్లింమైనార్టీల్లో విభేదాలు రాగా ఎట్టకేలకు ఇరువర్గాల మధ్య సమస్య తొలగిపోవడంతో చెన్నూరు సమీపంలోనే హజ్‌హౌస్ నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఏడాది కిందట చెన్నూరు సమీపంలో 12 ఎకరాల విస్తీర్ణంలో హజ్‌హౌస్‌ను నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మండలంలోని రామనపల్లె వ్యవసాయ పొలాల్లో చెన్నూరు షాహీ మసీదుకు చెందిన 13 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూమిని గుర్తించారు. ఇందులో కడప -కర్నూలు రోడ్డు విస్తరణలో కొంతభూమి పోగా మిగిలిన 12 ఎకరాల 8సెంట్లు భూమిని జిల్లా వక్ఫ్‌బోర్డు హజ్‌హౌస్ నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ చేసివున్నారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం హజ్‌హౌస్ నిర్మించేందుకు రూ.12కోట్లు నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు గుత్తేదారులకు అప్పగించారు. దీంతో వారం పదిరోజుల్లో హజ్‌హౌస్ నిర్మించేందుకు గుత్తేదారులు చర్యలు తీసుకుంటున్నారు. చెన్నూరుకు అతిసమీపంలో హైవేరోడ్డు పక్కన హజ్‌హౌస్ నిర్మిస్తుండటంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హజ్‌హౌస్ ఐదు అంతస్తుల భవనం రూపుదిద్దుకోనున్నది. హజ్‌హౌస్ చుట్టూ ప్రహరీగోడ, ప్రత్యేక ప్రార్థన మందిరం, సమావేశ మందిరం నిర్మిస్తున్నారు. హజ్‌హౌస్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ 20 నుంచి 30మంది వరకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఆర్టీపీపీలో కాంట్రాక్టు కార్మికులకు గ్రేడ్‌లు ఇవ్వాలి

ఎర్రగుంట్ల,్ఫబ్రవరి 14: గత 15సంవత్సరాలుగా ఆర్టీపీపీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకు వారి సాంకేతిక నిపుణత ఆధారంగా తీసుకుని స్కిల్డ్, సెమిస్కిల్డ్ గ్రేడ్‌లను ఇవ్వాలని, అలాగే మహిళా కార్మికులకు రిజర్వేషన్లు అమలుచేయాలని కోరుతూ ఏపి జెన్కో డైరెక్టర్ (హెచ్‌ఆర్) అప్పారావుకు ఆర్టీపీపీ 1535, హెచ్ 43 యూనియన్ నాయకులు మంగళవారం హైదరాబాద్ జెన్కో కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈమేరకు జెన్కో ఎండి విజయానంద్‌ను కూడా కలిసి ఆర్టీపీపీతోపాటు పలు విద్యుత్ ప్లాంట్లలో కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆర్టీపీపీలో దాదాపు 1250మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని వారికి ఐటిఐ, డిప్లొమోతోపాటు సర్వీసు కూడా ఉందని అయితే వారికి సర్వీసుగ్రేడ్లు ఇవ్వకుండా యాజమాన్యం అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2012 నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఐటిఐ వారికి స్కిల్డ్‌గా డిప్లొమో వారిని హై స్కిల్డ్‌గా సర్వీసు ఉన్న కార్మికులను సెమిస్కిల్డ్‌గా గుర్తించి తదనుగుణంగా వేతనాలు సవరించాలని కోరుతూ అలాగే వివిధ సర్కిళ్లలో సివిల్, కోల్ ప్లాంట్లలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టు కార్మికులను ఓఅండ్‌ఎంలో కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించాలని, గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును అమలుచేయాలని కార్మిక నాయకులు విజ్ఞప్తి చేశారు. మహిళా కార్మికులకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గతంలో వరలక్ష్మి, రమణమ్మ లు న్యాయస్థానాలు ఆశ్రయించిన మేరకు వచ్చిన ఆదేశాలను అమలుచేయాలని ఏపి పవర్ జనరైటింగ్ వర్కర్స్ యూనియన్ 1535 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లారెడ్డి, పవర్ జనరేటింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ 43 వైస్ ప్రెసిడెంట్ ఇ.సాంబశివారెడ్డి ఎండి విజయానంద్, డైరెక్టర్ అప్పారావుకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.
వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆర్‌పి మునిరెడ్డి, గంగిరెడ్డి, శ్యామేల్, డేవిడ్ తదితరులు ఉన్నారు.