కడప

విద్యార్థులు కష్టపడి చదివాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, ఫిబ్రవరి 18: మండలపరిదిలో ఉన్న ఐదు జిల్లాప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 50మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యిరూపాయల చొప్పున రూ.50 వేల ఉపకారవేతనాలను అందించడం జరిగింది. శనివారం స్థానిక ఎమ్మార్సీ భవనం నందు విద్యార్థులకు ఉల్లాస్ ట్రస్టు ద్వారా ఉపకారవేతనాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపిపి కానాల చంద్రావతమ్మ, మండల విద్యాశాఖాధికారి యల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలతోపాటు చాలామంది దాతలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారని తెలిపారు. అందులో భాగంగానే ఉల్లాస్ ట్రస్ట్‌వారు ఒక్కో విద్యార్థికి వెయ్యిరూపాయల చొప్పున అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. విద్యార్థులు బాగా చదివి, మంచి ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చాలన్నారు. గుడిపాడు, నీలాపురం, మాచనపల్లె, పుల్లారెడ్డిపేట, చల్లబసాయిపల్లె గ్రామాల్లోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలల్లో 9,10వ తరగతుల విద్యార్థులకు వేతనాలు అందిచారన్నారు. కార్యక్రమంలో ఉల్లాస్ ట్రస్ట్ సభ్యులు జి.మధుసూధన్‌రెడ్డి, వైకాపా నాయకులు జయచంద్రారెడ్డి, ఆయా పాఠశాలల హెచ్ ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గండికోటకు బయలుదేరిన విద్యార్థినిలు
దువ్వూరు, ఫిబ్రవరి 18: మైలవరం మండలంలోని గండికోట ఉత్సవాల్లో భాగంగా దువ్వూరుమండలం నుంచి మూడు బస్సుల్లో విద్యార్థినిలు బయలుదేరి వెళ్లారు. దువ్వూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రెండు బస్సుల్లో, గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఒక బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎం ఇ ఒ యల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గండికోట ఉత్సవాలను తిలకించేందుకు విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
వ్యాధినిరోధక టీకాలు తప్పక వేయించాలి
గోపవరం, ఫిబ్రవరి 18: చిన్నారులకు వ్యాధినిరోదక టీకాలను తప్పక వేయించాలని, ప్రతి ఒక్కరూ అన్ని టీకాలు ఒక తల్లి తన బిడ్డకు ఏ వయస్సులో వేయించాలో అవగాహన కల్పించుకొని వేయించుకోవాలని జిల్లా గ్రామీణ ఆరోగ్యమిషన్ సమన్వయకర్త డాక్టర్ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం వ్యాధినిరోదక టీకాల కార్యక్రమంలో భాగంగా బద్వేలు క్లస్టర్ పరిదిలో తనిఖీ నిమిత్తం వచ్చిన ఆయన మండలంలోని ప్రాజెక్టు కాలనీ, మడకలవారిపల్లె గ్రామాల్లో జరుగుతున్న టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా గణాంకాధికారి ఉమామహేశ్వర్, సిహెచ్‌ఓ రవికుమార్, సూపర్‌వైజర్ ఉదయ్‌భాస్కర్, ఎఎన్‌ఎంలు విజయశాంతి, వాణిశ్రీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలి
చాపాడు, ఫిబ్రవరి 18: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకెళ్తే... ఎంతటి స్థాయికైనా ఎదగవచ్చునని ప్రైవేటు పాఠశాలల జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక విజేత ఉన్నతపాఠశాలలో వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అంకితభావం, పట్టుదలతో విద్యనభ్యశించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చునన్నారు. ప్రస్తుతం నెలకొన్న పోటీతత్వంలో ఏకాగ్రతతో విజయాన్ని సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు.

పది పరీక్షలపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం!
సుండుపల్లె, ఫిబ్రవరి 18: శాసనమండలి ఎన్నికలు పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపేలా ఉన్నాయి. విద్యార్థులు ఉత్తీర్ణతను పెంచడానికి యేటా జనవరి నుంచి ప్రత్యేక ప్రణాళికలను అనుసరిస్తారు. అయితే ప్రస్తుతం ఏ పాఠశాలలోను అలాంటి వాతావరణం కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన విడుదలకావడంతో ప్రచారం ఊపందుకుంది. ఉపాధ్యాయులు తమ సంఘం మద్దతు తెలిపిన అభ్యర్థిని గెలిపించుకోవడానికి తమ వంతుగా రాజకీయ నాయకులను మించి ప్రచారం చేస్తున్నారు. ఓటుహక్కును వినియోగించేలా చైతన్యం కలిగించడం మొదలు సమీకరణాలు ప్రలోభాల వరకు అన్నిరకాలుగా మండలంలో ఎన్నికలపర్వం సాగుతోంది. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా పది ఫలితాలపై చర్చను వదిలేసి ఎమ్మెల్సీ గెలుపోటములపై చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీపడుతున్న పలువురు ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నుంచి బహిరంగంగానే మద్దతును తీసుకున్నారు. వీరిలో వివిధ రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని బహిరంగంగానే జిల్లానేతలు కోరడం జరిగింది. దీంతో ఉపాధ్యాయులు ప్రచార వ్యూహాలలో కీలకపాత్ర పోషిస్తున్నారు.