కడప

ముగిసిన అత్తిరాల శ్రీ త్రేతేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, ఫిబ్రవరి 28:కడప జిల్లాలో పరశురాముని మాతృహత్యా పాతకాన్ని రూపుమాపిన శైవక్షేత్రంగా వెలుగొందుతున్న రాజంపేట మండలంలోని అత్తిరాల శ్రీ త్రేతేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20వ తేదీ నుండి మొదలైన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో లక్షకు పైగా భక్తులు హాజరై ఉంటారని అంచనా. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొనేందుకు వీలుగా రాజంపేట ఆర్టీసి డిపో ప్రత్యేక బస్సులు రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల నుండి నడిపింది. రాజంపేట పాత బస్టాండు నుండి అయితే మహాశివరాత్రి నాడు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడపడం విశేషం. మహాశివరాత్రి ముందురోజు నుండి మూడు రోజుల పాటు రాజంపేట ఆర్టీసి డిపో అత్తిరాలకు పాత బస్టాండు నుండి ప్రత్యేక బస్సులు నడపడం జరిగింది. దీంతో ఆర్టీసికి కూడా మంచి ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, కపాలేశ్వర ఉత్సవం, లింగార్చన, శిఖర దీపారాధన, లింగోధరణ, నంది ఉత్సవంలతో పాటు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, పెళ్లికొడుకు గుర్రపు వాహనం, గజోత్సవం, పూల రధోత్సవం, హనుమంతోత్సవంలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవ్వడం జరిగింది. మహాశివరాత్రి నాడు ఆ తరువాత రోజు రాత్రుళ్లు సైతం భక్తులు వేల సంఖ్యలో అత్తిరాలలో జాగరణ నిమిత్తం మకాం వేయడం విశేషం. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ ఉత్సవాలకు భక్తుల్లో ప్రత్యేక భక్త్భివం ఉంది. అందువల్ల భక్తులు విరివిగా పాల్గొని త్రేతేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా మంగళవారం ఉదయం వసంతోత్సవం, పిగిలికూట ఉత్సవాలతో రాత్రి ధ్వజా అవరోహణంలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ ఏడాది శ్రీ త్రేతేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు నిత్యం వేల సంఖ్యలో వస్తుండడంతో వీరిని అదుపు చేసేందుకు నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇక్కడి పరశురాముని మాతృహత్యా పాతకాన్ని రూపుమాపిన బాహుదానదికి ప్రక్కనే భక్తులు స్నానాలు ఆచరించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేసుకొని పోలీసుశాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. రెవిన్యూ శాఖ ప్రత్యేక భద్రతా సిబ్బందిని బాహుదానది వద్ద ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్యశాఖ కూడా అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు అత్తిరాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తానికి అత్తిరాల బ్రహ్మోత్సవాలలో జిల్లాలోని నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా కొంతమంది దాతలు, స్వచ్ఛంధ సంస్థలు, వ్యాపార సంస్థలు చలివేంద్రాలు, అన్నదానాలు ఏర్పాటు చేయగా, దేవస్థానం నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాత్రి సమయాల్లో ఏర్పాటు చేశారు. కాగా అత్తిరాల శైవక్షేత్రంగా వెలుగొందుతున్నా ఇక్కడ శ్రీ గధాధరస్వామి పురాతన ఆలయం ఉంది. అలాగే పరశురామ ఆలయం కూడా ఉంది. అయితే పరశురామ ఆలయం పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. అత్తిరాల శైవక్షేత్రానికి సంబంధించి అనేక ఇతిహాసాలున్నాయి. చారిత్రాత్మక చరిత్ర కలిగిన అత్తిరాల శైవక్షేత్రాన్ని మరింతగా భక్తులకు అనువుగా అభివృద్ధి చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.