కడప

నిద్దరోతున్న నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 11: జిల్లాలో ఉన్న ఎర్రచందనం సంపదను స్మగ్లర్లు, తమిళ ఎర్రకూలీలు యథేచ్చగా తరలిస్తున్నా స్మగ్లింగ్ అరికట్టేందుకు ఏర్పాటుచేసిన టాస్క్ఫోర్స్ అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఏమయ్యారో ఎవరికీ అంతుపట్టడం లేదు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు కొంతకాలం ప్రవేశించి టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులకు, సిబ్బందికి కన్నుగప్పి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. శేషాచలం అటవీప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేసే సమయంలో అక్కడి నుంచి బద్వేలు, లంకమల అభయారణ్యంలో ప్రవేశించి ఎర్రచందనాన్ని తరలిస్తున్నారు. గత రెండురోజులుగా బద్వేలు, ఖాజీపేట, పోరుమామిళ్ల, చెన్నూరు ప్రాంతాల్లో ఏకంగా 300 మంది తమిళకూలీలను అరెస్టు చేశారు. ఎర్రచందనం అరికట్టేందుకు దాదాపు రెండళ్లక్రితం ఒక డిఐజి, ఒక డిఎస్పీ, నలుగురు సిఐలు, వందలాది మంది పోలీసులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 15 చెక్‌పోస్టులు, 25 బేస్‌క్యాంప్‌లు ఏర్పాటుచేసి రాయచోటి, బద్వేలు, రైల్వేకోడూరు, రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు, పోలీసు సబ్‌డివిజన్ అధికారులకు, ఎస్‌ఐలకు ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ బాధ్యతలు అప్పగించి ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు నిఘా వుంచారు. ఇక అటవీశాఖ పరిధిలో రాష్ట్ర ఉన్నతాధికారులు కడప, చిత్తూరు కన్జర్వేటర్లు, డిఎఫ్‌ఓలకు బాధ్యతలు అప్పగించినా తమిళకూలీలు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్లో, చివరకు కడప, కర్నూలు జిల్లాల్లోని కొందరు ఆర్టీసీ డ్రైవర్లు చెన్నై బస్సుల్లో ఎర్రకూలీలను, స్మగ్లర్లను చెన్నై నుంచి నేరుగా ఎర్రచందనం ఉన్న ప్రాంతాలకు చేరవేస్తున్నారు. టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ఇంటి దొంగ అయిన పలువురు పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది , పలువురు అటవీశాఖ అధికారులు, సిబ్బంది ప్రమేయంతోనే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు గురౌతోందని ఇటీవల డిఐజి బాహాటంకంగా ప్రకటించారు. అలాగే ఇప్పటి వరకు 30వేల ఎకరాల్లోని అటవీప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు గురైందని ఆయన ప్రకటించారు. త్వరలో సిసి కెమెరాలు ఏర్పాటుచేసి శ్రీహరికోట నుంచి ఎర్రచందనం స్మగ్లర్ల కదలికలపై సాంకేతిక టెక్నాలజి ఏర్పాటు చేసేందుకు కడప, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు శివారు ప్రాంతాల నుంచి పోలీసులు నిఘా పెంచినా ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగడం లేదు. ఎర్రచందనం ఏకంగా వివిధ ప్రాంతాలైన సింగపూర్, మలేషియాలకు ఎగుమతి చేస్తున్నారు. 100మంది పైబడి స్మగ్లర్లపై పిడి యాక్టు బనాయించి కీలక స్మగ్లర్లపై నిఘా వుంచినా ప్రతినిత్యం టాటా సుమోలు మొదలుకుని లారీలు, టిప్పర్లు, ఆయిల్ ట్యాంకర్లు, పండ్లు, కూరగాయల మాటున ఎర్రచందనం ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో కడప, కర్నూలు జిల్లాలకు చెందిన కరువుగట్టిన స్మగ్లర్లు రూటుమార్చి ఎర్రచందనాన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా రెండు పర్యాయాలు మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుకున్నారు. ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులకు సంబంధం లేకుండా అదనపు ఎస్పీ ఆపరేషన్ సత్యయేసుబాబు పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్‌ను రంగంలో దింపి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారి సమాచారం మేరకు తమిళనాడు, కర్నాటక రాష్ట్రంలో స్మగ్లర్లు, కూలీలను పట్టుకుంటున్నారు. పలుమార్లు ఎన్‌కౌంటర్లు జరిగినా, బేస్ క్యాంపులు చేసినా స్మగ్లర్లు, తమిళ ఎర్రకూలీలు బరితెగించి శేషాచలం , లంకమల అభయారణ్యంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనాన్ని ఎల్లలుదాటిస్తున్నారు. ఏకంగా రెండురోజుల కింద 300 మంది ఎర్రకూలీలు తమిళనాడు రాష్ట్రంనుంచి జిల్లాలో ప్రవేశించడంపై జిల్లా ఎస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లతో స్థానిక పోలీసు అధికారులకు, పోలీసులకు నజరానా ముట్టచెప్పడంతో వారు సైతం స్మగ్లింగ్‌కు ప్రత్యక్షంగా , పరోక్షంగా భాగస్వామ్యం అవు తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నడుం బిగించి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు గురికాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఊసేలేని రాజంపేట సుందరీకరణ

రాజంపేట, మార్చి 11: రాజంపేట పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు 12 ఏళ్ల క్రితమే వివిధశాఖల అధికారులతో సర్వే పూర్తయ్యింది. కారణాలు ఏమైనా పట్టణ సుందరీకరణ పనులుమాత్రం ఇప్పటివరకు ప్రారంభంకాలేదు. అసలు సుందరీకరణకు నాడుచేయించిన సర్వే నివేదిక అసలు ప్రభుత్వం వద్దకు చేరిందా? ఇందుకు సంబంధించి పనులు ఏఏ స్థాయిల్లో ఉన్నాయి? ఇందుకు సంబంధించి నిధులమాట ఏమిటి తదితర అంశాలకు సంబంధించి ప్రస్తుతం అతీగతి లేదు. పట్టణ సుందరీకరణ పనులమాట దేవుడెరుగు, అభివృద్ధికి సంబంధించి నిధులే ప్రస్తుతం మంజూరు చేసుకోవడం పెద్ద గగనంగా మారుతున్నది. పట్టణంలో రోడ్డువిస్తరణ పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందాన దశాబ్దం పైబడి పడి ఉన్నాయి. దీంతో పట్టణంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఇకపోతే పట్టణంలో ఆత్యంత కూడలి ప్రాంతమైన పాతబస్టాండ్ సుందరీకరణ విషయంలో తగు ప్రాధాన్యత ఇచ్చేందుకు నాడు భారీగానే ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. పాతబస్టాండు నాలుగుకూడళ్లవద్ద అందంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా అధికారులు అన్నికోణాల్లో పరిశీలించి ప్రతిపాదనలు పూర్తిచేశారు. అప్పట్లో నిధులుకూడా మంజూరైనట్టు తెలుస్తుంది. ఇకపోతే పట్టణమంతా అవసరమైన చోట డివైడర్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. పాత బస్టాండును సుందరీకరణ చేసే సమయంలో ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అధికార్లు దృష్టిలో పెట్టుకొని మరీ ప్రతిపాదనలు రూపొందించడంలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పట్టణాన్ని సుందరీకరణ చేసేందుకు వీలుగా ఆర్ అండ్ బి, ఎలక్ట్రికల్, రెవిన్యూ, పంచాయతీ, టెలీకం తదితర శాఖల సమస్యలను కూడా సర్వేలో పరిశీలించి మరీ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు జరిగినచోట పలుచోట్ల విద్యుత్ స్థంభాలు రోడ్డు మధ్యలోనే ఉన్నందున వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. తాజాగా మున్సిపాలిటీ అధికారులు పట్టణ ప్రధాన రహదారి, ఆర్‌యస్ రోడ్డుల్లో దుకాణాల ఎదుట ముందుకొచ్చిన రేకులను, ఇతరత్రా కట్టడాలను తొలగించారు. అయితే కరంట్ స్తంభాలు, టెలీఫోన్ స్తంభాలు తొలగించలేదు. రోడ్డు విస్తరణ చేపట్టలేదు. దీంతో మున్సిపాలిటీ రేకుల తొలగించినంత మాత్రాన ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. కనుక ఈ విద్యుత్తు, టెలీకం స్తంభాలనురోడ్డు చివరకు మార్చేందుకు వీలుగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇకపోతే ఆక్రమణల కారణంగా కూడా పట్టణంలో ప్రధాన పోస్ట్ఫాసు నుండి పాత బస్టాండు వరకు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల ప్రధాన రహదారిని విస్తరించినా ప్రధాన పోస్ట్ఫాసు నుండి పాత బస్టాండు వరకు పాత పద్ధతిలోనే విస్తరించకుండా అలాగే ఉంచేశారు. దీంతో నిత్యం ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు జఠిలంగా మారుతున్నాయి. ప్రధాన రహదారిలో కొనే్నళ్లక్రితం ఆక్రమణలు తొలగింపు ప్రక్రియలో అపశృతులు దొర్లడంతో పట్టణ బ్యూటిఫికేషన్‌కు సంబంధించి పనుల్లో వేగం మందగించేందుకు కారణాలుగా ఆరోపణలున్నాయి. ముఖ్యంగా వందలాది గ్రామాల నుండి నిత్యం రాకపోకలు సాగిస్తున్న పాతబస్టాండును సుందరీకరణ చేసే సమయంలో ప్రయాణీకులు పడుతున్న సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుని ఇక్కడ నాలుగు వైపులా బస్‌షెల్టర్స్ వసతి కల్పించడంతోపాటు మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీటి వసతులు కల్పించడం అవసరమని గుర్తించారు. రాజంపేట పట్టణంలో విశాలమైన ఆర్టీసీ బస్టాండ్ ఉన్నప్పటికి ఇది గ్రామీణ ప్రాంతాల ప్రయాణీకులకు అనుకూలంగాలేదు. రాజంపేట ఆర్టీసీ డిపో నుండి వెళ్ళే ప్రతిబస్సు పాత బస్టాండులోని నాలుగురోడ్ల కూడళ్ళ నుండే వెళ్ళాల్సి ఉండడంతో ఇక్కడి నుండే ప్రయాణీకలు తమ గ్రామాలకు రాకపోకలు సాగించడం అలవాటు చేసుకొని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పాత బస్టాండును అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పట్టణమంతా రెండు వైపులా సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తిచేసి మధ్యలో డివైడర్ నిర్మాణంతో పాటు విద్యుత్తు స్తంభాలను ఎర్పాటు చేయాల్సి ఉంది. ఏదిఏమైనా పట్టణాన్ని సుందరీకరణ చేసే విషయంలో అప్పట్లో అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు సకాలంలో ఇప్పటికైనా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.