కడప

జిల్లాకు చేరుకున్న సిఆర్ఫీ, ఎపిఎస్‌బి ప్రత్యేక బలగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 19:స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌ను పురస్కరించుకుని ఓట్లలెక్కింపుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సిఆర్పీఎఫ్, ఎపిఎస్‌బి కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలను ఆదివారం రాత్రి ఓట్లలెక్కింపు ప్రాంతమైన కలెక్టరేట్, పరిసర ప్రాంతాలకు తరలించారు. ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ స్వయ పర్యవేక్షణలో ఇప్పటి వరకు 200 మీటర్ల మేరకు నేతల సంచారం ఉండాలని ప్రకటించి, 500 మీటర్ల మేరకు ఓట్లలెక్కింపు ఏజెంట్లు మినహా మిగిలిన వారెవరైననూ లెక్కింపు దరిదాపులకు చేరకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఎల్‌ఐసి కార్యాలయం, రిమ్స్ మార్గం, రైల్వేస్టేషన్ మార్గాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో బూట్ల చప్పుడు, ప్రతి ఒకరి చేతిలో ఎస్‌ఎల్‌ఆర్, ఏకె 47 గన్‌లతో పోలీసులు పహరా కాస్తున్నారు. బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల చుట్టూ గట్టి భద్రత చర్యలపై పోలీసులు దృష్టి సారించారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రతిపక్ష వైకాపా నేతలు ఒక ప్రక్క ఫలితాలపై ఉత్కంఠ, మరో ప్రక్క బ్యాలెట్‌ల మార్పు ఏమైనా ఉంటుందనే ఉద్ధేశ్యంతో కలెక్టరేట్ చుట్టూ డేగ కన్ను పెట్టి నేతలు ఎప్పటికపుడు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులను ప్రక్కనబెట్టి 11 ప్యాటూన్‌ల పోలీస్ నియామకాలు చేశారు. సాక్షాత్తు కలెక్టర్, ఎన్నికల అధికారి, ఎలక్ట్రోల్ అధికారి ఆ ప్రాంతాలకెళ్లాలన్నా వారి సంతకాలు తీసుకుని పంపుతున్నారు. ఎన్నికల కమిషనర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికపుడు జిల్లా పరిస్థితులను అడిగి తెలుసుకొంటున్నారు. ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఇప్పటికే ఎన్నికల కమిషనర్‌ను సంప్రదించి ఓట్లలెక్కింపు కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా జరిపించాలని అధికార పార్టీ నేతలపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్పీ మరింత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు భారీ పోలీస్ బందోబస్తుతో ఒక ప్రక్క భయాందోళనలకు గురికావడంతో పాటు ఆందోళన చెందుతున్నారు.

ఫించా జలాశయ గర్భంలో గుంతలు
సుండుపల్లె, మార్చి 19: కడప - చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన పింఛా ప్రాజెక్టులో నీటి కోసం గుంతలు ఏర్పాటు చేశారు. కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడ నీరు ఉంటే అక్కడికి వెళ్లి తమ పొలం తడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం జలవనరులకు నష్టం కలిగే ప్రమాదం ఉన్న వెనుకాడని పరిస్థితి నెలకొంది. ఇందుకు పింఛా జలాశయంలో ఏర్పాటు చేసిన భారీ గుంతలే నిదర్శనం. పింఛా జలాశయ లోతట్లు ప్రాంతంలో పరిసర ప్రాంతాల రైతులు పెద్ద ఎత్తున గుంతలు తీస్తున్నారు. వాటిలో మోటార్లు ఏర్పాటుచేసి పొలాలను నీటిని తరలిస్తున్నారు. జలాశయ సరిహద్దు గ్రామాలైన చిత్తూరు జిల్లా కెవిపల్లె మండలం, జిల్లేల మంద, బసన్నగారిపల్లె మండలంలోని పింఛా పరిసర గ్రామాల రైతుల జలాశయ గర్భంలో బావులు తవ్వించారు. వాటిని విద్యుత్ మోటార్లు అమర్చి దూర ప్రాంతంలోని పొలాలను నీటిని తరలిస్తున్నారు. దీని వల్ల జలాశయంలోకి వచ్చే నీటి పాయలు ఇంకిపోయి నీరు ఆగిపొతుందని మండల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలాశయంలో నీరు ఇంకిపోయి పశువులకు, గొర్రెలకు తాగేందుకు నీరు దొరకని పరిస్థితి రాబోతుందని వాపోతున్నారు. ముఖ్యంగా జిల్లేల మంద, బసన్నగారిపల్లె ప్రాంతాలకు చెందిన కొందరు రైతులకు జలాశయం ముంపు ప్రాంతంలో అధికారికంగా విద్యుత్ నియంత్రికలు కూడా ఏర్పాటు చేశారు. గుట్టల వెంబడి సర్వీసు వైర్లు నది లోతట్టు ప్రాంతాలకు తీస్తున్నారు. సుమారు 20 నుంచి 40 వరకు ఇలాంటి బావులు తవ్వినట్లు పక్క ప్రాంతాల రైతులు చెబుతున్నారు. దీని వల్ల పంట పొలాలకు నీరందే అవకాశం ఉన్న జలాశయంలోని జలవనరులు ఎండిపోయే ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ విషయం పింఛా ప్రాజెక్టు అధికారులకు, నీటి సంఘం అధికారులకు, జలాశయ సంరక్షకులకు తెలిసినా కూడా స్పందించడం లేదని దిగువ ప్రాంతాల రైతులు కొరుతున్నారు.
లక్కిరెడ్డిపల్లె సిడిపిఓపై వేటు..

కడప,మార్చి 19: అంగన్‌వాడీ కేంద్రాల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న లక్కిరెడ్డిపల్లె సిడిపిఓ అధికారిణి అరుణశ్రీపై ఆ శాఖ కమిషనర్ చక్రవర్తి వేటు వేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రాష్టప్రరిశీలకునిగా స్ర్తిశిశు సంక్షేమశాఖ కమిషనర్ చక్రవర్తి జిల్లాకు వచ్చి పనిలో పనిగా ఆదివారం ఐసిడిఎస్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో భాగంగా నిధుల దుర్వినియోగం, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం పక్కదారిపట్టడం ఆయన కళ్లారా చూసి లక్కిరెడ్డిపల్లె సిడిపిఓ అరుణశ్రీపై వేటు వేశారు. జిల్లాలో మరికొంతమందిపై వేటు వేసే సమయానికి కమిషనర్ చక్రవర్తిని శనివారం ప్రభుత్వం అర్ధాంతరంగా బదిలీ చేస్తూ ఆయన్ను జిఏడికి రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లె ఇన్‌చార్జ్ సిడిపిఓగా రెడ్డి రమణమ్మను కూడా నియామకం చేశారు. లక్కిరెడ్డిపల్లె సిడిపిఓ అరుణశ్రీపై పై పలు మార్లు ఫిర్యాదులు అందడం, కమిషనర్ ఇచ్చిన సస్పెన్షన్ ఆదేశాలు ఖాతరు చేయకపోవడంపై కమిషనర్ సీరియస్ అయినట్లు తెలిసింది. జిల్లాలో కడప అర్బన్, కడప రూరల్, ప్రొద్దుటూరు అర్బన్, ప్రొద్దుటూరు రూరల్, రాయచోటి, పోరుమామిళ్ల, లక్కిరెడ్డిపల్లి, ముద్దనూరు, సిద్దవటం, కమలాపురం, పులివెందుల, రైల్వేకోడూరు, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగులో ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు మొదలుకుని సూపర్‌వైజర్లు, పరపతి కలిగిన కార్యకర్తలు, పాలు,గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై, యధేచ్చగా పందికొక్కుల్లాగా మెక్కుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో అన్ని ప్రభుత్వశాఖల్లో కొంతమేరకు ప్రక్షాళన జరిగినా ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ప్రక్షాళన జరగలేదు. కార్యకర్తలు, ఆయాలు చాలవరకు రాజకీయనాయకుల అండదండలతో పలు కేంద్రాలు నిర్వహించడం లేదు. అటువంటి కేంద్రాలు సక్రమంగా జరగకపోయినా కొంతమంది ప్రాజెక్టు అధికారులు, కొంతమంది సూపర్‌వైజర్లు లోపాయికారి ఒప్పందంతో నెలసరి మామూళ్లు తీసుకుని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ గాలికి వదిలారు. పసి పిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు ప్రభుత్వం అందజేస్తున్న పాలు, గుడ్లు, పండ్లు, ఆహారం పక్కదారిపడుతోంది. ప్రత్యేకించి స్ర్తిలు, మహిళా శిశువుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ఈ ప్రాజెక్టు అధికారులు రాబంధువులాగా తయారై అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సంబంధిత అధికారులు ఆ శాఖను ప్రక్షాళన చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలపై
టెన్షన్..టెన్షన్..

కడప, మార్చి 19: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై సోమవారం జిల్లా కేంద్రంలో ఓట్లలెక్కింపు సందర్భంగా అధికార టిడిపి, ప్రతిపక్ష వైకాపా చోటా, బడా నాయకుల్లో టెంక్షన్ నెలకొంది. ఇరుపార్టీల హైకమాండ్ వద్ద ప్రగల్భాలు పలికి తమ సత్తా చాటుతామని కోట్లకు కోట్లు డబ్బులు తెచ్చుకుని ఓటర్లకు పంచి ఫలితాల్లో తేడాలొస్తే తమ రాజకీయ ఉనికిని కోల్పోతామని నేతల్లో టెంక్షన్ మొదలైంది. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్‌పై ఓటర్ల నాడి నేతలకు అంతుచిక్కక పోవడంతో ఇరుపార్టీల ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు పైకి బహిరంగంగా గెలుపు తమ అభ్యర్థిదేనంటూ డంభాలు పలుకుతూ లోలోపల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఫలితంలో ఏదైనా తేడా వస్తే అధిష్ఠానం వద్ద తమ మొఖాన్ని ఎలా చూపాలని తీవ్రంగా మథన పడుతున్నారు. పేరుకేమో 839 ఓట్లు పోలింగ్ కాగా అంతకు భిన్నంగా రెట్టింపులో తమ నేతలకు అధికంగా ఓట్లు వేయిస్తామని సంబంధిత అధిష్ఠానం వద్ద ఛాలెంజ్ చేసి పెద్దఎత్తున నగదును తీసుకొచ్చిన నేతలంతా ఫలితాల అనంతరం ఏ మాత్రం తేడాలొస్తే తమ పరిస్థితేంటి అని కొంతమంది నేతలు తర్జన భర్జన పడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఓటర్లకు పెద్దమొత్తంలో నగదు అప్పజెప్పి అధికార పార్టీ నేతలైతే ఏకంగా నగదు కాకుండా ప్రతి ఓటరుకు రూ. 20 లక్షల మేరకు కాంట్రాక్టు పనులు అప్పనంగా అప్పజెప్పారు. వైకాపాకు సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నా వారెక్కడికి వెళ్లతారోనని వైకాపా నేతలు అందరికీ కావాల్సినంత మొత్తాలు ముట్టజెప్పి వారిని స్వేచ్ఛగా వదలడంతో పాటు చివరి దశలో పిల్లకోళ్లలా కాపాడి వారిలో కొంతమందిని అధికార టిడిపి నేతలు హైజాక్ చేయడం, కొంతమందిని ప్రలోభ పెట్టి వారి శిబిరాలకు తీసుకెళ్లారు. అయితే ఇరు పక్షాల నేతలు కాకిలెక్కలేస్తుండగా రాజంపేట, కడప డివిజన్ తమకే అధిక్యం వస్తుందని టిడిపి, జమ్మలమడుగు డివిజన్‌లో క్రాస్ ఓటింగ్ జరిగిందని వైకాపా నేతలు భావిస్తూ లోలోపల అనుమానాలున్నా పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. అయితే ఇరు పార్టీల అగ్ర నేతలలో గంట గంటకు ఉత్కంఠ రేకెత్తిస్తున్నా డివిజన్‌ల వారిగా తమ అనుచర గణాలతో సంప్రదింపులు చేస్తూ కూడికలు, తీసివేతలు వేస్తూ సంతృప్తి పడుతున్నారు. ఏదీ ఏమైనా సోమవారం ఓట్లలెక్కింపుతో ఎమ్మెల్సీ బరిలో దిగిన అభ్యర్థుల భవిత్యం, ఇరు పార్టీల రాజకీయ భవితవ్యం ఉదయం పది గంటల్లోపే తేలనుంది. నాయకులను టెంక్షన్, టెంక్షన్ వెంటాడుతుంది. ఓట్లలెక్కింపు భారీ ఎత్తున అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం చేపడుతున్న చర్యలు నేతలకు మింగుడు పడలేదు.