కడప

ట్రిపుల్ ఐటీలో పరికరాలన్నీ నాసిరకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 24: ట్రిపుల్ ఐటీ అధికారులు విద్యార్థుల అవసర నిమిత్తం కొనుకోలు చేసిన పరికరాలన్నీ నాసిరకంగా ఉన్నాయని పలువురు విద్యార్థులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో టెన్త్‌లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఎంతో ఉన్నతాశయంతో సాంకేతికపరమైన ట్రిపుల్ ఐటిని దాదాపు 9 ఏళ్లక్రితం ఇడుపులపాయలో స్థాపించి సాంకేతిక విద్యార్థులకు విద్యాభ్యాసం చేయించేందుకు రూ.10కోట్లతో పరికరాలు కొనుగోలు చేశారు. ఆ రూ.10కోట్లలో కమీషనే్ల రూ.2కోట్లు పైబడి వుంటుందని, ఆ పరికరాలన్నీ నాశిరకంగా ఉన్నాయని, ప్రయోగశాలలో విద్యార్థులు ఆ పరికరాలు ఉపయోగించలేక లబోదిబోమంటున్నారు. ఇడుపులపాయలో వసతులు, రక్షణ, టీచింగ్ అంతంతమాత్రమేనని విద్యార్థులు వాపోతున్నారు. పరిపాలనలో సాధారణ పరిపాలన, చివరకు విద్యాభ్యాసం కోసం సరఫరా చేసే సాంకేతిక పరికరాలు కూడా అంతంతమాత్రమే. ట్రిపుల్ ఐటిలో ఆరేళ్లపాటు ఇప్పటివరకు తెలుగురాష్ట్రాలకు చెందిన 6వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. టెన్త్‌లో ప్రతిభ కనబరచిన వారికి పియుసిలో రెండేళ్లపాటు, మిగిలిన నాలుగేళ్లపాటు బిటెక్‌లో, మెకానికల్, విసిఇ, కెమికల్, జిఎస్‌ఇ, సివిల్ కోర్సులతోపాటు ఎంఎంఇ ఇంజినీరింగ్ విభాగాలున్నాయి. ఏటా వెయ్యిమంది పైబడే విద్యాభ్యాసం చేస్తుండటంతో వారికి ల్యాప్‌ట్యాబ్‌లు, వివిధ పరికరాలు అందించేందుకు ఏటా ప్రభుత్వం కోట్లరూపాయలు ఖర్చుచేస్తోంది. ట్రిపుల్ ఐటిలో ల్యాబ్‌ల్లో పరికరాలు అంతంతమాత్రమే. టెక్నికల్ మిషన్లుకానీ, టెక్నికల్ పరికరాలు కానీ ఎటువంటి పరికరం తీసుకున్నా కేవలం కాసులకు కక్కుర్తిపడి ఉన్నతాధికారులకు తప్పుడు సలహాలు ఇచ్చి సంబంధిత అధికారులు కూడా ఏమీ తెలియనట్లుగా వ్యవహరించి కేవలం పరికరాల్లోనే రూ.2కోట్లు పైబడి స్వాహా చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఎవరైనా పరికరాలు బాగాలేవని చెబితే వారిని మానసికంగా హింసిస్తున్నట్లు తెలుస్తోంది. టీనేజ్‌లో విద్యార్థులను సక్రమంగా పట్టించుకోకపోవడంతో విద్యార్థుల ఆత్మహత్యలు పదుల సంఖ్యకు చేరింది. ప్రధానంగా పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారులు చుట్టపుచూపుగా వచ్చి ఇక్కడి పరిస్థితులు అవగాహన చేసుకోకపోవడంతోపాటు కేవలం పదవీవిరమణ పొంది ఉన్న అధికారులను నియామకం చేయడంవల్ల వారికి ప్రస్తుతం ఉన్న టెక్నాలజిపై అవగాహన లేకపోవడం, వారు విద్యార్థుల నాడి సరిగా తెలియకపోవడం అనేక సందర్భాల్లో ఆ అధికారులు పిల్లలపై అవగాహన చేసుకోకుండా సర్వం తామేనని వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ట్రిపుల్ ఐటీని గాలికి వదిలేసి, కాసులకు కక్కుర్తిపడే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వమే నేరుగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకుని ట్రిపుల్ ఐటీ విద్యార్థుల జీవితాల్లో వెలుగునింపేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.