కడప

సౌమ్యనాథాలయం అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, ఏప్రిల్ 21: జిల్లాలో అతి పురాతన, చారిత్మ్రకంగా ప్రసిద్ధికెక్కిన నందలూరు శ్రీసౌమ్యనాథాలయం అభివృద్ధికి నూతన పాలకమండలి కృషిచేయాలని విప్ మేడా మల్లికార్జునరెడ్డి కోరారు. శుక్రవారం సౌమ్యనాథాలయంలో నూతనంగా ఎంపిక చేసిన పాలకమండలి సభ్యులచే దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడా మాట్లాడుతూ సౌమ్యనాథ అన్నదాన ట్రస్టు అధ్యక్షులు యెద్దల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ట్రస్ట్భువనం, కల్యాణ మంటపం నిర్మాణంకు తన సోదరుడు మేడా రఘనాథరెడ్డి రూ. 32 లక్షలతో ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుండి భక్తాదులకు ఇక్కడ అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల విరాళాలు రూ. 73.46 లక్షలు స్వీకరించి బ్యాంక్‌లో జమ చేయగా వడ్డీతో కలపి నేటికి రూ. 87.73 లక్షలు అయిందన్నారు. ఆలయానికి సంబంధించి దాదాపు కోటి రూపాయల ఫిక్స్‌డ్ నిధులు బ్యాంక్‌లో ఉన్నాయన్నారు. నూతన పాలకమండలి, ఇఓ, స్థానికులతో కలసి ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యెద్దల సుబ్బరాయుడు మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా అహర్నిశలు కృషిచేస్తుంటే కొందరు గిట్టనివారు అసత్య ప్రచారాలతో బురదచల్లడం విచారకరమన్నారు. అవకాశం ఉంటే ఆలయాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ జె.తిరువెంగళాచారి మాట్లాడుతూ తాను పదవీ విరమణ అనంతరం నందలూరులో ఉంటున్నాని సౌమ్యనాథాలయం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.
పాలకమండలి అధ్యక్షులుగా
పల్లె సుబ్రహ్మణ్యం
సౌమ్యనాథాలయం నూతన పాలకమండలి అధ్యక్షులుగా పల్లె సుబ్రమణ్యంను సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా చక్రాల రామసుబ్బన్న, కానకుర్తి వెంకటయ్య, మోడపోతుల రాము, కొండపల్లి సుబ్బరాయుడు, లంకయ్యగారి సుబ్బరామయ్య, గాలి వరలక్షుమ్మతో పాటు ఎక్స్ ఆఫిషియో మెంబర్‌గా ఆలయ పూజారి సునీల్‌కుమార్‌ను ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సోమలరాజు చంద్రశేఖర్‌రాజు, అతికారి వెంకటయ్య, శివరామరాజు, సమ్మెట శివప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, జె.సుబ్రమణ్యం, యు.సుధీర్, సి.సాయి, తహశీల్దార్ చంద్రశేఖర్, ఎంపిడిఓ మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు!

కడప,ఏప్రిల్ 21: రాష్ట్రప్రభుత్వం తాజాగా రెవెన్యూ డివిజన్ల పరిధిలో అర్బన్‌స్థాయి మండలాలు పెంచుతున్న తరుణంలో జిల్లాలో బద్వేలు రెవెన్యూ డివిజన్‌గా, కడప, ప్రొద్దుటూరు అర్బన్ మండలాలుగా ఏర్పాటుకు ప్రభుత్వం పరిశీలనలో ఉండటం, రేపోమాపో సర్వేకు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందనున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితమే రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదని, రెవెన్యూ డివిజన్లను పెంచి ప్రజలకు సేవలందించేందుకు మరింత అందుబాటులోకి ఆర్డీవో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అదే తరహాలో అర్బన్ మండలాలు ఏర్పాటుకు ప్రభుత్వం సమ్మతించి కడప కార్పొరేషన్ స్థాయి పెరగడంతో పలు గ్రామపంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేయడం వల్ల మండల పరిధి పెరిగింది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న అన్ని మండలాల శాఖలను అర్బన్ మండల శాఖలుగా విభజించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన మరో మండలం ఏర్పాటుకు ప్రభుత్వపరిశీలనలో ఉంది. అదే తరహాలో ప్రొద్దుటూరు కూడా పెద్ద మున్సిపాల్టీకావడం, ఆ మున్సిపాల్టీ పరిధిలో కూడా గ్రామాలు కలవడంతో ప్రొద్దుటూరును కూడా ప్రస్తుతం ఉన్న మండలాన్ని పెంచి, అర్బన్, రూరల్ మండలాలు కూడా విభజించేందుకు ప్రభుత్వంలో ప్రతిపాదనలు ఉన్నాయి. అదే తరహాలో విభజన జరగాలని వస్తే జనాభాలో మూడవ స్థానంలో ఉన్న రాయచోటి పురపాలక సంఘంలో అర్బన్ మండలంగా ఏర్పాటుచేసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన త్వరలో జరుగుతుందని ఆ నియోజకవర్గాలకు తగ్గట్టుగా మండలాలు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విభజన అనంతరం 10 జిల్లాలుగా ఏర్పాటుకావడం, అక్కడి ప్రభుత్వం 31 జిల్లాలుగా విభజించింది. ఆ తరహాలో రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా రెవెన్యూడివిజన్లు, అర్బన్ మండలాలు ప్రకటిస్తున్న తరుణంలో జి బద్వేలు రెవెన్యూ డివిజన్‌స్థాయి, కడప, ప్రొద్దుటూరులకు అర్బన్ మండలాల స్థాయి , అదేవిధంగా రాయచోటిలో మండలం కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద జిల్లాలో ప్రస్తుతం ఉన్న మూడు రెవెన్యూ డివిజన్ల స్థానంలో మరో రెవెన్యూ డివిజన్ కావడం, 50 మండలాలను 52 మండలాలుగా రూపుదిద్దుకోబోతున్నాయి.

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బాబురావు

కడప,ఏప్రిల్ 21: జిల్లా నూతన కలెక్టర్‌గా టి.బాబురావు నాయుడు శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కెవి సత్యనారాయణ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. బాబురావు నాయుడు విశాఖ పట్టణం కమిషనర్‌గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. నైపుణ్యాల అభివృద్ధి కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా బదిలీ అయిన కెవి సత్యనారాయణ రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు నూతన కలెక్టర్‌కు స్వాగతం పలుకుతూ బదిలీ అయిన కలెక్టర్‌కు ఘనంగా వీడ్కోలు చెప్పారు. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్న నూతన కలెక్టర్ బాబురావు నాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధిపథకాలు అమలులో జిల్లాకు రాష్ట్రంలోనే మంచిపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. జిల్లాలోని అధికారులు, అనధికారులు, మీడియా తమ వంతుగా సహాయ సహకారాలు అందించి జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న పథకాల తీరుతెన్నులను బదిలీ అయిన కలెక్టర్ కెవి సత్యనారాయణ కొంతమేరకు వివరించారు.
ఆయన కూడా నూతన కలెక్టరేట్‌లో అన్ని బ్లాక్‌లు పరిశీలించి అవగాహన చేసుకుని జిల్లా భౌగోళిక పరిస్థితులు, సరిహద్దులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ, ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ -2 ఎస్వీ నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఈశ్వరయ్య, జిల్లా ప్లానింగ్ అధికారి తిప్పేస్వామి, కడప, జమ్మలమడుగు, రాజంపేటల రెవెన్యూ డివిజన్ల అధికారులు చిన్నరాముడు, వినాయకం, వీరబ్రహ్మం, సమాచార పౌరసంబంధాల అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ రఫిక్, కలెక్టరేట్ పరిపాలన అధికారులు, డిఆర్‌డిఏ, డ్వామా ఇన్‌చార్జ్ పిడి జి.అనిల్‌కుమార్‌రెడ్డి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పిడి మధుసూదన్‌రెడ్డి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటసుబ్బయ్య, డిఇఓ శైలజ, ఆర్‌ఐఓ రవి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ వి.రామిరెడ్డి, వివిధశాఖల జిల్లా ఉన్నతాధికారులు నూతన కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

జిల్లాలో మెగ్నీషియం కర్మాగారం ఏర్పాటు!

కడప,ఏప్రిల్ 21: ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉక్కుకర్మాగారం స్థానంలో మెగ్నీషియం కర్మాగారం ఏర్పాటుచేసి తద్వారా ఇనుపకడ్డీలు తయారీకి శుక్రవారం జరిగిన కేబినెట్‌లో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రకటించారు. ట్రంకో అవిలియాన్ మెగ్నీషియం నిక్షేపాలు జిల్లాలో అధికంగా ఉన్నందున మెగ్నీషియన్ కర్మాగారం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఐరన్ ఓర్ లభించినా ఆ ఐరన్ ఓర్‌తో ఉక్కుకర్మాగారాన్ని ఏర్పాటుచేయాలంటే మరికొన్ని ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ముడిపదార్థాలు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించాల్సివుంటుంది. దీనిపై సెయిల్ కూడా రెండు పర్యాయాలు సంబంధిత అధికారులు జిల్లాను సందర్శించి కేంద్రప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. అయితే ప్రస్తుతం ట్రంకో అవిలియాన్ మెగ్నీషియం కర్మాగారానికి అనువైన ముడిసరుకు ఉందని ప్రభుత్వం భావించి ఇక్కడ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లాలో మెగ్నీటైట్, హెమటైటీస్ ముడిసరుకు అధికంగా లభిస్తున్నందున మెగ్నీషియం కర్మాగారం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. సిఎం నిర్ణయం పట్ల జిల్లాలోని నిరుద్యోగులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

24న పుష్పగిరిలో టెంకాయల వేలం
వల్లూరు,ఏప్రిల్ 21: పుష్పగిరి క్షేత్రంలో టెంకాయల వేలంపాటను ఈనెల 24న నిర్వహించనున్నట్లు ఆలయ ఇఓ సురేష్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాటలో పాల్గొన వలసిన వారు రూ.30వేలు డిపాజిట్ చేయాలని తెలిపారు. సంవత్సరం కాలంపాటు టెంకాయల విక్రయం కోసం వేలంపాట నిర్వహించనున్నట్లు ఎవరైనా ఆసక్తి ఉన్న వ్యక్తులు 24న సోమవారం తమ వివరాలు తెలియజేయాలన్నారు.

పురావస్తు కట్టడాలను పరిరక్షించాలి

సిద్దవటం,ఏప్రిల్ 21:పురాతన కట్టడాలు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పురావస్తుశాఖ అధికారి బాలకృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన సిద్దవటం కోట వద్ద స్వచ్చత పక్వాడాలో భాగంగా శుక్రవారం పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, స్వచ్ఛ భారత్ అని విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం జిల్లా పురావస్తుశాఖ అధికారి మాట్లాడుతూ పురాతత్వ అదీక్షకులు శ్రీలక్ష్మి, తాహర్‌ల ఆధ్వర్యంలో ప్రతి పురావస్తు కట్టడాల వద్ద స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో సిద్దవటం కోటలో ఈర్యాలీని నిర్వహించామన్నారు. ప్రాచీన కట్టడాల వద్ద పాలతిన్ కవర్లు నిషేధించాలన్నదే లక్ష్యమన్నారు. పురావస్తు కట్టడాలు సందర్శించే పర్యాటకులు పాలతిన్ కవర్లు తీసుకుని వచ్చినా అక్కడ పడేయకూడదన్నారు. రాజులు పాలించిన కట్టడాలు భావి భారత పౌరులకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పురావస్తుశాఖ సిబ్బంది స్వరూపరామ్, ప్రభాకర్, నరసయ్య, ఎన్‌ఆర్ సిబ్బంది సుబ్రమణ్యం, శ్రీనివాసులు, కరీముల్లా, విద్యార్థులు పాల్గొన్నారు.
కోట అభివృద్ధికి కృషి..సిద్దవటం కోట మరమ్మతుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపి కోట అభివృద్ధికి కృషి చేస్తామని మట్లిరాజులకోటలో స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కోటలోని ముఖద్వారం, రెండవ మంటపంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని డైరెక్టర్ ఆఫ్ జనరల్ న్యూఢిల్లీకి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. అలాగే కోటలోని మసీదుకువెళ్లే బీమ్ ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లోరింగ్ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే నిపుణులు సహాయంతో కట్టడాలు వెలికితీసేందుకు కృషి చేస్తామన్నారు. పురావస్తుశాఖ రెండు రాష్ట్రాలు విడిపోతున్న సందర్భంగా తెలంగాణ, అమరావతి అధికారులు విశ్వవారసత్వ దినోత్సవం సందర్భంగా ఈనెల 16 నుంచి 30వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

జల సంరక్షణ.. విప్లవాత్మక చైతన్యం..

మైలవరం, ఏప్రిల్ 21:ప్రతి యేటా భూగర్భజలాలు అంతకంతకూ అడుగంటుతూ ఇప్పటికే దాహార్తి కేకలు వినిపిస్తున్న నేపథ్యంలో జల సంరక్షణం విప్లవాత్మక చైతన్యం దిశగా అడుగులు పడుతున్నాయి. అటు ప్రభుత్వాలు భారీఎత్తున ప్రచారం కల్పించడం, జల సంరక్షణ పనులకు కోట్లాది రూపాయలు వెచ్చించడం జరుగుతోంది. ఎవరు ఏం చేసినా ప్రజాచైతన్యంతోనే క్షేత్రస్థాయిలో భూగర్భ జలాల పెంపుదలకు జలసంరక్షణ అవసరమన్న భావన కల్పించడం కింకర్తవ్యం. ఈ దిశగా మండల పరిధిలోని దాల్మియా సిమెంటు పరిశ్రమ గత మూడేళ్లుగా భారీఎత్తున చేపట్టిన నీటి నిల్వ కేంద్రాలు, భూమిలోకి నీటిని ఇంకించడం, నీటివృథా అరికట్టడం, వర్షాధార నీటి ప్రవాహాలను నిలకడగా నిల్వచేయడం వంటి పనులు చేయడం ద్వారా జలసంరక్షణలో ఆదర్శవంతంగా ముందడుగు వేస్తోంది. దాల్మియా సిమెంటు పరిశ్రమ వారు దాల్మియా భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సియస్‌ఆర్ విభాగంలో వీటి పనులపై తీవ్ర దృష్టి సారించారు. ఈ క్రమంలో వారు చేసిన, చేపడుతున్న పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిన్నకొమెర్ల వద్ద ఉన్న దాల్మియా సిమెంటు పరిశ్రమ పరిధిలో చిన్న కొమెర్ల, నవాబుపేట, తలమంచిపట్నం గ్రామ పంచాయితీలు వాటి పరిధిలోని గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో గత మూడేళ్లుగా జల సంరక్షణ పనులను చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి రైతుల పొలాల్లో 84 పంట కుంటలు త్రవ్వడం ద్వారా దాదాపు 80వేలు క్యూబిక్ మీటర్ల నీటిని ఇంకింపజేసినట్లు అంచనా. దీని ద్వారా భూగర్భజలాలు అడుగుంటి బోర్లలో నీటిమట్టం పడిపోతున్న పరిస్థితిని 40శాతం మేర అధిగమించారు. అదే విధంగా 2 చెక్‌డ్యాంలు, కాజ్‌వేలు, 4గ్యాబెన్ నిర్మాణాలు చేశారు. వీటితో పాటు గ్రామాల్లో గతంలో పూడికతో నిండిన వంకల్లో పూడికతీత పనులు చేశారు. దీనిద్వారా సుమారు 4లక్షల క్యూబిక్ మీటర్లు నీటి నిల్వ సామర్థ్యాలు పెంపొందించగలిగారు. వేసవి ఎద్దడి తీవ్రంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పలు కుంటల్లో నీటి నిల్వలు కనిపిస్తూ జలసంరక్షణ పనుల ఫలితాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి.
* నీరు, చెట్ల సంరక్షణ దిశగా అడుగులు:
- రాజశేఖర్ రాజు, దాల్మియా సియస్‌ఆర్ ఎఎస్‌ఎం
భావితరాలకు అవసరమైన నీరు, చెట్ల సంరక్షణ దిశగా దాల్మియా భారత్ ఫౌండేషన్ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాము. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా జలసంరక్షణ పనులను భారీగా చేపట్టడం జరిగింది. గత కొనే్నళ్లుగా చేస్తున్న పనులు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రజల, రైతుల స్పందన దృష్ట్యా మరింతగా జలసంరక్షణ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము. వీటన్నింటికీ ప్రజల సహకారం తోడైతే మరింత ప్రగతి సాధించగలుగుతాం.

కడప కలెక్టర్‌గా పనిచేయడం అదృష్టం..

కడప,ఏప్రిల్ 21: జిల్లాలోని ప్రజలు, అధికారులు, నాయకులు చాలా మంచివారని జిల్లా అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేశానని ఈ జిల్లాలో పనిచేయడం తన అదృష్టమని అదే తరహాలో కొత్తకలెక్టర్ టి.బాబురావు నాయుడుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోనే జిల్లాకు ఒక ప్రత్యేకత ఉందని జిల్లాకు ఉన్న చరిత్ర పురాతన కట్టడాలు, వారసత్వ సంపద ఎనలేనిదని జిల్లా ఎంతో వెనుకబడిన జిల్లా అయినా ఆశించిన మేరకు అభివృద్ధిసాధించామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో అన్నిశాఖల అధికారులు శక్తిమేరకు పనిచేస్తున్నారని కడప జిల్లాలో పనిచేయడమనేది కత్తిమీద సాములాంటిదని కడప అంటే పనిచేసేందుకు కొంతమంది అధికారులు భయపడతారని, జిల్లా ప్రజల సహకారం మరువరానిదని తాను జిల్లాకు వచ్చిన సమయంలో అనేక ఇబ్బందులు ఎదురైనా వాటిని అధికమించానని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చానని స్పష్టం చేశారు. జిల్లాలో నీరు-ప్రగతి కింద చేపట్టిన జలవనరుల సంరక్షణ ఆశాజనకమని ఈ ఏడాది కూడా అదేతరహాలో అధికారులు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. రాష్టవ్రిభజన అనంతరం రాష్ట్రానికి కష్టాలు ఎదురైనా జిల్లా అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కావాల్సినన్ని నిధులు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. తాను జిల్లానుంచి బదిలీపై వెళ్తుండటం బాధాకరంగా ఉన్నా ప్రతి అధికారికి పదవి విరమణ, బదిలీ, పదోన్నతులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో శాఖాపరంగా అన్ని శాఖల్లో ఆశించిన మేరకు అభివృద్ధిసాధించామని వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం బాద్యతలు తీసుకున్న టి.బాబురావు నాయుడు ప్రసంగిస్తూ కలెక్టర్ సత్యనారాయణ సేవలు కొనియాడుతూ ఆయన సేవలు మరువరానివని ఏడాదిగా అతి తక్కువ సమయంలో పనిచేసినా జిల్లా అధికారులు చెప్పిన వివరాలు తీసుకుంటే కలెక్టర్ సేవలు సాధారణమైన సేవలు కావని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్క అధికారి కలెక్టర్ సత్యనారాయణను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నీరు-ప్రగతి కార్యక్రమాన్ని 90రోజుల్లో పూర్తిచేయాలని, ఇప్పటికే అధికారులు ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ ప్రసంగిస్తూ తాను జిల్లాకు వచ్చిన సమయంలో కలెక్టర్ సత్యనారాయణ బదిలీపై రావడం, ఆయన సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని సత్యనారాయణ జిల్లాలో అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధిపథకాలు మరువరానివని ఇదే తరహాలో అందరం పనిచేయాలని, కొత్తకలెక్టర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టం చేస్తూ బదిలీపై వెళ్తున్న సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ -2 ఎస్వీ నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఈశ్వరయ్య, జిల్లా ప్లానింగ్ అధికారి తిప్పేస్వామి, కడప, జమ్మలమడుగు, రాజంపేటల రెవెన్యూ డివిజన్ల అధికారులు చిన్నరాముడు, వినాయకం, వీరబ్రహ్మం, సమాచార పౌరసంబంధాల అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ రఫిక్, కలెక్టరేట్ పరిపాలన అధికారులు , డిఆర్‌డిఏ, డ్వామా ఇన్‌చార్జ్ పిడి జి.అనిల్‌కుమార్‌రెడ్డి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పిడి మధుసూదన్‌రెడ్డి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటసుబ్బయ్య, డిఇఓ శైలజ, ఆర్‌ఐఓ రవి, డిఎంహెచ్‌ఓ డాక్టర్ వి.రామిరెడ్డి, వివిధశాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొత్త కలెక్టర్‌కు స్వాగతం
రైల్వేకోడూరు, ఏప్రిల్ 21: కడప జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అన్నిశాఖల అధికారుల సహకారంతో కృషి చేస్తానని కడప జిల్లా కొత్త కలెక్టర్ బాబూరావునాయుడు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి తిరుపతికి చేరుకున్న ఆయన బాధ్యతలు స్వీకరించేందుకు కడపకెళ్తూ మార్గమధ్యంలోని రైల్వేకోడూరు అటవీ అతిథిగృహాంలో కాసేపు ఆగారు. రాజంపేట ఆర్డీఓ వీరబ్రహ్మం, తహశీల్దార్ చెండ్రాయుడు, ఆర్‌ఐ శేషంరాజు, చంద్రమోహన్‌రెడ్డి, వీఆర్వో ఈశ్వరయ్య కలెక్టర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేఖరులు నూతన కలెక్టర్‌ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపజిల్లాలోని పరిస్థితులను ముందుగా క్షేత్రస్థాయి నుంచి అధ్యయనంచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎండలు తీవ్రంకావడం, సకాలంలో వర్షాలు కురవకపోవడం తదితర పరిస్థితుల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా మొట్టమొదట తాగునీటి ఎద్దడి, పశువులకు గ్రాసం, రైతుల పరిస్థితులను అధ్యయనం చేసి, ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమాలు అందరికి అందేలా కృషి చేస్తానన్నారు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళతామన్నారు.