కడప

కరవైన మేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, మే 15:రాజంపేట డివిజన్ పరిధిలో అనేక గ్రామాల్లో మండుతున్న ఎండలకు మేతలేక పశువులు అలమటిస్తున్నాయి. ప్రస్తుతం కాస్తున్న ఎండల తీవ్రత కారణంగా ఎక్కడ చూసినా పంట పొలాలు, పచ్చిక బైర్లల్లో పచ్చిమేత కరవైంది. దీంతో పశువులకు పచ్చి మేత దొరకక పశు యజమానులు అనేక అవస్థలు పడక తప్పడం లేదు. గత ఏడాది వర్షాలు పడిన కారణంగా కొంతవరకు పరిస్థితులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత మెరుగ్గా ఉన్నప్పటికి తగ్గిపోతున్న భూగర్భనీటి నిల్వలతో ఆందోళన రైతుల్లో కనిపిస్తుంది. చెరువుల్లో, కుంటల్లో, మడుగుల్లో కూడా నీటినిల్వలు పడిపోతున్నాయి. ఈ కారణంగా భూమిలోని తేమ ఇంకిపోతూ పశువులకు పచ్చి మేత ఎండిపోతుంది. దీంతో పశువులను మేత కోసం పలు గ్రామాల్లో సుదూరంగా పాడి పశువుల యజమానులు తీసుకెళ్ళాల్సి వస్తుంది. పచ్చి మేత కోసం కొన్ని గ్రామాల్లో కిలోమీటర్ నుండి రెండు కిలోమీటర్ల వరకు పశువులను తొలుకువెళ్లి కుంటలు, వాగులు, వంకల్లో పశువులను మేపక తప్పనిసరి పరిస్థితిలు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా పశువులు ఎండ వేడిమికి తాళలేక పోతున్నాయి. దీంతో పాడి పశువుల రైతులు ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పాడి పశువులకు పచ్చి మేత తగ్గిపోవడంతో పాల దిగుబడి కూడా అంతంత మాత్రమే ఇస్తూ పాల శాతం గణనీయంగా పడిపోయిందని పాడి పశువుల రైతులు వాపోతున్నారు. పశువుల పచ్చి మేత కోసం బోరు బావుల కింద గడ్డి గింజలతో పచ్చి పశుగ్రాసాన్ని సాగు చేస్తూ కొంత మేర పాడి పశువులకు పచ్చి మేతను అందిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి పచ్చికబైర్లు పచ్చబడతాయనే ఆశతో రైతులు ఉన్నారు. అలాగే ఇంకొకమారు భారీవర్షం కురిస్తే కనీసం పశువులకు పచ్చిక బైర్లు పచ్చబడి మేతైన దొరుకుతుందని రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎదేమైనా ఈ మండుతున్న ఎండలకు పశువులు ఎండ వేడిమికి మేతలేక అలమతిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. పశు సంవర్ధకశాఖ అధికార్లు పాడి పశువులు పచ్చిమేత దొరకక పడుతున్న అవస్థలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది. ఇందుకోసం పచ్చిమేత లభించని అనేక గ్రామాల్లో దుస్థితిపై నివేదికలు కూడా సేకరించడం ద్వారా తదనుగుణంగా చర్యలు గైకొనేందుకు వీలవుతుంది. ఇప్పటికే పచ్చిమేత దొరకక పాల ఉత్పత్తులు పడిపోతే పాడి పశువుల యజమానులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఎండల తీవ్రత పెరిగే అవకాశాలున్నందున పశు సంవర్ధకశాఖ తగు చర్యలు వెంటనే చేపట్టాల్సిన అవసరముంది.

జిల్లాలో కనెక్టివిటీ నేషనల్ హైవే కోసం కేంద్రానికి ప్రతిపాదనలు

కడప, మే 15: అమరావతి నుంచి అనంతపురం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ఏర్పాటుకు కడప జిల్లాలో 64.5 కి.మీకనెక్టివిటీ హైవే రోడ్డుకోసం కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్టర్రోడ్లు, భవనాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత ద్వారా పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ టి.బాబురావునాయుడుతో కలిసి ఆయన ఇంజనీరింగ్ అధికారులు, ఆర్డీవోలు, డిఎఫ్‌వోలతో స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈసందర్భంగా సెక్రటరీ సుమిత ద్వారా మాట్లాడుతూ అమరావతి టు అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే ఏర్పాటువల్ల రాయలసీమ నుండి రాజధాని అమరావతికి వెళ్లేందుకు 100 కిమీ దూరం తగ్గుతుందన్నారు. అలాగే 5గంటలు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. ఈ వేగవంతమైన ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్‌వే ఏర్పాటువల్ల బెంగుళూరు నుంచి అమరావతికి వెళ్లేందుకు 150 కి.మీ.దూరం తగ్గడమే గాక, ప్రయాణ సమయం కూడా 6.5 గంటలు తగ్గుతుందన్నారు. అలాగే కడప నుంచి అమరావతి ప్రయాణానికి 60 కి.మీ. తగ్గి 2గంటలు సమయం ఆదా అవుతుందన్నారు. కర్నూలు నుంచి అమరావతికి 3గంటల సమయం ఆదాతోపాటు 20కి.మీ.ప్రయాణం తగ్గుతుందన్నారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ సర్వే, ఆర్‌అండ్‌బి అధికారులు కలిసి టేక్ మార్కింగ్ ప్రారంభించాలన్నారు.
కడప జిల్లాలోని ఖాజీపేట, పోరుమామిళ్ల, మైదుకూరు, బి.మఠం, బి.కోడూరుకు చెందిన 22 గ్రామాలలోని 897 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉందన్నారు. అమరావతి -అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే 4లైన్/6లైన్ అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల కనెక్టివిటీ కోసం రూ.24వేల కోట్లతో ప్రాజెక్టు చేపట్టడం జరిగిందన్నారు. కడప జిల్లాలో 64.5కి.మీ.మేర ఎక్స్‌ప్రెస్‌వే ఏర్పాటుకానుందన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేలో ఆర్థిక వనరులను,అభివృద్ధి చేసే దిశలో చర్యలుచేపట్టాలని, స్థానికంగా డిమాండు ఉన్న అంశాలపై దృష్టిసారించామన్నారు. సోలార్ పవర్ స్టేషన్ పెట్టిస్తే బాగుంటుందన్నారు. అలాగే పర్యాటకపరంగా ప్రభుత్వస్థలాలను గుర్తించి అక్కడ అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. స్టేట్ హైవేలో ఉన్న గుంతలకు మరమ్మతులుచేసి రహదారిలో ఎక్కడా వాహన చోదకులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. కడప జిల్లాలో 897 హెక్టార్ల భూమిని సేకరించేందుకు రెవెన్యు, అటవి, ఆర్‌అండ్‌బి అధికారులు సమన్వయంతో భూసేకరణ పనులు త్వరితగతినపూర్తి చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ఇందులో 70 హెక్టార్లలో అటవీభూమి ఉన్నందన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అందిన వెంటనే ప్రచురించి జూలై 31 నాటికి సర్వేప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రాజెక్టును అమలుచేయనున్నామన్నారు. సర్వేలో రెండు టీమ్‌లు ఏర్పాటుచేసి పని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే ఏర్పాటువల్ల దారిలో ఆర్థికపరిపుష్టి చేకూర్చడానికి పరిశ్రమల స్థాపన, టూరిజం కేంద్రాలను గుర్తించడం, సోలార్ పవర్‌ప్లాంటేషన్ ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. కడప జిల్లాలో 897 హెక్టార్ల భూమి నేషనల్ హైవే ఏర్పాటుకు కావాల్సివుందని తెలియజేశారు. ఇందులో 70.50 హెక్టార్ల అటవీభూమి కూడా కలిసి ఉందని, అందుకు తగిన భూసేకరణ త్వరలో పూర్తి చేయాలన్నారు. ఈసమావేశంలో కలెక్టర్ టి.బాబురావునాయుడు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ విజయవాడ మనోహర్‌రెడ్డి, ప్రొద్దుటూరు డిఎఫ్‌ఓ రవిశంకర్, కడప ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ వెంకటేశ్వరరావు, ఇఇ ఓబుల్‌రెడ్డి, ఆర్డీవోలు కడప, రాజంపేట, చిన్నరాముడు, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.