కడప

కన్నుల పండువగా వైకుంఠవాసుని రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, మే 15: పట్టణంలోని శ్రీనాపుర వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం పట్టణంలో వైకుంఠవాసుడైన శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండువుగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీవారి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, మార్కెటింగ్‌శాఖ మంత్రి సి. ఆదినారాయణరెడ్డి స్వామివారి తేరు(రథం) వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం సుముహూర్తంలో తేరును శ్రీవారి భక్తులు ఆలయ ఆవరణ నుండి లాగుతూ కదిలించారు. స్వామి వారి ఆలయ ప్రాంగణం నుండి బయలుదేరిన రథం పట్టణంలోని తేరు రోడ్డు ద్వారా ప్రధాన రహదారిలోని పెద్దపసుపల, సంజామాల మోటు, పాతబస్టాండు చేరుకుంది. అక్కడి నుండి మార్కెట్ మీదుగా ఆంజనేయస్వామి దేవాలయం వరకు రథోత్సవం సాగింది. అక్కడ కాసింత విశ్రాంతి తీసుకున్న తరువాత మధ్యాహ్నం నుండి తిరిగి శ్రీవారి రథం బయలుదేరి మెయిన్ బజార్ మీదుగా కన్యకాపరమేశ్వరి దేవాలయం వీధి, అంబాభవాని దేవాలయం, పలగాడి సెంటర్‌ల మీదుగా సాయంత్రంనకు శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని చేరుకుంది. రథోత్సవం సాగినంత సేపు పురవీధులన్నీ గోవిందనామస్మరణతో మార్మోగాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు రథంపై ప్రత్యేక అలంకరణలతో కొలువుదీరారు. రథంపై కొలువుదీరి శ్రీవారు పురప్రజలకు కనువిందు చేశారు. రథంపై ఊరేతున్న స్వామి వారి చూసిన భక్తులు, ప్రజలు మైమరచారు. గోవింద నామస్మరణతో స్వామివారిని సేవించుకొని తరించారు. స్వామి వారి రథోత్సవం జరుగుతున్నంత సేపు ప్రజలు భక్తి పారవశ్యంలో వుండిపోయారు. శ్రీవారి రథోత్సవం కన్నుల పండువుగా జరిగింది. రథోత్సవం కార్యక్రమంను తిరుమల ప్రత్యేకంగా వచ్చిన ప్రత్యేక అధికారులు, ప్రధాన అర్చకులు శ్రీనాథ్‌శర్మ దగ్గర వుండి పర్యవేక్షించారు. పోలీసు అధికారులు రథోత్సవం కార్యక్రమానికి అడుగడుగునా పోలీసు సిబ్బందిని ఏర్పాట్లుచేసి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకున్నారు. సిఐ శ్రీనివాసులు పోలీసు బందోబస్తుతో రథోత్సవం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
శీతల పానీయాల పందేరం
శ్రీవారి రథోత్సవం కార్యక్రమం పురష్కరించుకుని పట్టణంలో వేసవి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి పలుచోట్ల శీతల పానీయాలు, మజ్జిగను ఉత్సవాలకు వచ్చిన వారికి పందేరం చేశారు. వాహనాలపై శీతలపానీయాలను తీసుకొని ప్రజలు ఎక్కువగా వున్న చోటికి వెళ్లి పానీయాలను పందేరం చేసి ప్రజలకు ఎండ అలసట తెలియకుండా వుండేలా చూశారు.
ముంపువాసులకు చెక్కుల పంపిణీ
జమ్మలమడుగు, మే 15 : గండికోట ప్రాజెక్టు క్రింద ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు సోమవారం ఉదయం ఆర్డీవో వినాయకం ఆధ్వర్యంలో కొండాపురం తహశీల్దార్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేశారు. అలాగే మండలంలోని నేదరపేట, ముద్దనూరు మండలంలోని కొర్రపాడు గ్రామానికి, గతంలో పంపిణీ చేయగా పెండింగ్‌లో వున్న గండ్లూరు, ఓబన్నపేట, సీతాపురం, గంగాపురం, బుక్కపట్నం, రేపల్లె, చౌటపల్లె, బొమ్మేపల్లె గ్రామాలకు పంపిణీ చేశారు. అలాగే గతంలో పంపిణీచేసిన చెక్కుల్లో పేర్లు పొరపాట్లు వచ్చిన వాటికి సరిదిద్ది పంపిణీ చేశారు. అలాగే గండ్లూరుకు సంబంధించి సప్లమెంటరీ చెక్కులు 23కుగాను 11 చెక్కులు పంపిణీ చేశారు. మిగిలిన 12 చెక్కులు కొన్ని పొరపాట్లు ఉన్నాయనీ వాటిపై విచారించి పంపిణీ చేస్తామన్నారు.
ఆర్డీవోను అడ్డుకున్న ప్రజలు
చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సోమవారం ఉదయం 11గంటలకు వచ్చిన ఆర్డీవో కె.వినాయకం జడ్పీ ఉన్నత పాఠశాలలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చారు. వచ్చిన ఆర్డీవో వినాయకం వాహనానికి ప్రజలు అడ్డుపడ్డారు. పెండింగ్‌లో ఉన్న చెక్కులు మందుగా పంపిణీచేసి మిగిలిన గ్రామాలకు పంపిణీ చేయాలని వాగ్వాదానికి దిగారు. అలాగే 4మాసాల క్రిందట చెక్కులు ఇచ్చారు కానీ వాటిని బ్యాంకుల వద్ద వెళ్తే చెక్కులు మారలేదు. అక్కడ బ్యాంకర్లను అడిగితే ఆర్డీవో చెక్కులను ఆపాలని చెప్పారన్నారు. 8 గ్రామాల ప్రజలము ప్రాజెక్టులోకి నీరు వచ్చిన వెంటనే స్వచ్చందంగా ఖాళీచేసి పునరావాస కేంద్రాలకు వచ్చిన మాకు పూర్తి గా చెక్కులు ఇవ్వకుండా గ్రామా లు ఖాళీ చేయనివారికి ఇస్తున్నారని ఆందోళనకు దిగారు.

ఇంటర్ సప్లిమెంటరీలో సైక్లింగ్!
* పోలీసుల అదుపులో ఓ కళాశాల వ్యక్తి..
* నిబంధనలు తుంగలోతొక్కిన అధికారులు..
రాయచోటి, మే 15: రాయచోటి పట్టణంలో సోమవారం ఇంటర్ సప్లిమెంటరీ ప్రథమ, ద్వితీయ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరానికి సంబంధించి ఏడు పరీక్షా కేంద్రాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సీఎన్ రాజు కళాశాల, పద్మావతి జూనియర్ కళాశాల, వీరభద్ర కళాశాల, అర్చన కళాశాల, ప్రతిభా కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరానికి ఐదు పరీక్షీ కేంద్రాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వాటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సీఎన్ రాజు కళాశాల, ప్రతిభా కళాశాల, అర్చన కళాశాలలు ఉన్నాయి. సోమవారం ఉదయం పరీక్షలు ప్రశాంతమైనప్పటికీ కొద్దిసేపటికే పరీక్షా పేపర్‌కు సంబంధించిన సమాధానాలు బోస్‌నగర్‌లోని అర్చన కళాశాలకు చెందిన సిబ్బందిచేత ఉండటం పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని సమాధాన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యక్తిని విచారించి తదుపరి వివరాలను రేపు వెల్లడిస్తామని ఈ సందర్భంగా సీఐ విలేఖరులకు తెలియజేశారు. ఈ పరీక్షా కేంద్రాలలో ఒక్క కళాశాల నుంచి మరొక కళాశాలకు సమాధాన స్లిప్పులు ఒకరికొకరు తరలించుతున్నట్లు సమాచారం. పరీక్షా కేంద్రాలవద్ద నిబందనలను తుంగలోతొక్కి జిరాక్సు సెంటర్లు యథేచ్ఛగా తెరచుకుని సమాధాన స్లిప్పులు జిరాక్సులు చేస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. దీనినిబట్టి చూస్తే అధికారులు సప్లిమెంటరీ పరీక్షలలో ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చును. ఇకపోతే సెల్ఫు సెంటర్లు రావడంతో కళాశాలల యాజమాన్యం ఒకరికొకరు సైక్లింగ్ పద్ధతులలో సమాధానాలు విద్యార్థులకు చేరవేస్తూ తమ కళాశాల విద్యార్థులందరూ పాసయ్యేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం.
అర్బన్ సిఐ వివరణ: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలలో భాగంగా బోస్‌నగర్‌లోని అర్చన కళాశాలకు చెందిన సిబ్బంది సమాధాన స్లిప్పులను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడికివెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. అతని వద్దనుండి స్లిప్పులు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ముంపువాసుల సమస్యలు పరిష్కరిస్తాం
* పునరావాస కమిషనర్ రేఖారాణి
కొండాపురం, మే 15: ముంపువాసుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పునరావాస కమీషనర్ రేఖారాణి పేర్కొన్నారు. సోమవారం ఉదయం 11గంటలకు గండికోట ప్రాజెక్టు క్రింద ముంపునకు గురైన గ్రామాలకు కొండాపురంలోని రైల్వేట్రాక్ అవతల ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంను పరిశీలించారు. అక్కడ కాలనీలో ఉంటున్న ప్రజలద్వారా సమస్యలపై ఆరా తీశారు. స్థానిక ప్రజలు అక్కడి సమస్యలను కమిషనర్‌కు వివరించారు. పునరావాస కేంద్రంలో త్రాగునీటి సమస్య తీవ్రంగావుందని తెలిపారు. అలాగే నీళ్లులేక కొన్ని ఇంటి నిర్మాణాలు చేసుకోలేకపోతున్నామని, ఇళ్లు కట్టడానికి ట్యాంకరుకు వెయ్యి రూపాయలతో కొంటున్నామని వాపోయారు. అంతేగాక ఒకపక్క నీటిసమస్య, మరోవైపు నాలుగు నెలలుగా ఇచ్చిన చెక్కులు మారక సొమ్ములేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్ ముందు కన్నీటిపర్యంతం అయ్యారు. కాలనీకి సంబంధించి కనీసం శ్మశానవాటిక కూడా లేదన్నారు. ఒక కీలక రెవెన్యూ అధికారి చుక్కల భూమిని ఆక్రమించుకుని వున్నారనీ, ఆభూమిని పునరావాస కేంద్రానికి శ్మశాన వాటికకు కేటాయించాలని పునరావాస కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై ఎన్నిమార్లు ఆర్డీవో కార్యాలయానికి తిరిగినా కనీసం ఆరుమాసాలుగా ఎటువంటి పరిష్కార చర్యలులేవని పునరావాస బాధితులు కమిషనర్‌కు వివరించారు. సమస్యలనువిన్న కమిషనర్ రేఖారాణి మాట్లాడుతూ వెంటనే పునరావాస కాలనీలోవున్న వారికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేయాలన్నారు. చెక్కుల విషయంపై విచారించి వీలైనంత త్వరగా వారంలోగా సమస్యను పరిష్కరించాలని ఆర్డీవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినాయకం, స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
విద్యార్థులకు సులభతరమైన విద్యను బోధించాలి
రామాపురం, మే 15: విద్యార్థులకు సులభతరమైన విద్యను బోధించాలని ఎంఈవో రామకృష్ణుడు అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మార్సీలో తెలుగు, గణితం, ఇంగ్లీషు సబ్జెక్టులపై ఉపాధ్యాయులకు వృత్యాంతర ఐదు రోజుల శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠ్యాంశాలకు విద్యార్థులకు సరైన సులభతరమైన బోధనలు చేయడంకోసం ప్రభుత్వం ప్రతి యేడాది సబ్జెక్టులలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.