కడప

పంట కుంటలు తవ్వారు.. రాతి కట్టడాలు మరిచారు.!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 16: వర్షం నీటిని పొదుపుచేసి భూగర్భజలాలు పెంపొందించేందుకు వ్యవసాయ భూములతోపాటు పొలాల పరిసరాల్లో ఖాళీ స్థలాల్లో పంట కుంటలు తవ్వడానికి మూడేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బృహత్తర కార్యక్రమం రూపొందించింది. అయితే పంట కుంటలు తవ్వడం తప్ప పెద్ద పెద్ద పంట సంజీవిని కుంటలకు రాతికట్టడాలు మరవడంతో కుంటలన్నీ పూడిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద క్షేత్రస్థాయి సిబ్బంది కీలక పాత్ర వహించాల్సివుండగా కొంతమంది సిబ్బందిపై రాజకీయ వత్తిళ్లు, మరికొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడటం వెరసి పంట కుంటలు పూడిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఏడాది రూ.587కోట్లు పైబడి అంచనాలు రూపొందించి 52వేల కుంటలు తవ్వాల్సివుంది. అయితే 41వేల కుంటలు తవ్వి రూ.456 కోట్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అయితే పట్టుమని 30వేల కుంటలు తవ్వకాలు జరిపి దాదాపు రూ.30కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో పలువురు రైతులు ఉపాధికూలీల ద్వారా తమ పంటపొలాల సమీపంలో తూ.తూ మంత్రంగా కుంటలు తవ్వడం, 10మీటర్ల వెడల్పు, 10మీటర్ల పొడవు, 2మీటర్లలోతు, సంబంధిత కుంటలకు రూ.లక్షా 15వేలు ఖర్చు చేశారు. కొన్ని కుంటలకైతే రూ.2.50లక్షల నుంచి రూ.3లక్షలు ఖర్చు చేశారు. అయితే అనంతరం కుంటకు చుట్టు పూడిపోకుండా రాతికట్టడం కట్టాల్సివుంది. ఒక క్యూబిక్‌మీటర్ రాతి రాయిని రవాణా చేసేందుకు రూ.369లు చొప్పున రాతికి కూడా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. చాలా మంది రైతులు తమ పొలాల్లో పంట కుంటలు తవ్వుకుని రాతికట్టడాలు కట్టించుకోకనే ఉపాధిహామీ కింద బిల్లులుచేసుకునేవరకు గుట్టుచప్పుడు కాకుండా ఉండి బిల్లులు తీసుకున్న వెంటనే రాతి కట్టడం మరచారు. మరికొంతమంది రైతులు బిల్లులు తీసుకున్న అనంతరం కుంటలను పూడ్చి వేసినట్లు కూడా తెలుస్తోంది. ప్రభుత్వం కుంటల నిర్మాణాలకోసం విస్తృతంగా ప్రచారం చేస్తూ కోట్లాదిరూపాయలు ఖర్చుచేస్తున్నా ఈ కుంటల నిర్మాణాలు ఆరంభ శూరత్వం తప్ప పెద్దగా రైతులు శ్రద్ధ చూపకపోవడం, ఉపాధిహామీ సిబ్బంది పర్యవేక్షణ లోపం అధికారులు కూడా కుంటలు పూర్తిచేసినట్లు చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎన్ని కుంటలు పూర్తి చేశారు. ఎన్ని కుంటలకు రాతి కట్డడాలు నిర్మించారు , ఎన్నికుంటల్లో నీరు నిలిచింది అని గమనించకుండానే నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారపార్టీ నేతలు కుంటల ప్రారంభంలో అట్టహాసంగా ఫోటోలకు ఫోజులిచ్చి ఫోటోలు తీసుకోవడం తప్ప ఏమాత్రం పంట కుంటలు పూర్తిచేశారన్నది పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గత ఏడాది నిర్మించిన పంట సంజీవిని కుంటలపై సమగ్రవిచారణ చేసి రాతికట్టడాలు నిర్మించని కుంటలకు రాతికట్టడాలు నిర్మించేందుకు, పూడిపోయిన గుంతలకు పూడికలు తీయించి భూగర్భజలాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన వుంది.

దొంగతనాలు అరికట్టేందుకు చర్యలు

కడప,సెప్టెంబర్ 16: జిల్లాలో దొంగతనాలు పెరుగుతున్నాయని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దొంగతనాలు పూర్తిస్థాయిలో అరికట్టి పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ అట్టాడ బాబూజీ పోలీసులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసుకార్యాలయంలో జరిగిన క్రైమ్ సమావేశంలో వాడివేడిగా పోలీసు అధికారులకు హెచ్చరికలతో సమావేశం కొనసాగింది. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లు, జూదాలు, కోడిపందేలు అరికట్టాలని, హోంగార్డు మొదలుకుని అధికారి వరకు అంకితభావంతో పనిచేస్తే తప్ప నేరాలు అదుపులోకి రావని అవినీతి అక్రమాలకు ఎవరు పాల్పడ్డా ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తేలేదని ఎస్పీ హెచ్చరించారు. శాఖాపరంగా ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామని, అధికారులు, సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటామన్నారు. శాఖాపరంగా నిర్లక్ష్య దోరణిలో ఎవరు ప్రవర్తించినా ఎంతటివారినైనా వదిలే ప్రసక్తేలేదని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. మొక్కుబడిగా సమావేశానికి హాజరుకావడం కాదని శాంతి భద్రతలు ఎంతవరకు పరిరక్షిస్తున్నామో ప్రతి ఒక్కరు పునరావృతం చేసుకోవాలని, ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా ఎర్రచందనం రవాణా, ఇసుక మాఫియాలపై నిఘా వుంచాలని, ఏ సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఆ ప్రాంత పోలీసులు బాధ్యత వహించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదుదారుడి సమస్య పరిష్కరించకుండా సంబంధిత వారు తనవద్దకు వస్తే సంబంధిత అధికారులపైనే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్సీ,ఎస్టీ కేసుల విషయంలో ప్రతి అధికారి నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసులురెడ్డి, పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు, డిఎస్పీలు ,సిఐలు పాల్గొన్నారు.

కెసి కెనాల్ రైతుల్లో చిగురిస్తున్న ఆశలు..

చాపాడు,సెప్టెంబర్ 16: జిల్లాలోని కర్నూలు-కడప ప్రధాన ఆయకట్టురైతుల్లో సాగునీటి విషయంపై ఆశలు చిగురిస్తున్నాయి. కర్నూలు జిల్లా పై తట్టుప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 2లక్షల 10వేల 630 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఔట్ ఫ్లో కేవలం 2950 క్యూసెక్కులు మాత్రమే నీరు విడుదలౌతోంది. ఇప్పటికే కర్నాటకలోని ఆల్‌మట్టి జలాశయం పూర్తిస్థాయిలో నిండి అక్కడ నుంచి 45వేల క్యూసెక్కులు నీరు విడుదలౌతోంది. నారాయణపూర్ జలాశయం కూడా 67827 క్యూసెక్కుల నీటి ప్రవాహం కిందకి వస్తోంది. తెలంగాణలోని జూరాలా ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండి అక్కడ నుంచి 61849 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. తుంగభద్ర జలాశయం దిగువభాగంలో కురిసిన వర్షాలవల్ల సుంకేసుల బ్యారేజికి లక్షా 20వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా అక్కడి నుంచి 15గేట్లు విడుదల చేసి లక్షా 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈమధ్యకాలంలో నీటి ప్రవాహాలు అంతంతమాత్రంగా ఉన్నా ప్రస్తుతం వర్షాలు అనుకూలించడం వల్ల జలాశాయాల్లోకి నీరు భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 215.81 టిఎంసిలు కాగా ఇప్పటి వరకు 60.16 టిఎంసిల నీరు చేరినట్లు అధికారుల గణాంకాలు వివరిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న వరద మరో వారం రోజులు ఇదే విధంగా కొనసాగితే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండే సూచనలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. అక్కడికి చేరుకున్న నీటి ప్రవాహాల వల్ల కెసి కెనాల్ , తెలుగుగంగ తదితరప్రాజెక్టులకు నీరు విడుదలయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలంలో తక్కువ నీటి సామర్థ్యం ఉన్నా నీటిని తీసుకునేందుకు 809 అడుగుల సామర్థ్యం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తోడుకునే అవకాశం ఉంది. రెండురోజుల్లో శ్రీశైలం జలాశయంలో 854 అడుగులకు నీటి మట్టం చేరి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువకు నీరు అందే సూచనలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం కెసి కెనాల్ ఆయకట్టు పరిధిలో క్రాఫ్ హాల్‌డే ఎదురౌతుందని భావిస్తూ వచ్చిన అథికారులు, రైతుల్లో వస్తున్న నీటి ప్రవాహాల వల్ల ఆశలు చిగురిస్తున్నాయి. సెప్టెంబర్‌నెల మూడవ వారంలో అధికారింగా నీరు విడుదల అయినట్లయితే స్వల్పకాలిక పంటలనైనా సాగుచేసుకుని ఒకకారు పంటతో గట్టెక్కే సూచనలు ఉన్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కర్నూలులో జరగాల్సిన డిడిఆర్‌సి సమావేశం వాయిదా పడుతూ వస్తున్న మాట తెలిసిందే. నీటి ప్రవాహాలు ఎక్కువై జలాశయాల్లోకి చేరుతున్న నీటిని బట్టి త్వరలో అధికారుల సమావేశం ఏర్పాటైనీటి విడుదలపై స్పష్టత ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఇటీవల జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, ఈప్రాంత ప్రజాప్రతినిధులు కలిసి ఆరుతడి పంటలకు నీరు అందించే సూచనలు ఉన్నాయని సూచనప్రాయంగా తెలియజేసినప్పటికీ ప్రస్తుతం వస్తున్న నీరు వల్ల వరిపంటకు కూడా నీరు అందే సూచనలు ఉన్నాయని ఆలోచనలో రైతులు ఉన్నారు. ఏది ఏమైనా వర్షాలు ఆలస్యంగా కురుస్తుండటం వల్ల జలాశయాల్లోకి నీరు చేరుతోంది. త్వరలో నీటి విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.