కడప

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పాపాగ్ని, మాండవ్య నదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 12: జిల్లాకు జీవనదులుగా పేరున్న కుందూ, పెన్నా నదులతోపాటు పాపాగ్ని, మాండవ్య, బహుద నదులు జీవనదులే. అయితే దాదాపు దశాబ్దకాలం తర్వాత బావురుమంటున్న ఆ నదులు నదీ పరివాహక ప్రాంతాలు భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇక వాగులు, వంకలలో ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించడంతోపాటు రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా 1112.8మి.మీ వర్షం కురిసింది. కడప రెవెన్యు డివిజన్‌లో కమలాపురంలో 90మి.మీ., రాజంపేట రెవిన్యు డివిజన్‌లో ఒంటిమిట్టలో 22.4మి.మీ, జమ్మలమడుడు రెవెన్యు డివిజన్‌లో రాజుపాలెంలో 96.6 మి.మీ.వర్షపాతం కురిసింది. వేంపల్లె, రాజుపాలెం, పెద్దముడియం, కొండాపురం, కమలాపురం, సుండుపల్లి తదితర మండలాల్లో లోలెవల్ కాజ్‌వేలు, ఓవర్ బ్రిడ్జిలు సైతం వరదనీటితో మునకకు గురై సంబంధిత ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. ఇక ఆదినిమ్మాయపల్లె డ్యామ్, పెన్నా, కుందు నదులు వేగవంతంగా పారుతున్నాయి. కర్నూలు జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి భారీ వర్షానికి పోతిరెడ్డిపాడు, కర్నూలు జిల్లాలోని సుంకేసుల నుంచి నీరు వదలడంతో రీటి ప్రవాహం అధికంగా పెరగడం ప్రమా దం అంచుల్లో ఉన్న కుందు, పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉన్న నీరు కుంటల్లో చెరువుల్లో చేరడంతోపాటు జనవాసాల ప్రాంతాల్లోకి చేరే అవకాశాలుండటంతో సోమశిల ప్రాజెక్టుకు దాదాపు 40వేల క్యూసెక్కుల నీటిని గత రెండురోజులుగా వదులుతున్నారు. గురువారం కూడా 25వేల క్యూసెక్కులనీరు వదిలినట్లు అధికారులు ప్రకటించారు. కమలాపురం ప్రాంతంలో భారీగా వర్షాలు రాకతో అక్కడున్న లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. ఇక గండికోట రిజర్వాయర్‌కు 7టిఎంసిల నీటిని చేర్చినట్లు తెలిసింది. 13 టిఎంసిల నీటిని నిలిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక జిల్లాలోని వెలిగల్లు, బ్రహ్మంసాగర్, మైలవరం, ఝరికోన, కుషావతి,చెయ్యేరు , బుగ్గవంక, పింఛా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నీరు చేరి నిండుకుండలా తయారయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1250 చెరువులు పూర్తిస్థాయిలో నిండిపోయి ప్రమాదపు అంచుల్లో ఉన్నా యి. కొండాపురం, సంబేపల్లి మండలాల్లో చెరువులకు గండ్లుపడ్డాయి. పంట కుంటలు, చెక్‌డ్యామ్‌లు 30వేల వాటిలో పూర్తిస్థాయిలో నీరుచేరి కళకళలాడుతూ పరవళ్లు తొక్కుతున్నాయి. ముఖ్యంగా చెరువులు, కుంటలు, గ్రామసమీపాల్లో నీరంతా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గండికోట ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో 21 గ్రామాల్లోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లినా ఆ ప్రాంత రాకపోకలకు వర్షపునీరురోడ్లపై ప్రవహించి తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. గత పదేళ్ల వరకు బావురు మంటున్న కుంటలు, చెరువులు ఎగువప్రాంతాల్లో దురాక్రమానికి గురై వర్షపునీరు నిలిచేది కాదు. ఈమారు కురిసిన భారీ వర్షాలకు దురాక్రమణలు సైతం వర్షపునీటితో కోసుకునిపోయి నీరంతా కుంటలు, చెరువుల్లోకి చేరింది. వాగులు, వంకలు దురాక్రమానికి గురైన ఎగువ ప్రాంతాల్లోని నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో వాగులు, వంకలు సైతం వేగంగా నీరు పరవళ్లు తొక్కి కొన్ని ప్రాంతాల్లో చెరువుల్లోకి మరికొన్ని ప్రాంతాల్లోకి నీరు వెళుతోంది. మొత్తం మీద ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడం, జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూలేని విధంగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షం కొంతమందికి ఖేధం, మరికొంతమందికి బేధంగా మారిందని చెప్పవచ్చు.

ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం
* విలువైన ఎర్రచందనాన్ని రక్షించుకుందాం * డిప్యుటీ రేంజ్ ఆఫీసర్ వై.రామకృష్ణారావు
చింతకొమ్మదినె్న, అక్టోబర్ 12: ఎంతో విలువైన ఎర్రచందనాన్ని నరికినా, అక్రమంగా తరలించినా జైలు శిక్ష తప్పదని ఎర్రచందనం అక్రమరవాణా నిరోధక టాస్క్ఫోర్స్ డిప్యుటీ రేంజ్ ఆఫీసర్ వై.రామకృష్ణారావు పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమరవాణా స్మగ్లింగ్ టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మాగంటి కాంతారావు, తిరుపతి ఆదేశాలమేరకు గురువారం మండల పరిధిలోని సుగాలిబిడి గ్రామంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈసందర్భంగా వై.రామకృష్ణారావు మాట్లాడుతూ విలువైన ఎర్రచందనం వృక్షాలు ప్రపంచలోకెళ్లా రాయలసీమ జిల్లాలైన కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని శేషాచలం, వెలిగోడు అడవుల్లో మాత్రమే ఉన్నాయన్నారు. కడప జిల్లాలో 70శాతం ఎర్రచందనం వృక్షాలు కలవని ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన వృక్షాలు కొంతమంది స్వార్థపరులు ఎర్రచందనాన్ని అక్రమంగా నరికి అక్రమరవాణా చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారన్నారు. ఈ రవాణాను అరికట్టడంలో భాగంగా ప్రజలను చైతన్యం పరిచేందుకు జిల్లాలోని ప్రతి గ్రామంలో అవగాహన సదస్సుల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. 3ఎర్రచందనం మీకు వందనం2 అనే లఘుచిత్ర ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. 1967 చట్టం ప్రకారం ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తు పట్టుబడితే మొదటి సారి 5సంవత్సరాలు జైలుశిక్షతోపాటు రూ.3లక్షలు జరిమానా విధిస్తుందని, 2వసారి నేరానికి పాల్పడితే 7సంవత్సరాలు జైలు శిక్షతోపాటు రూ.5లక్షలు జరిమానా, 3వసారి అంతకుమించి నేరానికి పాల్పడితే 10సంవత్సరాలు జైలుశిక్షతోపాటు రూ.10లక్షలు జరిమానా విధించడంతోపాటు పిడి యాక్టు కేసు పెడతామన్నారు. ఎర్రచందనం వాహనంతో పట్టుబడితే పిడి యాక్టు నమోదుతోపాటు ప్రాపర్టి జప్తుచేస్తామని, బెయిల్ కూడా రాదని , వాహనం స్వాధీనం చేసుకుని పట్టుబడిన డ్రైవర్ లైసెన్సు రద్దుచేస్తారని, వారి ఆస్తులు జప్తుతోపాటు ప్రభుత్వపరంగా వచ్చే ఏ పథకాలు ఇవ్వరన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇప్పటి వరకు రాయలసీమలో కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 695అటవీగ్రామాల్లో మొబైల్ వాహనం ద్వారా 30వేల కి.మీ. తిరిగి ఎర్రచందనంపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాపై సమాచారం తెలిసినా సమాచారం ఇవ్వాలన్నారు. ఈకార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది శ్రీనివాసరావు, సిహెచ్ రమేష్, పి.సుబ్రమణ్యం, ఎస్.పాపారావు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.