కడప

కాలువల ఆక్రమణలు తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, అక్టోబర్ 16: కాలువల ఆక్రమణలు వెంటనే తొలగించాలని మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి అధికారులను కోరారు. సోమవారం వేకువజామున కురిసిన భారీవర్షం కారణంగా పట్టణంలోని వడ్డెర, వికలాంగుల, ఎస్సీ, ఎస్టీకాలనీలను అధికారులతో కలసి సందర్శించారు. కుండపోత వర్షంతో ఇళ్లల్లోకి నీరు రావడంతో స్థానిక నేతలు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన ఆయన కాలువలపై కట్టడాలు నిర్మించిన యజమానులను పిలిపించి వెంటనే ఆక్రమణలు తొలగించాలని సూచించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ కాలువలను ఆక్రమించడం వల్లే వర్షపునీరు ఇళ్లల్లోకి రావడం జరిగిందని ఇందువల్ల పేదప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యా రని చెప్పారు. పంచాయతీ సర్పంచు సలీమా ఖాదర్ బాషాతో మాట్లాడి కాలువల ఆక్రమణపై అధికారులకు సహకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రామ్మోహన్, ఎంపిడివో నాగరాజు, నేతలు అంకిరెడ్డి, దివాకరరెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం, నరసింహారెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.

జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓపెన్‌హౌస్

సిద్దవటం,అక్టోబర్ 16:పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 11వ ఏపిఎస్‌పి బెటాలియన్ ఆవరణలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు కమాండెంట్ రాజాకిశోర్‌బాబు తెలిపారు. భాకరాపేట, సిద్దవటం, మాధవరం, పార్వతీపురం, జెడ్పి ఉన్నత పాఠశాలలోపాటు హ్యాపికిడ్స్, చైతన్య విద్యార్థులకు పోలీసులు వాడే వెపన్స్ తుపాకులపై అవగాహన కల్పించామన్నారు. తుపాకుల యొక్క వినియోగం వాటి ఉపయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. ప్రతి ఏటా నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా విద్యార్థులతోపాటు పోలీసు సిబ్బంది కూడా వ్యాసరచన, వక్తృత్వపోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు పోలీసులపై ఉన్న అపోహలు తొలగించడంతోపాటు పోలీసు విధులు, విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో వివరించడం వల్ల వారిలో అవగాహన పెంపొందించామన్నారు. కార్యక్రమంలో డిఎస్పీ ఉదయ్‌కుమార్, ఆర్‌ఐ డివి రమణ, ఆర్‌ఎస్‌ఐ నాగయ్య, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ప్రజాసేవలో 11వ బెటాలియన్ పోలీసులు పాల్గొని భాకరాపేటలోని ప్రభుత్వ బాలుర వసతిగృహంలో స్వచ్ఛతాహీసేవా కార్యక్రమం చేపట్టారు. కమాండెంట్ రాజకిశోర్‌బాబు తన సిబ్బందితో కలిసి ప్రభుత్వ వసతి గృహ ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలు స్వచ్ఛందంగా తొలగించారు. కార్యక్రమంలో డిఎస్పీ ఉదయ్‌కుమార్, ఆర్‌ఐ రమణ, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.