కడప

రూ. 142కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 20: అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండటం వల్ల యంత్రాంగం మధ్య సమన్వయం ఏర్పడి పరిపాలన వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కడప నూతన కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లోని సర్వశిక్ష అభియాన్ భవనంలో 3మన ఊరు-మన బడి2 కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ జిల్లాలో రూ.142కోట్లు ఖర్చుతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఒంటిమిట్టలో రామయ్య బ్రహోత్సవాలు జరుపుకోవడం రెండవసారి అని, శ్రీరామచంద్రుడు నడయాడిన నేలగా ఒంటిమిట్టకు ఘన చరిత్ర ఉందన్నారు. సోమశిల బ్యాక్‌వాటర్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు, వివిధ గ్రామాల తాగునీరు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించేందుకు పైపులైన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఒంటిమిట్ట చెరువుకు నీరు అందించడం వల్ల చెరువు దిగువన ఉన్న 3వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. జిల్లాలో గండికోట , గాలేరు-నగరి, చిత్రావతి, పులివెందుల లిఫ్టు ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హంద్రీ నీవా ద్వారా రాబోయే రోజుల్లో కోడూరు, రాయచోటి ప్రాంతాలకు తాగునీరు అందుతుందన్నారు. జిల్లాను అన్ని విధాల అభివృద్ధిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెన్నానదిలో ఒక టిఎంసి నీటి నిల్వ ఉంచేందుకు చెక్ డ్యామ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిద్వారా కడప ప్రజల దాహర్తి తీరుస్తామని తెలిపారు. కడప నగరంలో ఎక్కడ చూసినా రోడ్లకు అడ్డంగా విగ్రహాలు కన్పిస్తున్నాయని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందుకోసం 15 ఎకరాలు స్థలం కూడా కేటాయించామన్నారు. కడప కలెక్టరేట్‌లో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమ ద్వారా గోదావరిజలాలు కృష్ణానదిలో కలపడం ద్వారా 100టిఎంసిల నీటిని శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు మళ్లించుకోవచ్చన్నారు. అనంతరం చంద్రబాబు జన్మదినం సందర్భంగా నాయకులు భారీ కేట్‌ను కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.