కడప

జగన్‌కు పదవి పిచ్చి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి ఆదినారాయణరెడ్డి
బద్వేలు, నవంబర్ 15: ప్రతి పక్షనేత జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి పచ్చి పట్టిందని మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న నేపథ్యంలో మార్గమధ్యంలో బద్వేలులోని ఆర్‌అండ్‌బి బంగళాలో కొద్ది సేపు ఆగారు. ఈ సందర్భంగా మంత్రిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కె.వి. సుబ్బారెడ్డి, తదితర కార్యకర్తలు, జహంగీర్ యువసేన కార్యకర్తలు కలిసి పూలమాలలు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదన్నారు. కేవలం జగన్‌కు పదవి పచ్చి పట్టింది కావునే ఈ విధంగా ప్రజలో పర్యటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపనలు చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇస్తున్న హామీలు అమలు కావాలంటే ప్రపంచ బ్యాంకులో తాను దాచుకున్న సొమ్మును బయటికి తియ్యాలని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నారని, అటు వంటి నేతపై జగన్ విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బద్వేలు మండల అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, మైనార్టీసెల్ జిల్లా నాయకుడు జహంగీర్ బాష, తదితరి పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గోన్నారు.

ఒంటిమిట్టలో అభివృద్ధి పనులు..
ఒంటిమిట్ట, నవంబర్ 15: బ్రహ్మోత్సవాల ఘడియలు సమీపిస్తుండడంతో టిటిడి యంత్రాంగం అభివృద్ధి పనులపై కనే్నసింది. ఇందులో భాగంగా కోదండ రామయ్యకు అద్భుతమైన రీతిలో నూతన పుష్కరణి ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. సుమారు రూ. 24 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. అదే విధంగా ఆలయ దక్షణ భాగంలో కూడా కాంపౌండ్ వాల్ పనులు రూ. 18 లక్షల వ్యయంతో ప్రారంభమయ్యాయి. ఈ పనుల కోసం కేంద్ర పురావస్తు శాఖ అనుమతి తీసుకుని ఆలయ వంద మీటర్ల పైభాగంలో పనులు చేపట్టారు. ఈ పనులే కాకుండా కల్యాణ మంటపం ప్రాంగణంలో కూడా సుమారు అర కోటి వ్యయంతో రక్షణ గోడ పనులు ప్రారంభమయ్యాయి. ఇవే కాకుండా దక్షణ భాగంలోని ఖాళీ స్థలంలో పోతన థీమ్ పార్కు, టిటిడి అధికార కార్యాలయం, వాహనాల పార్కింగ్ స్థలం, ప్రసాద కౌంటర్, శాశ్వత అలంకార మంటపం, అన్నదాన సత్రం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పనుల నిర్మాణాలకు మరో రెండు రోజుల్లో టిటిడి ఇంజనీరింగ్ విభాగం వారు కొలతలు వేయనున్నారు. వీటిన్నింటిని బ్రహ్మోత్సవాలకు నెల ముందు ఫిబ్రవరి నెలలోనే పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ విభాగం కసరత్తు చేస్తుంది. ఆన్‌లైన్‌లో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి ఈ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకొంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం గుర్తించిన మొదటి సంవత్సరమే సుమారు రూ. 12 కోట్లతో కొంత మాడ వీధులు, కల్యాణ వేదిక, రూ. 5 కోట్లతో భక్తులకు వసతి సదుపాయాలు పూర్తి చేసింది. అలాగే సుమారు వంద కోట్ల రూపాయాలకు ఒంటిమిట్ట రామాలయానికి టిటిడి కేటాయించిన విషయం విదితమే. దశల వారిగా రానున్న రోజుల్లో వంద కోట్ల రూపాయల పనులు పూర్తి చేసేలా సూపర్ మాస్టర్ ప్లాన్‌ను టిటిడి రూపొందించింది. అయితే ఇపుడు చేపట్టిన పనులతో పాటు మరి కొన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు టిటిడి సిద్ధం అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పుష్కరణిలో వచ్చే బ్రహ్మోత్సవంలో తెప్పోత్సవం నిర్వహించే విధంగా చర్యలు తీసుకునేలా టిటిడి యంత్రాంగం అడుగులేస్తుంది. అంతే కాకుండా వచ్చే ఉత్సవాలను విజయవంతం చేయడంతో పాటు భక్తులు, ప్రజలు మెచ్చుకునేలా అభివృద్ధి పనులు చేపట్టే విధంగా టిటిడి చేస్తుంది. మిగిలిన మాడ వీధుల పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటుంది. అలాగే పూరె్తైన అదనపు గదులను వచ్చే ఉత్సవాలకు రాబోతున్న సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించే విధంగా టిటిడి అడుగులేస్తుంది. ఈ పనులను మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసేందుకు ఒక అధికారిని నియమించేలా యంత్రాంగం సిద్ధం అవుతుంది. ఏదీ ఏమైనా ప్రస్తుతం కేటాయించిన రూ. 15 కోట్ల పనులకు కదలిక వచ్చింది. మరి నిర్ణయించిన సమయానికి పనులు పూర్తి చేస్తారని ఆశిద్ధాం.

ముంపువాసులకు
నష్టపరిహారం ఇస్తాం
కడప,(కల్చరల్)నవంబర్ 15: గండికోట ముంపువాసులకు 14గ్రామాలకు సంబంధించిన ప్రజలకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని రాష్టమ్రార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మీకోసం హాల్‌లో ముంపువాసులకోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ తు.చ తప్పకుండా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాకలెక్టర్ బాబూరావునాయుడు మాట్లాడుతూ అర్హులైనవారు సరైన పత్రాలు సమర్పించి నష్టపరిహారాన్ని పొందాలన్నారు. అలాగే 15 నుంచి 17 వరకు లబ్దిదారుల నుంచి వినతులు స్వీకరిస్తామని , గతంలో కూడా ఈవిషయాన్ని పత్రికా రూపంలో తెలియజేశామన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గండికోటకు 12 టిఎంసిల నుంచి 18 టిఎంసిల నీరు నిల్వచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈకార్యక్రమంలో ప్రత్యేక కలెక్టర్ నాగేశ్వరరావు, ప్రత్యేక డిప్యుటీ కలెక్టర్ శ్రీనివాసులు, జెసి శే్వతతెవతియ, డిఆర్వో బాబయ్య, జమ్మలమడుడు ఆర్డీవో, తహశీల్దార్లు పాల్గొన్నారు.
పాఠశాలకు తాళం!
సంబేపల్లె, నవంబర్ 15: ఆ పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు అయితే ఒక ఉపాధ్యాయుడు దీర్ఘకాలిక సెలవులో ఉండగా మరొక ఉపాధ్యాయుడు 3 రోజులు సెలవుపెట్టాడు. దీంతో ఆ పాఠశాలకు తాళం వేశారు. దాదాపు 40 మంది విద్యార్థుల గల ఈ పాఠశాల మండల పరిధిలో శెట్టిపల్లె గ్రామం వల్లబండపల్లెలో కలదు. గ్రామీణ ప్రాంతమైన వల్లబండ్లపల్లెలో అన్ని సదుపాయాలతో ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువును అభ్యసిస్తున్నారు. ఇది వరకే ఒక ఉపాధ్యాయుడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మరొక ఉపాధ్యాయుడు 3 రోజులు సెలవు పెట్టాడు. దీంతో పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఆటలు ఆడుకుంటూ గడుపుతున్నారు. ఈ తంతు రెండు రోజులుగా సాగుతోంది. విద్యాధికారులు పాఠశాలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా పాఠశాల నిర్వహణను గాలికొదిలేశారు. సీఆర్‌పీ ఒక రోజు మాత్రమే పాఠశాలను నిర్వహించి వెళ్లాడని స్థానికులు తెలిపారు. అసలే ప్రభుత్వ పాఠశాల మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్న ఈ పరిస్థితుల్లో పాఠశాల నిర్వహణ మండల విద్యాశాఖాధికారులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మండల విద్యాశాఖాధికారిణి ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోనికి రాలేదు. ఏది ఏమైనా ప్రాధమిక విద్యపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని పలువురు అంటున్నారు.

క్రీడలతో శారీరక ధారుడ్యం

రాయచోటి, నవంబర్ 15: విద్యార్థుల శారీరక ధారుడ్యానికి క్రీడలు తోడ్పడతాయని కడప జిల్లా విద్యాశాఖాధికారిణి శైలజ అన్నారు. బుధవారం మధ్యాహ్నం రాయచోటి మండలం గొర్లముదివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న జోనల్ క్రీడలను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ఆమె మాట్లాడుతూ క్రీడల్లో ముందున్న వారే చదువులో కూడా ముందుంటారన్నారు. మానసిక వికాసానికి, ఒత్తిడిని తట్టుకోవడానికి క్రీడలెంతో అవసరమన్నారు. చిన్ననాటి నుండే విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకొని రాష్ట్ర స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఎదగాలన్నారు. క్రీడలలో జయాపజయాలు సహజమని ఓటమి కూడా గెలుపుకు పునాది వంటిదని విద్యార్థులు గ్రహించాలన్నారు. రాయచోటి డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల విద్యార్థులు వెయ్యి మందికి పైగా పాల్గొనడం ప్రశంసనీయమని, అప్‌గ్రెడేషన్‌కు సంబంధించి 30 శాతం పదోన్నతులు వెంటనే కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ క్రీడలు నిర్వాహకులు నరసరాజు, 9 మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు, మాసపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మడితాటి నరసింహారెడ్డి, లగిశెట్టివారిపల్లె ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రావు, డైట్ అధ్యాపకులు ఫణీంద్ర, పీఆర్‌టీయూ నాయకులు యువరాజనాయుడు, గొర్లముదివీడు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి

రాయచోటి, నవంబర్ 15: వైఎస్‌ఆర్ హయాంలోను, తెలుగుదేశం ప్రభుత్వపు నాలుగేళ్ల పాలనలోని విద్యుత్ కనెక్షన్లపై శే్వతపత్రం విడుదల చేయాలని రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యుత్తమ, సమర్థవంతమైన పాలన చేస్తున్నట్లు ఆర్బాటంగా పత్రికా ప్రకటనలుగా ప్రకటించుకుంటున్నారే కానీ, నిజంగా ప్రజలకు ఉపయోగపడే పనులను, పాలనను చేయడం లేదన్నారు. ప్రభుత్వం అంటే ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పారదర్శకంగా పరిపాలించాలన్నారు. ఆ రకంగా జరగడం లేదని స్పష్టమవుతోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.1,200 కోట్ల పాత విద్యుత్ బకాయిలను మాఫీ చేయడం జరిగిందన్నారు. రాయచోటి ప్రాంతంలోని రెస్కోను రద్దు చేసి అడిగిన ప్రతి రైతుకూ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వైఎస్‌ఆర్ పాలనకు ముందు ఒక ట్రాన్స్‌ఫార్మర్ కోసం గొడవలు జరిగిన విషయాలు తెలిసినవేనన్నారు. రైతుల పక్షపాతి అయిన వైఎస్‌ఆర్ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగిందన్నారు. టీడీపీ పాలనలో సంవత్సరం నుంచి నూతన విద్యుత్ కనెక్షన్లను ఇవ్వకుండా రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్యుత్ శాఖాధికారుల కార్యాలయాల చుట్టూ రైతన్నలు కాళ్లరిగేలా తిరుగుతున్న పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. సంవత్సరం నుంచి నూతన కనెక్షన్లను పెండింగ్‌లో పెట్టుకోవడమే కాక, కొత్త కనెక్షన్లు ఇవ్వకూడదని అధికారికంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. నూతన విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు అప్పులు చేసి డబ్బులు చెల్లించినా, కనెక్షన్లు ఇవ్వొద్దని పై నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ అధికారులు తప్పించుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు మేలు చేయకుండా రైతు వ్యతిరేకిగా మారిందన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి నూతన విద్యుత్ కనెక్షన్లను ఇవ్వకపోతే ప్రభుత్వ పనితీరుకు నిరసనగా విద్యుత్ సబ్‌స్టేషన్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. రుణమాఫీ, పంటలబీమాలను ఈ రోజుటికీ జమ చేయలేదన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో లెక్కలు తేలలేదని పెండింగ్‌లో పెట్టారని, వీటనన్నింటినీ త్వరగా పరిష్కరించి త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బతుకు భరోసా చంద్రన్న బీమా పథకం
* చైర్‌పర్సన్ టి.తులసి
జమ్మలమడుగు, నవంబర్ 15: బతుకు భరోసాగా చంద్రన్న బీమా పథకమని మున్సిపల్ చైర్‌పర్సన్ టి.తులసి తెలిపారు. స్థానిక మెప్మా కార్యాలయంలో బుధవారం చంద్రన్న బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ తులసి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశ్యంతో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రన్న భీమా పథకంను ప్రవేశపెట్టిందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పథకంలో చేరిన 13961మందికి బాండ్లు వచ్చాయన్నారు. ప్రమాదవశాత్తూ అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాల వల్ల ఇంటి వ్యక్తులను కోల్పోయిన వారికి పథకం ఆసరా అవుతుందన్నారు. పథకంలో చేరని వారుంటే రూ.15లు ప్రీమియం చెల్లించి చేరాలన్నారు. మున్సిపాలిటీని ఒడియఫ్ కింద ప్రకటించడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవాలన్నారు. అలాగే ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఇంటి చెత్తను బయట వేయకుండా, మున్సిపాలిటీ వాహనాలు వచ్చినప్పుడు అందులో వేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మరుగుదొడ్లు, ఇళ్లు కావలసిన వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ తులసి తెలిపారు. అనంతరం మెప్మా పిడి రామమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. మహిళలు చైతన్యవంతం అయితే ఆ కుటుంబం, ఆ సమాజం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. చివరగా చంద్రన్న బీమా బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మిరాజ్యం, మెప్మా సిబ్బంది, సంఘాల మహిళలు పాల్గొన్నారు.

ట్రాఫిక్ నియంత్రణకు స్పెషల్ డ్రైవ్

రాజంపేట, నవంబర్ 15: రాజంపేట పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని వాహనాల రాకపోకలతో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని ఆర్డీఓ వీరబ్రహ్మం అన్నారు. బుధవారం తన కార్యాలయం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన డిఎస్‌పి బి.లక్ష్మీనారాయణతో పాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాజంపేట ఆర్టీసీ బస్టాండు నుండి పాత బస్టాండు వరకు ట్రాఫిక్ సమస్యలు అధికమయ్యాయని, ఆ దారిలో ఆటోలు, బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆపడం వల్ల సమస్యలు అధికమవుతున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోడ్డులో రెండు లేక మూడు బస్ స్టాప్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పలు ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారులు రోడ్డు పైనే తోపుడు బండ్లను అడ్డంగా ఉంచడం జరుగుతున్నదని, వాణిజ్య దుకాణాల్లో వాహనాలను ఆపి ఉంచడం జరుగుతుందని, సదరు కారణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు రెట్టింపు అవుతున్నాయన్నారు. ఇందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలను నియంత్రించాలన్నారు. అలాగే వాహనాలు పరిమితికి మించి లోడ్‌తో వెళితే చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రజల్లో కూడా మార్పు రావాలని ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలుపరాదన్నారు. వాహనాల పార్కింగ్ కొరకు ఒక స్థలాన్ని గుర్తించి ఆ ప్రాంతంలోనే వాహనాల పార్కింగ్‌కు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. డిఎస్పీ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజంపేట పట్టణ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డుపై వాహనాలను నిలపకుండా రోడ్డులో ఒక లైన్‌మార్కు వేసి ఆ లైన్ పరిధిలోనే వాహనాలను నిలిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజంపేట పట్టణ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు తమ సలహాలను, సూచనలను తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, ఆర్ అండ్ బి డిఇ రాజ్‌కుమార్, ఆర్టీసీ డిఎం క్రిష్ణారెడ్డి, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ అమలు

కమలాపురం, నవంబర్ 15: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, పిహెచ్‌సిల్లో బుధవారం నుంచి బయోమెట్రిక్ అమలు పరుస్తున్నట్లు డిప్యూటీ డియం హెచ్‌వో మోక్షేశ్వరుడు తెలిపారు. ఆయన బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో స్థానిక వైద్యుడు మినహా మిగిలిన డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైద్యుడు సుధాకర్‌ను క్వార్టర్సు నుంచి పిలిపించి ఆసుపత్రి నిర్వహణపై మండిపడ్డారు. డ్యూటిలో లేని వైద్యులకు ఫోన్ చేసినప్పటికి లిఫ్ట్ చేయక పోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ విధానం అమలుకు బుధవారం చివరిరోజు అయినప్పటికి ఆసుపత్రిలో అమలు చేయక పోవడం పట్ల వైద్యుడిని నిలదీశారు. అలాగే ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో లెప్రసి, టిబి, హెచ్‌ఐవి, తదితర కేంద్రాల్లో కూడా బుధవారం నుంచి బయోమెట్రిక్ అమలయిందన్నారు. 75 పిహెచ్‌సిలకు గాను చెన్నూరు, కోడూరు మినహా మిగిలిన చోట్ల ఈ విధానం అమలులోకి వచ్చిందన్నారు. అలాగే సియస్‌సిల్లో కూడా అమలు చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయోమెట్రిక్ విధానంతోనే ఉద్యోగులకు జీతాలు అమలవుతాయన్నారు. ఆసుపత్రులలో తప్పనిసరిగా ఉదయం 9నుంచి 4గంటలవరకు వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని, 24గంటలూ ఒక వైద్యుడు డ్యూటీ నిర్వహించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేసేవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిహెచ్‌సిల్లో 40%మాత్రమే కాన్పులు జరుగుతున్నాయని మిగిలిన 60% ప్రైవేటు ఆసుపత్రులలో జరుగుతుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పిహెచ్ సి ఆరోగ్యకార్యకర్తలు ప్రజలను చైతన్యపరచక పోవడమే ఇందుకు కారణమని అన్నారు. త్వరలోనే ఈ విషయంపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో మొదటి కాన్పు అయ్యే మహిళలకు ప్రధానమంత్రి మాతృవందనం పధకం ద్వారా రు.6 వేల రూపాయలు అందచేస్తున్నట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.