కడప

పర్యాటక నిర్మాణాలు... ప్రైవేటు పరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, డిసెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ పరిధిలోని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీడీసీ) ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన పర్యాటక నిర్మాణాలు ఇకపై ప్రైవేటుపరం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన పలు నిర్మాణాలు టిడిసి పరిధిలో నిర్వహణ కష్టతర సాధ్యం కావడంతో ప్రైవేటు వ్యక్తులకు లీజుల క్రింద ఇచ్చేందుకు టెండర్లకు పిలిచారు.
జిల్లా వ్యాప్తంగా పురాతన, దర్శనీయ, పర్యాటక ప్రదేశాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆకర్షనీయంగా ఉన్నాయి. వీటిని పర్యాటకులకు మరింత చేరువ చేసే దిశగా, ప్రభుత్వానికి పర్యాటకరంగ ఆదాయాన్ని సమకూర్చేందుకు ఆయా చోట్ల కోట్లాది రూపాయలు ప్రభుత్వ నిధులు వెచ్చించి నిర్మాణాలు చేశారు. వీటి ద్వారా పర్యాటకులకు వౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఆదాయ మార్గాలు సమకూరుతాయని భావించారు. అయితే పర్యాటక శాఖ పరిధిలో సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపాలతో నిర్మాణాలు ఆశయసిద్దికి నోచుకోలేదు. దీంతో గత కొనే్నళ్లుగా కొన్నింటిని పర్యాటక శాఖ నిర్వహణ కొనసాగించాయి. మరికొన్ని ప్రారంభాలకే నోచుకోకుండా పోయాయి. ఈ క్రమంలో ఉన్నతాధికారులు పర్యాటక రంగం అభివృద్దిపై ప్రత్యేక దృషి సారించడంతో జిల్లా టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రైవేటుకు లీజులకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది.
జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రమైన మైలవరం జలాశయం వద్ద నిర్మించిన టూరిజం రెస్టారెంట్, బోటింగ్, శ్రీ అగస్తేశ్వర కోన వద్ద నిర్మించిన టిక్‌టాక్ భవనం, పార్లపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఉన్న నిర్మాణం, ఆదినిమ్మాయపల్లెలోని టూరిజం భవనం, సిద్దవటం, గోపవరం, నందలూరు సౌమ్యనాథస్వామి ఆలయం వద్ద టూరిజం నిర్మాణాలు, బౌద్దస్థూపాల వద్ద టూరిజం భవనాలు, అత్తిరాల, లక్కిరెడ్డిపల్లెలోని
గంగమ్మ దేవాలయం వద్ద ఉన్న ఫంక్షన్ హాలు, దేవుని కడపలోని టూరిజం కేంద్రం, బోటింగ్‌లను నిర్వహణకు టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇచ్చేందుకు టెండర్లకు ఆహ్వానించారు. దీంతో త్వరలో జిల్లాలోని పలు ప్రధాన టూరిజం కేంద్రాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడవనున్నాయి. ఈ ప్రక్రియ వల్ల పర్యాటకులకు టూరిజం సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చినట్లువుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.

నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించాలి

ఖాజీపేట, డిసెంబర్ 11: ప్రజల నుండి అందే సమస్యలను ఆన్‌లైన్ ద్వారా సత్వరం పరిష్కరించని అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ బాబురావునాయుడు పేర్కొన్నారు. మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరణ కార్యక్రమం జరిగింది. వినతుల అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్దిష్ట సమయంలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రియల్ టైం గవర్నన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తోందన్నారు. తద్వారా ప్రతి అధికారికి బాధ్యత ఉంటుందని నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించని అధికారులు అందుకు బాధ్యతలు వహించాల్సి ఉంటుందన్నారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందన్నారు. ఈ నెల 20వ తేదీలోపు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఉండే అవకాశాలు ఉన్నాయని, ఆలోగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కూడా అధికారులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటి నుండే ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలు, ఫలితాలపై దృష్టి పెట్టి వంద శాతం ప్రగతి సాధించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. అనంతరం ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా కొండాపురం మండలం బుక్కపట్నం గ్రామం ప్రాథమిక పాఠశాల మంజూరు కొరకు పెద్దిరాజుయాదవ్ అర్జీని, ప్రొద్దుటూరు మండలం ప్రొద్దుటూరు నివాసి ఎం. క్రిష్ణకిశోర్ దివ్యాంగుల పింఛన్ కొరకు అభ్యర్థన, వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లె రైతు ఈశ్వరరెడ్డి వేరుశెనగ పంట నష్టపరిహారం కొరకు దరఖాస్తు రాజంపేట మండలం చెనె్నల్లుగారిపల్లె రవిశంకర్ సర్వే నెంబర్ 1194లో 1191-2లో పొలానికి విద్యుత్ కనెక్షన్ కొరకు పోరుమామిళ్ల మండలం కొత్త కుమ్మరివీధి నివాసి క్రిష్ణయ్య వృద్ధాప్య పింఛన్ కొరకు, ఒంటిమిట్ట మండలం శ్రీరాంనగర్‌కు చెందిన 18 కుటుంబాల వారు చేపలు పట్టుటకు లైసెన్సు ఇప్పించాలని అర్జీలను కేసుల వారీగా పరిశీలించి వీటిని పరిష్కరించాలని ఆయా శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శే్వతతెవతీయ, ఇన్‌ఛార్జి డీఆర్‌వో, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.