కడప

రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,డిసెంబర్ 16: మండలంలోని రైతాంగానికి జిప్సం, జింక్‌లను ఉచితంగా ఇస్తుండటంతో రైతులు దొరకవేమోనని ఎగబడుతున్నారు. మండలానికి 145 టన్నుల జిప్సం, 10టన్నుల జింక్ పంపిణీకి సిద్దంగా ఉంది. జిప్సం, చౌడుభూమిలో చౌడును తీసేందుకు ఉపయోగపడుతుంది. చౌడు ఎక్కువగా ఉన్న నేల ల్లో ఎకరాకు 200కిలోలు వేసి కలియదున్ని , నీరు నింపి దున్నిన పొలం నుంచి నీటిని బయటకు పంపితే పొలం సస్యశ్యామలంగా పంటలు పండే అవకాశం ఉంది. అలాగే వేరుశెనగ ఊడలుదిగే సమయంలో ఎకరాకు 200కిలోలు వేయడం వల్ల కా య ఊరి నూనెశాతం పెరిగి దిగుబడి అధికంగా వస్తుంది. జింక్ వరిలో జిం కులోపం ఉంటే ఎకరాకు 20కిలోలు ప్రతి ఏడాది వేసుకోవడం వల్ల జింక్‌లోపం తొలగిపోతుంది. వీటికోసం రైతాంగం వ్యవసాయ కార్యాలయం ఎదుట బారులు తీరి కూపన్లకోసం ఎగబడుతున్నారు. వ్యవసాయాధికారి నరసింహారెడ్డి ప్రస్తుతం 145 టన్ను లు జిప్సం ఉందని, 10 టన్నులు జింక్ ఉందని రైతులు ఎలాంటి ఆందోళనలు చెందవద్దనే సంకేతాలు ఇస్తున్నారు. ఏ ఒక్కరైతుకు లేదు అనకుండా అందరికీ ఈ రెండింటినీ సరఫరా చేస్తామన్నారు. జిప్సం మరో 105 టన్నులు ఆర్డర్ పెట్టామని అవి కూడా త్వరలో వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిప్సం ఎకరాకు 100 కిలోలు, ఆపైబడితే 500 కిలోలు కూడా ఇస్తున్నామన్నారు. జింక్ మాత్రం ఎకరాకు 10కిలోలు ఇస్తున్నామన్నారు.

ఉద్యోగాల పేరిట మోసం చేసే ఇద్దరి అరెస్టు
రాయచోటి, డిసెంబర్ 16: నిరుద్యోగుల పరిస్థితులను ఆసరాగా తీసుకొని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసపూరిత మాటలు చెప్పి నిలువెత్తునా ముంచేసే ఇద్దరు వ్యక్తులను శనివారం రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. శనివరం స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్బన్ సీఐ మహేశ్వరరెడ్డి నిందితుల వివరాలను వివరించారు. ఆయన తెలిపిన మేరకు.. బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన మల్లిఖార్జునకు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అంకిరెడ్డితో పరిచయం ఏర్పడింది. అంకిరెడ్డి సలహాల ప్రకారం ఇద్దరు ఓ కొలిక్కి వచ్చి అక్రమమార్గంలో ఎక్కువ డబ్బులు సులువగా సంపాదించాలనే ప్రయత్నాలు నిరుద్యోగులను ఎరగా ఎంచుకొని వారికి ఉద్యోగాలు చేస్తామని చెప్పి డబ్బులు సంపాదించాలని భావించారు. ఈ క్రమంలో రాయచోటికి చెందిన మురళీధర్‌రావు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నాడని వీరు గమనించి చిన్నగా అతనితో పరిచయం పెంచుకున్నారు. మేము వివిధ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించామని, సర్ట్ఫికెట్లు కూడా తయారు చేయిస్తామని నమ్మపలికారు. మురళీధర్‌రావుకు కూడా ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తామని ఇందుకు రూ.3 లక్షలు ఖర్చు అవుతుందని మోసపూరిత మాటలు చెప్పి నమ్మించారు. ఇందుకు ఒప్పుకున్న మురళీధర్‌రావుకు వీరిపై అనుమానం వచ్చి రాయచోటి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మల్లిఖార్జున, అంకిరెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పట్టణంలో వీరిద్దరినీ అరెస్టు చేయడం జరిగిందని, అరెస్టు అయిన వీరిని కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు.