కడప

గండికోట నిర్వాసితులు డాక్యుమెంట్లు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,డిసెంబర్ 16: గండికోట ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కొండాపురం గ్రామప్రజలు పరిహారం చెల్లింపులో పరిహారం పొందలేకపోయినా సమన్వయంతో డాక్యుమెంట్లు అందజేస్తే తప్పక పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ టి.బాబూరావునాయుడు తెలిపారు. కలెక్టరేట్‌లోని మీకోసం హాల్‌లో శనివారం పరిహారం పొందలేకపోయిన నిర్వాసితులకు ప్రత్యేక పునరావాస వినతుల పరిష్కారవేదిక ఏర్పాటు చేశారు. వినతులు ఇచ్చేందుకు వచ్చిన నిర్వాసితులతో ఆయన మాట్లాడుతూ గండికోట ముంపువాసులకు పరిహారం చెల్లింపుచేయడం జరిగిందన్నారు. పరిహారం పొందక తప్పిపోయిన వారికి సంబంధించి వినతులు స్వీకరించేందుకు ఈప్రత్యేక పరిష్కారవేదిక ఏర్పాటు చేశామన్నారు. పరిహారం చెల్లింపునకు సంబంధించి ఆధారాలు, అర్హతలు ఖచ్చితంగా సమర్పించిన వారి దరఖాస్తులు పరిశీలించి తప్పక న్యాయం చేయడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్నవారందరికీ ఎలాంటి నష్టం జరగదని భయాందోళనలు పెట్టుకోవద్దన్నారు. క్లైమ్ సరైన పక్షంలో అర్హత మేరకు తప్పక పరిహారం చెల్లింపు జరుగుతుందన్నారు. పునరావాస వినతులు పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు తమవద్ద వున్న డాక్యుమెంట్లను అందించి పరిష్కారం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక కలెక్టర్ నాగేశ్వరరావు, డిఆర్వో బాబయ్య, జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి నాగన్న, ప్రొద్దుటూరు తహశీల్దార్ వెంకటరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

చాపాడు, డిసెంబర్ 16 : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ పంటలు చేతికందుతున్నాయి. ముఖ్యంగా వరిధాన్యం అక్కడక్కడ రైతుల చేతికి వస్తుంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలును చేయాల్సివుంది. ఇంతవరకు ఎక్కడైన కాని ఒక్క కేంద్రంకూడా ఏర్పాటు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలలోని కెసికెనాల్ పరిధిలోని చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, కడప ప్రాంతాల్లో వరి ధా న్యం కొనుగోలు కేంద్రాలను ప్రభు త్వం ఏర్పాటుచేసి రైతుల నుంచి నేరు గా ధాన్యం కొనుగోలు చేయాల్సివుం ది. గత రెండు సంవత్సరాలుగా కేంద్రా లు ఏర్పాటు కావడం లేదు. డ్వాక్రా సభ్యులు మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సివుంది. డిఆర్‌డిఎ సమస్థకు అనుభందంగా డ్వాక్రా సభ్యులు కేంద్రాలను నడపాల్సివుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో రైతులు దళారుల చేతులో చిక్కి తబ్బిబ్బులు అవుతున్నారు. దాళారులు ఎంతకంటే అంతకు ధాన్యంను కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ధాన్యం పుట్టి (8 బస్తాలు) ధర రూ.9 వేల నుంచి రూ. 9,500 వరకు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం నాణ్యతను బట్టి మరింత ధరను తగ్గిస్తూ రైతులను దోచుకోవడం మొదలుపెట్టారు. కనీసం రైస్ మిల్లర్ల వ్యాపారులు కూడా కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో దళారులదే హవా సాగుతుంది. కెసి కెనాల్, దాని అనుభంధమైన చాపాడు ఛానల్‌తోపాటు కుందు, పెన్నా నదుల తీరప్రాంతాల్లో విస్తారంగా సాగు అయిన వరి పంట నూర్పిల్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యంచేతి కొచ్చి నా కొనుగోలుచేసే నాథుడులేక దళారుల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టపోతున్నామని వరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మండల కేంద్రాలతోపాటు పలు ముఖ్యమైన గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ఏర్పా టు చేయాల్సివుంది. గతంలో మాదిరిగా ప్రభుత్వం డ్వాక్రా సంఘ సభ్యులతో గాని, ఎ.పి.సీడ్స్ సమస్థ గాని కొనుగోలు చేయాల్సివుంది. లేకపోతే దళారుల చేతి లో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సివుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దశల వారీగా ఒంటిమిట్ట అభివృద్ధి..

ఒంటిమిట్ట, డిసెంబర్ 16: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మూడవసారి ముచ్చటగా చేపడుతున్న ఒంటిమిట్ట కోదండ పాణి బ్రహ్మోత్సవాల్లో జరపబోతున్న కల్యాణాన్ని అంబరాన్ని అంటేలా నిర్వహిస్తామని టీటీడీ జేఇఓ పోలా భాస్కర్ అన్నారు. శనివారం ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ బాబూరావునాయుడుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయం ఈశాన్య భాగంలో ఉన్న పాఠశాలను, మాడ వీధులను, రూ. కోటితో నిర్మాణమవుతున్న పుష్కరణి స్థలాన్ని, జరుగుతున్న ప్రహరీ నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దశల వారిగా ఒంటిమిట్టను అభివృద్ధి చేసేవిధంగా సూపర్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు. గడిచిన రెండేళ్ల బ్రహ్మోత్సవాలతో అనుభవం వచ్చిందని, గత పొరబాట్లు పునరావృతం కాకుండా మార్చిలో జరిగే బ్రహ్మోత్సవాలను, సీతారాముల కల్యాణాన్ని లక్షల మంది భక్తులు వీక్షించేలా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పనులన్ని ఫిబ్రవరి 29వ తేది నాటికి పూరె్తైలా ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ఒంటిమిట్ట ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని రామకృష్ణ మఠం సహకారంతో 3వ ఫేస్ అభివృద్ధిలో భక్తులు, పర్యాటకులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. పాఠశాలను రెండు రోజుల్లో తొలగించి కలెక్టర్ సహకారంతో స్థలాన్ని ఇస్తే ఆధునాతనంగా టిటిడి నిధులతో నిర్మిస్తామన్నారు. కేంద్ర పురావస్తు సహకారంతో ఆలయం దక్షణ భాగంలో వంద మీటర్ల పైబడి మహాకవి బమ్మెర పోతన పార్కు, పర్యాటకులను ఆకర్షించేలా లైటింగ్, రోడ్ల సౌకర్యం నిర్మించబోతున్నట్లు తెలిపారు. టీటీడీ డీప్యూటీ ఇఓ కార్యాలయం కూడా నిర్మిస్తామన్నారు. భక్తులను ఆకర్షించేలా కోదండ రాముని పుష్కరణిని కోటి రూపాయలతో నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న రామతీర్థాన్ని అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామన్నారు. ఆలయం లోపలి భాగాన పురావస్తు శాఖ అనుమతితో ఫ్లోరింగ్, గోపురాలకు మరమ్మతులు చేపడతామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలలో ఛైర్మన్, ఇఓలు ఛాంబర్‌లో కూర్చుని ఒంటిమిట్ట ఆలయ పరిసరాలలో నిత్యం జరిగే ఏర్పాట్లు తిలకించేలా ఆధునాతన పద్ధతిలో సిసి కెమెరా ఏర్పాటు ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవ పనులన్ని చూపనులను ఆకర్షించేలా ఉంటాయన్నారు. ఎవరైననూ పరిహరం రావాల్సి ఉంటే రెవెన్యూ ద్వారా న్యాయం చేస్తామన్నారు. అనంతరం ఆయన కలెక్టర్‌తో కలసి అభివృద్ధి మ్యాప్ పరిశీలించారు. పురావస్తు శాఖ అధికారి బాలకృష్ణారెడ్డి, ఇంజనీరింగ్ విభాగంతో అర గంట పాటు చర్చించారు.