కడప

నెలాఖరునాటికి ఓడియఫ్ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, ఫిబ్రవరి 23: ఈనెలాఖరునాటికి అన్ని గ్రామపంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తి చేయించి ఓడియఫ్ ప్రకటించేలా అధికారులు సత్వరచర్యలు చేపట్టాలని జడ్పీ సీఈవో రామ చంద్రారెడ్డి కోరారు. ఆయన శుక్రవారం వల్లూరు, యర్రగుంట్ల, కమలాపురం మండలాలకు సంబందించిన తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లతో ఐహెచ్‌హెచ్‌యల్ పై స్థానిక మండలపరిషత్ సభాభవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో 50లోపు నిర్మాణాల్లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను 26నాటికి పూర్తి చేసి ఓడియఫ్ పంచాయతీలుగా ప్రకటించాలన్నారు. 50పైగా ఉన్న మరుగుదొడ్లను 28నాటికి పూర్తి చేసి ఓడియఫ్‌గా ప్రకటించాలన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని మండలాల్లో కూడా పూర్తి చేసి ఓడియఫ్‌గా ప్రకటించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆ దిశగా రోజువారీ లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోని లబ్ధిదారులకు రాతపూర్వకమైన నోటీసులను ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా వల్లూరు మండలంలో ఇప్పటికే ఇలాంటి చర్యలు చేపట్టామన్నారు. సకాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తి చేసుకోకపోతే వారికి ప్రభుత్వ సహకారం ఉండదని సొంతనిధులతో నిర్మించుకోవాల్సి ఉంటుందని సీఈవో స్పష్టం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మొదటిటాస్క్‌లో 75%బేస్ మట్టాలు పూర్తయ్యాయని రెండో టాస్క్‌లో 50%మేర పూర్తయ్యాయన్నారు. అలాగే జిల్లాలో ఇప్పటికే 72వేల వ్యక్తిగత మరుగుదొడ్లు వివిధ దశల్లో ఉన్నాయని అవన్నీ కూడా ఈనెలాఖరుకు పూర్తి చేసేలా లబ్ధిదారులను చైతన్య పరచాలని అధికారులకు ఆయన తగు సూచనలు చేశారు. కాగా జిల్లాలో గత అక్టోబర్ 2 యన్‌ఆర్‌జియస్ ద్వారా 48 గ్రామపంచాయతీలు, యస్‌బీయం ద్వారా 150 గ్రామపంచాయతీలను ఓడియఫ్‌లుగా ప్రకటించామన్నారు. అలాగే గ్రామపంచాయతీల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు గ్రామాలను ఓడియఫ్‌గా ప్రకటించేందుకు ముందుకు రావాలని లేకపోతే ఆ పంచాయతీల ప్రాధాన్యత తగ్గుతుందన్న విషయం తెలుసుకోవాలన్నారు.
జిల్లా కాంగ్రెస్‌పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్‌గా చాన్ అలీ
కడప,్ఫబ్రవరి 23: కాంగ్రెస్‌పార్టీ మైనార్టీసెల్ చైర్మన్‌గా చాన్ అలీ,కార్యదర్శిగా షేక్ ఏజాజ్ అహ్మద్‌లను నియమించినట్లు డిసిసి అధ్యక్షుడు నజీర్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో వీరికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ సమస్యలపై కాంగ్రెస్‌పార్టీ తరపున పోరాటం చేసేందుకు వీలుగా వీరికి బాధ్యతలు అప్పగించామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీలు గృహాలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి సమస్యలకోసమే కమిటీలు నియమించినట్లు వెల్లడించారు.
కోర్టులు అందరికీ న్యాయంచేస్తాయి
* జడ్జీ సత్యకుమారి

చాపాడు, ఫిబ్రవరి 23: న్యాయస్థానాలు పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే విధమైన న్యాయం చేస్తాయని అందులో ఎవ్వరూ అపోహాలకు గురికాకూడదని మైదుకూరు జూనియర్ జడ్జీ సత్యకుమారి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మిపేట గ్రామంలో న్యాయ సలహా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమారి మాట్లాడుతూ అందరికీ ఒకే విధమైన న్యాయం జరిగేందుకు కోర్టులు పనిచేస్తున్నాయని, సాక్షాలు ఏవిధంగావుంటే అలానే తీర్పులు కూడా ఉంటాయన్నారు. లోక్ అదాలత్‌లో చాలాకేసులు పరిష్కారమైతున్నాయని, చిన్నచిన్న సమస్యలకు ప్రజలు గురౌతూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం ఉచిత న్యాయసేవా కార్యక్రమాన్ని చేపట్టి ప్రత్యేక న్యాయవాధితో చాలా వరకు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. మానసిక రుగ్మతలకు గురౌతూ ఆశ్రమాలకు వృద్ధులు వెల్లడం జరుగుతుందని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు.