కడప

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి కల్యాణానికి చంద్రబాబు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 18:రెండవ భద్రాద్రిగా కడప జిల్లా ఒంటిమిట్టమండలంలో వెలసిన శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవానికి రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు రాక ఖరారైంది. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంలో మండలాన్ని పోలీసు వలయంలోకి తీసుకున్నారు. కల్యాణోత్సవం అంగరంగవైభవంగా రాష్ట్రప్రభుత్వం ఈనెల 30న శుక్రవారం రాత్రి కల్యాణోత్సవం నిర్వహించనుంది. ఆ దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం, జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్దమైన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాష్టమ్రుఖ్యమంత్రి సీతారాముల కల్యాణానికి వస్తున్నట్లు జిల్లా కేంద్రానికి సమాచారం వచ్చింది. దీంతో సీఎం పర్యటన దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఎస్పీ అట్టాడ బాబూజీ భద్రత ఏర్పాట్లు ఒంటిమిట్టను సందర్శించి పర్యవేక్షించారు. కల్యాణోత్సవానికి ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో హెలిప్యాడ్ దిగే స్థల ఏర్పాట్లు కూడా అధికారులు పరిశీలించారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనేక రకాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటిని చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. సమయం తక్కువగా ఉండటం చేత, రాములోరి గుడి సమీపంలో జరిగే ఉద్యానపార్కు, పుష్కరిణి పనులు వేగవంతం చేశారు. ఈ పనులు రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలతో మధ్యన రేయింబవళ్లు కార్మికులు పనులుచేస్తున్నారు. ఈనెల 30వ తేదిన రాత్రి సీతారాముల కల్యాణం ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ సమీపంలో చెన్నై-రాజంపేట రహదారి పక్కన ఉన్న స్థలంలో సీతారాముల కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచే గాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర , తమిళనాడు నుంచి రామ భక్తులు రానున్నారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకు ఈసారి దాదాపు 2లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాల్లో యంత్రాంగం లెక్కకట్టింది. ఇందులో భాగంగా సీఎం భద్రతను మరింత పటిష్టత చేయనున్నారు. తొలిసారిగా రాష్ట్రప్రభుత్వం ద్వారా నిర్వహించిన కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీసమేతంగా హాజరై ప్రభుత్వం తరపున స్వామి, సీతమ్మవారికి పట్టువస్త్రాలు అందజేసి అప్పట్లో సోమశిల బ్యాక్‌వాటర్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరందించే పైపులైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈఏడాది ఒంటిమిట్ట కోదండరామస్వామి సన్నిధిలో ప్రభుత్వం నిర్వహించే కల్యాణోత్సవానికి ఈనెల 30న రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కళ్యాణం తిలకించేందుకు టీటీడీ వర్గాలు సౌకర్యవంతమైన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. లక్షా 50వేల మందికి స్వామివారి తలంబ్రాలు ప్యాకెట్స్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి రూ.5కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల వసతి కోసం నిర్మించిన భవన సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. ఉద్యానపార్కు, పుష్కరిణి కూడా ప్రారంభిస్తారు.
పిలిస్తే పలికే దైవం శ్రీశ్రీశ్రీ అవధూతేంద్రస్వామి
* 20న స్వామివారి ఆరాధనోత్సవాలు * ఆలయ కమిటీ కార్యదర్శి వెంకట్రామిరెడ్డి
కడప,కల్చరల్,మార్చి 18: పిలిస్తే పలికే దైవం శ్రీశ్రీశ్రీ అవధూతేంద్రస్వామి వారు అని, ఈనెల 20వ తేదీన జరిగే స్వామివారి 40వ ఆరాధనోత్సవాల్లో భక్తులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పివిఆర్ అధినేత పోతుల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ శ్రీఅవధూతేంద్రస్వామి ఆశీర్వాదం లేనిదే తాను ఎక్కడికీ వెళ్లనన్నారు. నిద్రలేచిన తర్వాత మొదటగా స్వామి వారిని దర్శించుకుంటాన్నారు. స్వామివారు జీవించిన కాలంలో అప్పట్లో అందరూ అవధూతస్వామి గురించి చెబుతుంటే తాను కూడా ఒకసారి చూడాలన్న ఆతృతతో కడపకు వచ్చి స్వామివారిని చూడటంతో నాజీవితం ధన్యమనుకున్నాను. ముఖ్యంగా తనకు 19సంవత్సరాల వయస్సు ఉన్న కాలంలో ప్రతిరోజు ఫైర్‌స్టేషన్ వద్దవున్న అవధూతేంద్రస్వామిని దర్శించుకునే వాడిని. కానీ అప్పట్లోనే ఆయన నీకు ఇప్పుడే నాతో అవసరం లేదు నీకు ఇంకా వయసుందిలే అప్పుడు రా అని పొమ్మనేవారు. ఆయన అన్నమాటలే తనకు ఈరోజు ఆయన భక్తుడిగా సేవచేసుకునేందుకు భాగ్యం కలిగింది. తాను వ్యాపారరీత్యా ఎదుగుదలకు స్వామి కృపయే. ప్రతిరోజు అవధూతస్వామి పూలమాలలు బస్సులకు వేయందే కదలవు. ప్రతిరోజు ఆయనకు విశేష పూజలు చేస్తాను. అవధూత వస్త్రాలను అమ్మేసమయంలో తానే ఆ వస్త్రాలను కొనుక్కొని వాడుకుంటాను. స్వామివారు సమాధి అయ్యాక ఆయనకు సేవచేయాలన్న తపనతో ఆలయ కమిటిలో చేరి సేవలు చేస్తున్నానని తెలియజేశారు. స్వామివారిని తలచుకుని ఏపని చేసినా విజయవంతంగా జరుగుతుందన్నారు. మానవరూపంలో వచ్చిన దేవుడు అవధూత. ఆయనను నమ్ముకున్న భక్తులకు ఎప్పుడూ అండగా నిలుస్తారు. ఈరోజు ఆయన భక్తులు ఇతర రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా ఉన్నారు. స్వామి ఆరాధన రోజు వారంతా వచ్చి స్వామికి సేవలు చేస్తారు.