కడప

సాంకేతికతను వినియోగించుకుని నేరాలు అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప క్రైం,మార్చి 21: అధునాతన సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుని నేరాలు అరికట్టాలని ఎస్పీ అట్టాడ బాబూజీ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జరిగిన నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల నమోదైన పలు కీలక కేసులు, అంశాలపై ఎస్పీ సమీక్ష చేసి అధికారులకు దిశ నిర్దేశం చేశారు. లాక్డ్ హౌస్‌మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) ను వినియోగించడంలో కడప డివిజన్ రాష్ట్రంలోనే ప్రధమస్థానంలో ఉందని ఎస్పీ అన్నారు. ఈ అంశంలో కడప డీఎస్పీ షేక్ మసూంబాషాను అభినందించారు. ఎల్‌హెచ్‌ఎంఎస్ ద్వారా కరుడుగట్టిన దొంగను పట్టుకోవడంతో కడప జిల్లా పోలీసులు రాష్ట్రంలోనే ప్రత్యేకత సాధించారని పోలీసుల హర్షద్వానాల మద్య ప్రకటించారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటే సత్పలితాలు సాధించవచ్చుననేందుకు ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ విషయంలో రుజువైందన్నారు. అలాగే క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ (సీసీటిఎన్‌ఎస్), ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్‌వర్క్ సిస్టమ్ (ఎఫ్‌ఐ ఎన్‌ఎస్), ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్‌వర్క్ సిస్టమ్ (పిఐఎన్‌ఎస్) లను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. వేసవికాలంలో సెలవుల నేపధ్యంలో ఇళ్లచోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని, గస్తీ ముమ్మరం చేయాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్ కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రోడ్డుప్రమాదాలు తరచు జరిగే బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి అక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మట్కా, క్రికెట్‌బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక నేరాలపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎర్రచందనం అక్రమరవాణా అరికట్టేందుకు వ్యూహాత్మకమైన, ప్రణాళికా బద్దమైన పనితీరుతో పనిచేయాలన్నారు.