కడప

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకహోదా సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 22: ప్రత్యేక హోదాసాధనకోసం పలురాజకీయపార్టీలు జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి రాస్తారోకో దాదాపుగా విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ, ఉభయ కమ్యూనిస్టుపార్టీలు,కాంగ్రెస్, జనసేన పార్టీల సంయుక్త కూటమి పిలుపుమేరకు గురువారం జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధం జరిగింది. ప్రతిపక్షపార్టీల నిరసనలతో మేల్కొన్న తెలుగుదేశంపార్టీ ఉదయం నిరసన సదస్సు ఏర్పాటుచేసి సాయంత్రం ఏకంగా వారూ రహదారుల నిర్భంధం చేశారు. ఉదయం ప్రతిపక్షాలు, సాయంత్రం అధికారపక్షం దిగ్బంధం చేయడంతో వాహన రాకపోకలు భారీగా స్థంభించాయి. జిల్లాలోని 10నియోజకవర్గాల్లో ఆయాపార్టీల నేతలు ఉదయం 10గంటల నుండి 12 గంటల వరకు రోడ్డు నిర్బంధం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రహదారుల దిగ్బంధంపై వైసీపీ నేతలు, అంతకుముందు ప్రకటనలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి, తీరా రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో మాత్రం గైర్హాజరయ్యారు. జిల్లాకేంద్రమైన కడపలో పార్లమెంట్ పర్యవేక్షకుడు కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషాలు సైతం పత్తా కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా ఈపార్టీ నేతలు పార్టీ ఆదేశించిన స్థాయిలో ఆందోళనలో పాల్గొనలేదు. ఇదే స్థాయిలో తెలుగుదేశంపార్టీ అగ్రనేతలు కూడా మొఖం చాటేశారు. కేవలం ద్వితీయశ్రేణి నేతలు మాత్రమే ఆందోళనలో పాల్గొన్నారు. ఈపరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. పోలీసులు తమవంతు ప్రయత్నంగా ఉద్యమకారులను అరెస్టుచేయకుండానే వాహనాల మళ్లింపు వ్యవహారంలో చురుగ్గా పాల్గొన్నప్పటికీ ఆందోళనకారులు ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ఆయాపార్టీల నేతలు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ తీరును ఎండగట్టారు. నాలుగేళ్లపాటు రాష్ట్రాన్ని నమ్మించి మోసంచేశారని, విభజన సమయంలో విభజన బిల్లుప్రకారం అనేక హామీలు ఇచ్చినా అవేమీ అమలుచేయకుండా నిలువునా మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబునాయుడు కూడా ఇప్పటి వరకూ బీజేపీకి వత్తాసుపలుకుతూ ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ సంజీవని లాంటిదని నాలుగేళ్లుగా కేంద్రప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇటువంటి మోసపూరిత విధానాలతో తెలుగు ప్రజలను నాశనంచేశారని విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చివుంటే రాష్ట్రంలో అనేక పరిశ్రమలు నెలకొల్పేందుకు అవకాశం ఉండేదని, ఇందువల్ల కార్మికులకు, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండటమేగాకుండా రాష్టన్రిర్మాణానికి కావాల్సినంతగా నిధులు మంజూరయ్యేవని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతకాని రాజకీయంవల్లే రాష్ట్రం అన్యాయానికి గురైందని, ఇప్పుడు బీజేపీ, ఎన్‌డిఏతో తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించడంవల్ల ఎలాంటి ప్రయోజనంలేదని వారు ఆరోపించారు. కేంద్రప్రభుత్వం మెడలు వంచేందుకు అన్నిపార్టీలు ఏకమై ఉద్యమానికి శ్రీకారం చుడితే, రాబోయే ఎన్నికల్లో ఆపార్టీని ప్రజలు పక్కనపెట్టే అవకాశాలున్నాయని వారు స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఉద్యమాలు పోటాపోటీగా కొనసాగడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాయంత్రం మేల్కొన్న తెలుగుదేశం
ఉదయం వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు జాతీయ రహదారి దిగ్బంధనం చేపట్టగా, తెలుగుదేశంపార్టీ ఉదయం కేవలం సదస్సులు నిర్వహించి ఉపన్యాసాలతో నిరసన తెలిపారు. సాయంత్రానికి మేల్కొని ప్రతిపక్షాలకు పోటీగా తామూ తక్కువకాదన్నట్లు హఠాత్తుగా రహదారుల దిగ్బంధనానికి దిగారు. సాయంత్రం 4గంటల నుండి ఈపార్టీ నేతలు రోడ్ల దిగ్బంధనానికి పూనుకోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు స్థంభించిపోయాయి. ఫలితంగా ప్రయాణీకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రమైన కడపలో టీడీపీ నేతలు గోవర్దన్‌రెడ్డి, అమీర్‌బాబు, సుభాన్‌బాషా వంటి నేతలు ఆందోళనలో పాల్గొనగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రధాన నాయకులు ఆందోళనలో పాల్గొనక పోవడం గమనార్హం.