కడప

మహిళలపై లైంగిక వేధింపులు ఆగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, ఏప్రిల్ 19: దేశంలో కానీ, రాష్ట్రం కానీ మహిళలపైన చిన్నారులపైన రోజు రోజుకూ లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని, ఈ లైంగిక వేధింపులు ఆగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. నిర్భయచట్టం తెచ్చినా కూడా లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి అంటే చట్టంలో ఉన్న లొసుగులు కానీ లేదా రాజకీయ నాయకులు, పోలీసుల ప్రమేయం ఉండవచ్చన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడేవారికి మానవత్వం లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎన్నికల సమయంలో ప్రతి ఊరికి మహిళా పోలీస్‌స్టేషన్, ప్రతి మహిళకు సెల్‌ఫోన్ ఇస్తామన్న మామీలను తుంగలోతొక్కారని ఆయన ధ్వజమెత్తారు. వికలాంగులైన కూడా అత్యాచారాలు జరుగుతుండటం చాలా దురదృష్టకరమని, వాళ్లు మృగాలకన్నా నీచమైనటువంటి వాళ్లుగా తెలుస్తోందన్నారు. నిర్భయ చట్టంలో ఏ రకమైనటువంటివి తెలియదు కానీ ప్రభుత్వం పోలీసులకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఎవరైనా లైంగికవేధింపులకు పాల్పడితే బెయిల్ లేకుండా యావజ్జీవ కారాగారశిక్ష విధించాలని, అత్యాచారంచేస్తే ఆ స్థానంలోనే వారిని ఎన్‌కౌంటర్ చేయాలన్నారు. అప్పటిదాకా అత్యాచార నేరాలు మోపబడిన నిందితులందరినీ జైళ్లలో బంధించాలని ఆయన డిమాండ్ చేశారు. కాశ్మీర్ ప్రాంతంలోని ఆసిఫాపై అత్యాచారం హత్యచేసిన వారిని బహిరంగ ఉరితీయాలన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి మహిళా సోదరికి గౌరవం అందేలా చూసుకుందామని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలియజేశారు.

కల్యాణం.. కమనీయం
* వైభవంగా వైద్యనాథస్వాముల, లక్ష్మీ చెన్నకేశవస్వాముల కల్యాణోత్సవాలు
వల్లూరు, ఏప్రిల్ 19: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ కామాక్షి వైద్యనాథ స్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వాముల కల్యాణోత్సవాలు కనుల పండువగా జరిగాయి. క్షేత్రాధిపతియైన శివుని అంశలోని వైద్యనాథ స్వామి కల్యాణంతో పాటు క్షేత్రపాలకుడైన విష్ణు అంశలోని చెన్నకేశవస్వామి కల్యాణ మహోత్సం ఒకేరోజు జరుగడం ఇక్కడి విశేషం. ఉదయం శ్రీ కామాక్షి వైధ్యనాథేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణవేదికపై శ్రీ కామాక్షి వైద్యనాథుల కల్యాణం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిగింది. రాత్రి కొండపై చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీదేవి, భూదేవిలతో శ్రీ చెన్నకేశవుని కల్యాణం వైభవోపేతంగా జరిగింది.

బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను ఆపండి
* దోషులను కఠినంగా శిక్షించండి
వేంపల్లె, ఏప్రిల్ 19: రోజు రోజుకూ అభం శుభం తెలియని బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను వెంటనే ఆపాలని అలాగే అందుకు సంబంధించిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వేంపల్లె శాంతి సంఘం నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ ఎస్‌ఎఫ్ బాష పేర్కొన్నారు. వేంపల్లెలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు భారీ సంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక పాతబజారు నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు సాగింది. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా విద్యార్థులు ఏర్పడి జమ్మూకాశ్మీర్‌లో చిన్నారిపై జరిగిన ఘటనకు వారు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.