కడప

ఏసిబి నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ, ఏప్రిల్ 19: కడప నగరంలోని పాత రిమ్స్ ఆవరణంలో నూతనంగా నిర్మించిన అవినీతి నిరోధకశాఖ (ఏసిబి) కార్యాలయాన్ని గురువారం మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈకార్యాలయం ప్రారంభానికి ఏసీబి ఏపీ డైరెక్టర్ జనరల్ ఆర్‌పీ ఠాకూర్ (ఐపీఎస్) హాజరయ్యారు. కార్యాలయ ప్రారంభం అనంతరం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఏపీ డైరెక్టర్ జనరల్ ఠాకూర్ మాట్లాడారు. కడప నగరంలో నూతన ఏసీబి భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు రూ.కోటి 14లక్షల వ్యయంతో ఈ భవన నిర్మాణం కేవలం 7నెలల్లోనే జరిగిందన్నారు. ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఈ భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టిందన్నారు. ఏపీ విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏసీబి కార్యాలయాల నిర్మాణానికి ముఖ్యమంత్రిని నిధులు అడుగగా ఆయన వెంటనే మంజూరుచేశారని సంతోషం వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణానికి రూ.16కోట్లు మంజూరయ్యాయన్నారు. 13 జిల్లాల్లో ఈ భవనాల నిర్మాణం జరగనుందన్నారు. అన్ని సౌకర్యాలతో అధునాతన వసతులతో మా సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. గతంలో 9మంది ఉన్న సిబ్బందికితోడు అదనంగా మరో 13మందిని ఇచ్చి మొత్తం 22 మంది సిబ్బందిగా పనిచేస్తారన్నారు. అదనపు సిబ్బంది కోసం 350 పోస్టులను మంజూరుచేశారని ఇంతవరకు ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు జరగలేదన్నారు. 2016లో ఎన్‌సీఏఇఆర్ సర్వేప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో అవినీతి రహిత రాష్ట్రాల జాబితాలో 19వ స్థానంలో ఉండగా, 2017లో 3వ స్థానానికి చేరిందన్నారు. వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం కోటిరూపాయలు మంజూరు చేసిందన్నారు. విజిలెన్స్, సీబిఐ అధికారులతో సమన్వయంగా మాశాఖ పనిచేస్తుందన్నారు. కరెప్షన్ ఉండరాదని అన్నారు. కరెప్షన్ తక్కువ ఉన్నప్పుడు రాష్ట్భ్రావృద్ధి సాధ్యవౌతుందన్నారు. ఏసీబికి ఫిర్యాదు చేయదలచుకున్నవారికి ఫోన్:1064 ఇచ్చారు. అనంతరం మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వపథకాలు ప్రజలకు అందాలంటే ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేయాలన్నారు. దేశంలో పెద్దచేపలను ఏసీబీ పట్టుకోవడంతో మంచి రెవెన్యూ దేశానికి వచ్చిందన్నారు. ఏ అధికారి అయినా పని నిమిత్తం డబ్బులు అడిగితే ఏసీబికి ఫిర్యాదు చేయాలన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి 13 జిల్లాలకు మంచి భవనాలు ఇచ్చారన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2400 చదరపు అడుగుల్లో మంచి భవనాన్ని నిర్మించారన్నారు. ఠాకూర్ రాష్ట్ర అధికారిగా వచ్చాక అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయన్నారు. అవినీతి నిరోధంలో రాష్ట్రం 3వ స్థానానికి చేరడం సంతోషమన్నారు. 1100 నెంబర్‌కు ఫోన్‌చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. గతంలో అద్ద్భెవనాల్లో ఉన్న ఏసీబీ కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పడటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపించడం కళ్లు మూసుకుని మాట్లాడమే అన్నారు.