కడప

ప్రత్యేక హోదాకు జగన్ తీరే అడ్డంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, ఏప్రిల్ 22:ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు జగన్ తీరుతో అడ్డంకులు ఎదురవుతున్నాయని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సీ. ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపుమేరకు చేపట్టిన సైకిలు యాత్రల్లో భాగంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆదివారం మండలంలోని పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లె, ధర్మాపురం, దానవులపాడు గ్రామాల్లో సైకిలు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మంత్రి ఆది సైకిలుపై తిరిగి ప్రత్యేకహోదా గురించి ప్రజలకు, ప్రత్యేక హోదా సాధనకు తెలుగుదేశం పార్టీచేస్తున్న పోరాటం గురించి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆది మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్దికి ప్రత్యేకహోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టిన రోజును పక్కనపెట్టి ధర్మపోరాట దీక్ష చేశారన్నారు. రాష్ట్రానికి బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో సానుకూలతగాఉన్న సమయంలో వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అడ్డుపుల్ల వేశారని ఆరోపిస్తూ పలు ఛలోక్తులు విసిరారు. ప్రత్యేకహోదా గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సైకిలు యాత్రను చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం, టీడీపీ పోరాటానికి మద్దతుగానిలిచి హోదా, డిమాండ్లను సాధించేందుకు పోరాటంలో కలిసిరావాలని మంత్రి ఆదినారాయణ రెడ్డి కోరారు.