కడప

మా రాష్ట్రం మాకు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ, ఏప్రిల్ 26: స్వాతంత్య్రం వచ్చాక 1953 నుంచి కూడా రాయలసీమ అన్యాయమైపోతోందని, మా రాష్ట్రం మాకు ఇవ్వండని రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ రాష్టక్రార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి గురువారం అన్నారు. నగరంలోని ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ ప్లీనరీ తిరుపతిలో జరిగిందని, ప్రముఖ రచయిలు, కవులు, ప్రముఖులు హాజరయ్యారన్నారు. మంచి సలహాలు ఇచ్చిన వారందరికీ తొలుత కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ పది నెలల తర్వాత జరిగిన ఈసమావేశంలో ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం తీవ్రతరం చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఈసమావేశానికి రాయలసీమ నాలుగు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. 1953లో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని కర్నూలులో ఏర్పాటుచేశారని, అయితే అది మూన్నాళ్ల ముచ్చటగా తిరిగి లాగేసుకున్నారన్నారు. కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు నుంచి సిద్దేశ్వరం దాకా అన్నిరంగాల్లో రాయలసీమకు అన్యాయం చేశారన్నారు. రాయలసీమలో కేసీ కెనాల్ మినహా లక్ష ఎకరాలకు నీరు ఇచ్చే ఒక్క ప్రాజెక్టు కూడాలేదన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను 2018కే పూర్తిచేయాల్సివున్నా, ఇంతవరకూ దాని ఊసేలేదన్నారు. కృష్ణానది ప్రారంభ ప్రాంతమైన రాయలసీమ ఎడారి కావడానికి కారణం ఎవరో తెలపాలని డిమాండ్ చేశారు. 75ఏళ్ల స్వతంత్రం రాయలసీమ నీటి సమస్యను తీర్చలేకపోయిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో వెయ్యిమంది పనిచేసే ఒక్క సంస్థ కూడా లేకపోవడం దేన్ని సూచిస్తోందని ఆయన ప్రశ్నించారు. రాయలసీమకు రావాల్సిన రాజధానిగా చెన్నైని, కర్నూలు, హైదరాబాద్‌ను పోగొట్టుకున్నామని, తిరిగి అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధిచేశాక వారు వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ళ నుంచి కోరుతున్న హైకోర్టును రాయలసీమకు ఇవ్వకపోవడం రాయలసీమ వాసులను అవమానించడమే అన్నారు. కేంద్రప్రభుత్వం విభజన చట్టంలో ప్రతిష్టాత్మక సంస్థలు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రధాన కార్యాలయాలు, శాసనసభ, శాసన మండలి లాంటి సంస్థలను అమరావతిలో పెట్టడం అంటేనే రాయలసీమను అవమానించడం అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి ఉండాల్సిన అవసరం రాయలసీమకు ఏమిటని ప్రశ్నించారు. మన్నవరం ప్లాంట్, నందలూరు రైల్వేలోకో షెడ్, కర్నూలు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, అనంతపురానికి రైల్వేజోన్ ఇవ్వకుండా రాయలసీమ వాసులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దగా చేస్తున్నాయన్నారు. ఇవిగాక సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్, క్యాన్సర్ ఆసుపత్రి లాంటివి రాయలసీమకు దక్కకుండా చేశారన్నారు. నీళ్లులేక, ఉపాధిలేక, పౌష్టికాహారం లేక, చదువులేక వలసలతో కరవులతో ఆత్మహత్యలకు నిలయంగా రాయలసీమ మారిపోయిందన్నారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలకు నిలయమైన రాయలసీమ ప్రాంతం ఈరోజు తన బాషను, యాసను అవమాన పరుస్తూ ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయన్నారు. ఈ అన్యాయాలను భరించే ఓపిక , సహనం రాయలసీమవాసులకు లేదని, అందుకే మాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.