కడప

ఆది.. రమేష్‌ల ప్రచ్ఛన్న పోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 21: మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడుల మధ్య చెలరేగిన ప్రచ్ఛన్నపోరు సోమవారం ప్రత్యక్ష యుద్ధంగా మారుతుందని రాజకీయ విశే్లషకులు, తెలుగుదేశం పార్టీ వర్గాలు భావించాయి. అయితే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముందస్తుగా చేసిన మంతనాలు, జరిపిన చర్చల ఫలితంగా సోమవారం పులివెందులలో జరిగిన జిల్లా మహానాడు ప్రశాంతంగా ముగిసింది. కాగా జిల్లాలో మంత్రి ఆదినారాయణరెడ్డి, సిఎం రమేష్‌నాయుడుల మధ్య ప్రచ్ఛన్న పోరు ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విడిగా జరిగిన మినీ మహానాడులో సిఎం రమేష్‌నాయుడు సోదరుడు సురేష్‌నాయుడు పాల్గొనడమే కాకుండా అదే సభలో మంత్రి ఆదినారాయణరెడ్డిపై ప్రత్యక్ష విమర్శలకు దిగారు. మంత్రి ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి ఆర్థికంగా బలపడి పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని సురేష్‌నాయుడు బహిరంగంగానే ఆదినారాయణరెడ్డిపై విమర్శల అస్త్రాన్ని సంధించారు. ఆదినారాయణరెడ్డి సొంత నియోజకవర్గంలో వ్యతిరేకంగా ఉన్న రామసుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన మినీ మహానాడులో రమేష్‌నాయుడు సోదరుడు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేయడం, అంత వరకు చాప కింద నీరులా ఉన్న తెరపైకి తెచ్చినట్లయింది. ఈ పరిణామం తరువాతనే పోరుమామిళ్లలో ఎమ్మెల్యే జయరాములు, విజయజ్యోతి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలు మంత్రి ఆదినారాయణరెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వీటిపై ఆదివారం జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడులో మంత్రి ప్రత్యక్షంగానే వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా సిఎం రమేష్‌నాయుడు సోదరులపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే పేరు చెప్పకుండా పరోక్షంగా చేసినా, ఈ వ్యాఖ్యలు పార్టీలో మరింత గ్రూపు విబేధాలను పెంచాయి. ఇప్పుడు జిల్లాలో ఆదినారాయణరెడ్డి గ్రూపు, సిఎం రమేష్‌నాయుడు గ్రూపు అన్నట్లుగా స్పష్టంగా విడిపోతున్నాయి. అయితే పార్టీలోను, ప్రజల్లోను మంత్రి ఆదినారాయణరెడ్డి వైపే మొగ్గు ఉందని పార్టీ వర్గాలే కాకుండా రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో రాజకీయంగా బలమైన పునాదులతో రెడ్డి సామాజికవర్గం ఉండటం, కమ్మ సామాజికవర్గంలో అటు ప్రజలు కానీ, ఇటు నాయకులు కానీ వేళ్ల మీద లెక్కపెట్టకలిగిన కుటుంబాలు మాత్రమే ఉండటం దీనికి కారణంగా విశే్లషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికలలో సిఎం రమేష్‌నాయుడుకు ఎన్నికల బాధ్యతలను అప్పజెప్పగా జిల్లాలో ఒక్క రాజంపేట నియోజకవర్గంలో మేడా మల్లిఖార్జునరెడ్డి మినహా 9 నియోజకవర్గాలు వైఎస్‌ఆర్‌సీపీ పరమయ్యాయి. సిఎం రమేష్‌నాయుడు అసమర్థత వల్లే మరో మూడు, నాలుగు నియోజకవర్గాలు చేజారిపోయాయని అప్పట్లో రాజకీయ విశే్లషకుల్లో వెలువడ్డాయి. ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వచ్చిన తరువాత జరిగిన స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీటెక్ రవిని వైఎస్ వివేకానందరెడ్డిపై గెలిపించారు. ఈ రాజకీయ పరిణామాల తరువాత మంత్రి ఆదినారాయణరెడ్డి పార్టీలో బలపడ్డారు. సిఎం రమేష్‌నాయుడు రెండోసారి రాజ్యసభ స్థానాన్ని పొంది పార్టీ అధిష్ఠానం వద్ద తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో ఇరువురి మధ్య ప్రచ్ఛన్నపోరు ప్రారంభమై అది ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షానికి మారుతుందని భావిస్తున్న తరుణంలో జిల్లా మినీ మహానాడుకు ఇద్దరూ హాజరయ్యారు. ఈ కారణంగానే సోమవారం పులివెందుల నియోజకవర్గంలో జరిగిన జిల్లా మహానాడులో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సిఎం రమేష్‌నాయుడుల వర్గాల మధ్య ప్రత్యక్ష గొడవ జరుగుతుందని పార్టీ వర్గాలే భావించాయి. అయితే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సోమవారం ఉదయమే జిల్లా కేంద్రమైన కడపలో విడివిడిగా మంత్రితోను, సిఎం రమేష్‌తోను మంతనాలు జరిపి ప్రస్తుతానికి వారిద్దరినీ శాంతపరిచినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి జిల్లా మహానాడు ప్రశాంతంగా ముగిసింది. అయితే ఎన్నికలు సమీపించే కొద్దీ తమ తమ వర్గీయులకు టికెట్లు ఇప్పించుకోవడంలోను, ప్రచారం చేసి గెలిపించుకోవడంలోను, పార్టీలోనే అవతలి వర్గం వారిని ఓడించంలోను అనేక రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధాలు ప్రారంభం కావడం ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.