కడప

రాజంపేటకు ఉప ఎన్నిక వచ్చేనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, మే 22: ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీలు గత నెలలో ఇచ్చిన రాజీనామాల అంశం ప్రస్తుతం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చర్చానీయాంశంగా మారుతోంది. రాజీనామాలు ఇచ్చిన వైసీపీ ఎంపీల జాబితాలో రాజంపేట పార్లమెంటు సభ్యులు పి.మిథున్‌రెడ్డి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 29న రాజీనామాలు సమర్పించిన ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ నుండి పిలుపు రావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎంపీల రాజీనామాలు ఆమోదించేందుకే చివరిసారిగా ఎంపీల నుండి స్వయంగా అభిప్రాయాలు తెలుసుకునేందుకే స్పీకర్ పిలిచిందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఎంపీల రాజీనామాలు ఆమోదింపబడితే ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్న అంశంలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వివిధ రాజకీయాపక్షాలు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలకు ఏడాది కూడా గడువు లేనందున ఒకవేళ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఎంపీల రాజీనామాలు అమోదించబడితే ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో భాగంగానే ఇటీవల జరుగుతున్న మినీ మహానాడులలో తెదేపా శ్రేణులు, మంత్రులు సైతం ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటిస్తుండడం తదితర పరిణామాలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుటోంది. వైసీపీ శ్రేణులు సైతం ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటిస్తుండడం కూడా ఈ రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. స్పీకర్ పిలుపుతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉప ఎన్నికల అంశానికి సంబంధించి భిన్నకోణాల్లో చర్చలు సాగుతున్నాయి. ఉప ఎన్నికలు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశంపై కూడా ప్రధాన పక్షాలైన అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీ పార్టీలు ఆలోచన చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపంలోనే ఉన్న నేపథ్యంలో రాజీనామాలు సమర్పించిన ఎంపీల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా అన్న అంశంపై ఏ రాజకీయపక్షం నుండి స్పష్టమైన అభిప్రాయం వెలువడడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చే ఉప ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి ఎడెనిమిది నెలలకు మించి గడువు ఉండదని, ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు ఇప్పడు ఎదుర్కొని, తిరిగి వెంటనే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావడంపై ఈ రెండుపార్టీల నేతలు భిన్నరీతుల్లో స్పందిస్తున్నారు. కాగా ఉప ఎన్నికలు వచ్చిన పక్షంలో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకునే అవకాశాలున్నందున హోరాహోరీగానే ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికలు జరిగితే ఇందుకు భారీగానే డబ్బులు కూడా ఖర్చయ్యే పరిస్థితులే ప్రస్తుతం ఆయా పార్టీల్లో ముఖ్యనేతల్లో గుబులు పుట్టిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఏ మాత్రం ఉత్సాహం చూపుతారన్న అంశాలపై కూడా చర్చలు సాగుతున్నాయి. ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కూడా అర్థం కాని విధంగా రాజకీయ పరిస్థితులున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ, పవన్ జనసేనలు ఐకమత్యంగా పోటీ చేయడం జరిగింది. అయినప్పటికి వైసీపీ అభ్యర్థి పి.మిథున్‌రెడ్డి ఘన విజయం సాధించడం జరిగింది. ఇప్పుటి పరిస్థితుల్లో జనసేన, బీజేపీలతో తెలుగుదేశం పార్టీ బంధం విడిపోయింది. ఆ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానం బీజేపీకి కేటాయించడంతో స్వర్గీయ ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధ్రీశ్వరి పోటీ చేశారు. ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, ఒక వేళ పోటీ చేసే పక్షంలో తిరిగి దగ్గుబాటి పురంధ్రీశ్వరిని రంగంలోకి దింపుతుందా అన్న అంశంకు కూడా ప్రాధాన్యత ఉంది. అలాగే జనసేన పార్టీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందా అన్న అంశానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఏది ఏమైనా ఎంపిల రాజీనామా, స్పీకర్ పిలుపు తదితర అంశాలు రాజకీయ అంశాల నేపథ్యంలో రానున్న మరో పదిరోజుల్లో ఉప ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది. అప్పటి వరకు ఇక్కడి రాజకీయ పరిస్థితులను ఊహించి ఇప్పుడే చెప్పడం కూడా కష్టమవుతుంది. ఉప ఎన్నికలు వచ్చిన పక్షంలో రాజంపేట రాజకీయాల్లో సమీకరణలు వేగంగా మార్పులు, చేర్పులు దిశగా వెళ్ళే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. అంతకు మించి ఉప ఎన్నికలు వస్తే వైసిపి తప్పనిసరిగా తాము రాజీనామాలు సమర్పించిన స్థానంలో ఉప ఎన్నికలు ఎదుర్కొనే పరిస్థితులుంటాయి కనుక ఆ స్థానాలను నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ ప్రజల్లో పట్టుందని నిరూపించుకోవాలంటే ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉంది. అలాగే బీజేపీ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే పక్షంలో పోటీ ప్రభావం ఎలా ఉండబోతుందన్నది కూడా రాజకీయంగా ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే జనసేన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా సంస్థాగతంగా నిర్మాణం లేకపోవడం వల్ల జనసేన ఉప ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఎంపిల రాజీనామాల అంశం మరోమారు ముఖ్యంగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాజకీయంగా దుమారం రేపనుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే దాదాపుగా సీమకు చెందిన కడపజిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు చిత్తూరు జిల్లాలోని 70శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఒక రకంగా ఉప ఎన్నికలు రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా కూడా రాజకీయంగా చర్చకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నగర అభివృద్ధికోసం పాదయాత్రలు
* ఆర్‌సీపీ నగర కార్యదర్శి మగ్బుల్‌బాషా
కడప సిటీ,మే 22: కడప నగరంలోని సమస్యలు, వెనుకబడిన ప్రాంతాల్లోని ఇబ్బందులు తెలుసుకునేందుకు 50డివిజన్లలోనూ ఈనెల 24వ తేది నుంచి 29వరకు రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి ఎస్.మగ్బుల్‌బాషా చేస్తున్న పాదయాత్రలు విజయవంతం చేయాలని మంగళవారం ఆయన కోరారు. నగరంలోని ఆర్‌సిపీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, పాలక మండలి అసలు కడలో ఉన్నట్లా లేదా అన్న విధంగా పరిపాలన సాగుతోందన్నారు. కార్పొరేషన్ అధికారంలోకి వైసీపీ వచ్చి నాలుగుసంవత్సరాలు అవుతున్నా, ఇప్పటివరకు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఈరోజువరకు మురికికాలువలు, రోడ్లు, మంచినీటి పైపులైన్లు, వీధిలైట్లు లాంటి పలు సమస్యలు తీరలేదన్నారు. ఇండ్లస్థలాలు ఇస్తామని, జన్మభూమి కార్యక్రమాలు, రచ్చబండ కార్యక్రమాల్లో అర్హులకు ఇచ్చిన స్థలాలను ఇప్పటి వరకు చూపలేదన్నారు. అందుకే పేదల కాలనీల్లో ఉన్న అనేక సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుని అవసరమున్న అన్నిచోట్ల అధికారులను నిలదీసేందుకు ఈపాదయాత్రలు ఎంతో దోహదపడుతాయన్నారు. నగరంలోని బిస్మిల్లానగర్, కట్టకింద హరిజనవాడ, నకాష్, ఖలీల్‌నగర్, గౌస్ నగర్, గరీబ్‌కుంట, ఆర్‌కెనగర్, తిలక్‌నగర్, బిఎస్పీ నగర్, పిఎస్ నగర్, ఇంద్రనగర్, సరోజినీ నగర్, శివానందపురం, ఎన్‌టిఆర్ నగర్, ప్రకాష్‌నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, అక్కాయపల్లె, భగత్‌సింగ్‌నగర్, రాజీవ్‌గాంధీ కాలనీ లాంటి కాలనీల్లో వివిధ సమస్యలు తెలుసుకుని తిరిగి అధికారుల దృష్టికి తీసుకెళ్లి నివారణకోసం కృషి చేస్తామని, అందులో భాగంగా 30వ తేదిన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో నగర ఆర్‌సీపీ నగర కార్యదర్శి వర్గిం, లక్ష్మీదేవి, తస్లీమ్, తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.