కడప

ప్రత్యేక రాయలసీమ దిశగా తొలి అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 22: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, విడిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోనూ రాయలసీమపై కొనసాగుతున్న వివక్షకు పరిష్కారం కేవలం రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటమేనని, అందుకోసం తమ పార్టీ ఉద్యమిస్తుందని ప్లీనరీలో ప్రకటించిన రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ తొలి అడుగులు వేస్తోంది. సోమవారం, మంగళవారం రాయలసీమలోని అన్ని మండలాల్లో తహశీల్దార్లకు వినతిపత్రం ఇవ్వడంతో తొలి అడుగు ప్రారంభించింది. సోమవారం, మంగళవారాల్లో రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ నేతలు తహశీల్దార్ల కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసి వినతిపత్రాలు సమర్పించారు.
రాయలసీమకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని, భాషాప్రయుక్త రాష్ట్రంగా తెలుగువాళ్లకు ఒక రాష్ట్రం కావాలని ఉద్యమించేసమయంలో రాయలసీమ నేతలను కలుపుకుని పోయేందుకు చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే అసంతృప్తి ఎప్పటి నుండో రాయలసీమలో ఉంది. తొలిసారి 1928లోనే ప్రత్యేక రాయలసీమ నినాదం పుట్టింది. కోస్తాంధ్రులతో తాము ఎన్నటికీ కలిసివుండలేమని, వారి మనస్తత్వాలకు, రాయలసీమ వారి మనస్తత్వాలకు కుదరదని అప్పట్లోనే పప్పూరి రామాచారులు, రామకృష్ణారెడ్డిలాంటి వారు నిరసన గళం విప్పారు. రాయలసీమ నేతలను బుజ్జగించేందుకు శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. రాజధాని కానీ, హైకోర్టు కానీ రాయలసీమ వాసులు ఏది కోరుకుంటే అది సీమలో ఏర్పాటుచేయాలని, సాగునీటి అవసరాలను తీర్చడంలో రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని ఇలా కొన్ని షరతులకు ఒప్పుకుని, కోస్తానేతలు శ్రీబాగ్ ఒడంబడికపై సంతకాలు చేశారు. అయితే 1953లో ఏర్పడిన ఆంధ్రరాష్ట్రంలో కర్నూలు రాజధానిగా ప్రకటించినప్పుడే , కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. శ్రీబాగ్ ఒప్పందాన్ని అప్పుడే తూలనాడుతూ ప్రకటనలు చేశారు. ఆ తర్వాత 1956లో తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తర్వాత రాజధాని తరలిపోయింది. హైకోర్టూ రాలేదు. సాగునీటిప్రాజెక్టుల్లో ప్రాధాన్యత లభించలేదు. అంతకుముందు తమిళుల మీద వ్యతిరేకతతో రాయలసీమకు ప్రయోజనం చేకూర్చే కృష్ణ-పెన్నా ప్రాజెక్టును వదులుకున్నందుకు ప్రత్యామ్నాయంగా నిర్మించాల్సిన సిద్దేశ్యరం ప్రాజెక్టునూ నిర్మించలేదు. అడుగడుగునా దగా జరిగిందనే అసంతృప్తి రాయలసీమవాసుల్లో గూడుకట్టుకుని, 1980వ దశకంలో ఉవ్వెత్తున లేచింది. ఆ పదేళ్లలో జరిగిన ఉద్యమ ఫలితంగా తెలుగుగంగ ప్రాజెక్టు నుండి రాయలసీమకు నీళ్లు, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులతోపాటు అనేక చిన్నప్రాజెక్టులు శంకుస్థాపన జరుపుకున్నాయి. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు వీటిని పూర్తిచేయడంలోనూ, నీటిని కేటాయించడంలోనూ మళ్లీ యధాప్రకారం వివక్షనే ప్రదర్శించాయి.
రాష్ట్రం విడిపోయి తిరిగి 1953 నాటి ఆంధ్రరాష్ట్రం మిగిలినా, శ్రీబాగ్ ఒప్పంద ఊసులేదు. పైగా అంతకుముందుకన్నా రాయలసీమపై వివక్ష, సీమ సంస్కృతిపై అధికారంలో ఉన్నవారే వ్యంగ్యంగా మాట్లాడటం అధికమైంది. 1980వ దశకంలో ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోయిన ఎం.వి.మైసూరారెడ్డి, ఎంవి రమణారెడ్డి లాంటి ఆతరం నాయకులు రాయలసీమ వ్యాప్తంగా అసహనంతో ఉన్నారు. వీళ్లందరి అసహనాన్ని తెలుసుకున్న తర్వాత రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ , ఇక ప్రత్యేక రాయలసీమ రాష్టమ్రే సీమ అభివృద్ధికి పరిష్కారమని ప్రకటించింది. తొలి అడుగుగా ఈ రెండురోజులూ రాయలసీమ వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో నిరసనలు వ్యక్తం చేసి, రాయలసీమ ఏ రకంగా వివక్షకు గురై దగాపడిందో తెలియజేస్తూ వినతిపత్రాలు సమర్పించింది. జూన్‌నెలలో అన్ని జిల్లాల్లోనూ జిల్లా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాత రాజకీయపార్టీలకు అతీతంగా ఉద్యమ నేపధ్యం ఉన్న , అవగాహన ఉన్న నేతలనూ , మేధావులను, ఇంజనీర్లతో ఒక రాష్టమ్రహాసభ ఏర్పాటుచేయాలని సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రోజున, రాయలసీమ రాష్టస్రాధనదీక్ష చేపట్టాలని నిర్ణయించింది. గ్రామాలు తిరిగి ప్రజలకు దీనిపై అవగాహనపెంచే కార్యక్రమాలు చేపట్టాలని, అందుకు తమ పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నామని ఆపార్టీ రాష్టక్రార్యదర్శి రవిశంకర్‌రెడ్డి అంటున్నారు. ఏది ఏమైనా రాయలసీమ వ్యాప్తంగా అంతర్గతంగా ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని బయటకు తెచ్చే నేతలు లేక రాయలసీమవాదం మరుగునపడి ఉందన్నది వాస్తవం. ఆ పనిని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చేపట్టింది. ఎంతవరకు విజయవంతవౌతుందో కాలమే తేలుస్తుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.