కడప

వ్యర్థపదార్థాల గోడౌన్ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు, మే 24: చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె పరిధిలో టోల్‌గేట్ వెనుకభాగంలో రుద్రభారతిపేట పొలాల్లో గురువారం మద్యాహ్నం వ్యర్థపదార్థాల నిల్వవుంచే గోడౌన్ దగ్ధం కావడంతో రూ.20లక్షలు పైబడి ఆస్తినష్టం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వ్యర్థపదార్థాలైన ప్లాస్టిక్, అట్టలు, పేపర్లు, పాత ఇనుపసామాన్లు తదితర వాటిని కడప నగరపరిధిలో సేకరించి గోడౌన్‌లో నిల్వ ఉంచారు. అయితే వీటిని కొద్దిరోజుల్లోనే లారీల ద్వారా తరలించేందుకు సిద్దం చేసివుండగా పరిసర ప్రాంతాల్లో వరిపొలాల్లో వరిగడ్డి ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులు వరిగడ్డికి నిప్పుపెట్టడంతో మంటలు గోడౌన్ వరకు వ్యాపించి గోడౌన్ పూర్తిగా తగలబడిపోయింది. గోడౌన్‌లో ఉన్న వ్యర్థపదార్థాలు పూర్తిగా కాలిపోగా గోడౌన్ ఆవరణంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, వైర్లు, రెండుమోటార్ సైకిళ్లు, కటింగ్ మిషన్లు ఇతర సామాన్లు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే గోడౌన్ యజమాని ఎం.సురేష్ అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో మంటలు ఆర్పేప్రయత్నం చేశారు. కడప నుంచి రెండు అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపుచేశాయి. అప్పటికే గోడౌన్‌లో ఉన్న వ్యర్థపదార్థాలు పూర్తిగా కాలిపోయాయి. కొన్నినెలల నుంచి వ్యర్థపదార్థాలు సేకరించి నిల్వవుంచడం జరిగిందని గోడౌన్ యజమాని సురేష్ తెలిపారు. అయితే తమకు రూ.50లక్షలు వరకు నష్టం జరిగిందని ఆయన విలేఖర్ల ఎదుట వాపోయారు. విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ సత్యానందం, రెవెన్యూ సిబ్బంది సంఘటనస్థలానికి చేరుకున్నారు. చెన్నూరు పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. గోడౌన్ దగ్ధం కావడంపై ఆరా తీశారు. ఈమేరకు రెవెన్యూ అధికారులు నష్టం అంచనావేశారు. గోడౌన్ కాలిపోవడంతో యజమాని కన్నీటిపర్యంతమయ్యారు.