కడప

అజెండా పక్కకు ...పార్టీల జెండాలు ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 24:‘ మీ పార్టీవారు ప్రోటోకాల్ పాటించడంలేదు, అధికారపార్టీ నేతలే సర్వం తామేఅన్నట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులలో మా అధినేత ఇచ్చిన నిధులతోనే పనులు చేశారు. మీరు చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు’ అని వైసీపీ, ‘ప్రోటోకాల్‌ను మీరే ఉల్లంఘిస్తున్నారు. ప్రాజెక్టులను మేము పూర్తిచేసి నీళ్లు ఇస్తున్నాము కాబట్టే చెప్పుకుంటున్నాం’ అని తెలుగుదేశం, ఇలా ఎవరికివారుగా సొంతపార్టీల వాణి..సొంతబాణితో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మూడుగంటలపాటు అజెండాకు సంబంధం లేకుండా పార్టీనేతల సొంత అజెండాతో నడిచింది. ఆనవాయితీగా, వైసీపీకి చెందిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రభుత్వ, అధికారులపై ఆరోపణలు, దానికి తెలుగుదేశానికి చెందిన జడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీకి అంతాతానే అన్నట్లు జవాబులు ఇవ్వడం- ఈసమావేశంలోనూ జరిగింది. ఆ తర్వాత జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశపు అజెండా చర్చకు వచ్చే సమయానికి అధికారుల ప్రసంగంతో, నేతల అనాసక్తి, గైర్హాజర్లతో 3మమ2 అనిపించారు. గురువారం కడపలోని జిల్లా పరిషత్ హాల్‌లో జడ్పీ చైర్మన్ గూడూరు రవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఉదయం 10.30గంటలకు ప్రారంభమైంది. ప్రారంభం కాగానే గాలివీడు జడ్పీటీసీ లక్ష్మి మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఇటీవల మార్కెట్ కాంప్లెక్స్‌ను ఏర్పాటుచేశారని, ఎవరి పేర్లు వేయకుండా ఎంత ఖర్చయ్యిందో చూపించకుండా, ఎవరినీ పిలవకుండా ప్రారంభించారని, దీనిపై గత సమావేశం నుండి తాను ఎన్నిసార్లు అధికారులను అడిగినా పట్టించుకోలేదని, తాము అడిగితే వైసీపీ వారికి చెప్పాల్సిన పనిలేదని కొంతమంది అధికారులు వ్యాఖ్యానించారని ఆరోపించారు. దీంతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రొద్దుటూరులో తనను పిలవకుండానే మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డితో అనేక అధికారిక కార్యక్రమాలు చేస్తున్నారని, ఏ పదవిలో లేనివ్యక్తి పేరు శిలాఫలకంలో వేస్తున్నారని, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తానేనా అన్న అనుమానం తనకు కలుగుతోందన్నారు. ఇటీవల పెన్షన్లు పంపిణీ సైతం మాజీ ఎమ్మెల్యేలను మాత్రమే పిలిచి తనను పట్టించుకోలేదన్నారు. ఇలా అధికారపార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి తెలుగుదేశానికి చెందిన సింహాద్రిపురం జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి కలుగచేసుకుని తమ మండలంలో ఇటీవల ఎంపీ అవినాష్‌రెడ్డి రోడ్డు నిర్మాణం చేపట్టి, దానికి తన పేరు, వివేకానందరెడ్డి పేరు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుప్రసాదరెడ్డి పేరు వేశారని, దీన్ని కూడా పరిశీలించాలని వ్యాఖ్యానించారు. ఇటీవల తమ ప్రాంతంలో 34 శిలాఫలకాలు ప్రారంభించామని, ఇందులో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా చేర్చామన్నారు. ఇంతలో బద్వేలు ఎమ్మెల్యే జయరాములు జోక్యం చేసుకుంటూ బద్వేలు నియోజకవర్గంలో అనేక పనులు చేస్తున్నా, ఎక్కడ శిలాఫలకాలు పెట్టడం లేదని అన్నారు. దీంతో ఈసమావేశంలో ఎక్కడ ఏకార్యక్రమం చేసినా ఆ ప్రాంతవాసుల, నేతల ప్రోటోకాల్ పెట్టాలని రాచమల్లు డిమాండ్‌చేస్తూ ఆ మేరకు తీర్మానం చేయాల్సిందిగా జడ్పీ చైర్మన్‌ను కోరారు. కలెక్టర్ హరికిరణ్ జోక్యం చేసుకుంటూ ప్రోటోకాల్ ప్రతి అధికారి పాటించాల్సిందేనని, ప్రధానంగా ఇంజనీరింగ్‌శాఖ అధికారులు దీనిపై దృష్టిసారించాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా డీఆర్వోకు ఫిర్యాదుచేయాలని కలెక్టర్ సూచించారు. అనంతరం బద్వేలు నియోజకవర్గంలోని బి.కోడూరు మండలంలో సబ్‌స్టేషన్‌లో సిబ్బంది నియామకంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, ఇందులో రిజర్వేషన్లు పాటించకుండా, కాంట్రాక్టర్ పెద్దఎత్తున డబ్బులు తీసుకుని ఉద్యోగాలు వేశారన్నారు. దీనిపై రాచమల్లు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న పార్టీకి రెండు పోస్టులు, ప్రతిపక్షపార్టీకి రెండు పోస్టులు వంతున సబ్‌స్టేషన్లలో కేటాయించారని, ఇప్పుడు పూర్తిగా అధికార పార్టీనే వీటిని నియమిస్తోందని ఆరోపించారు. దీనిపై ప్రభాకర్‌రెడ్డి జోక్యంచేసుకుంటూ డబ్బులు తీసుకుంటున్నారన్న వాస్తవాలు నిరూపించాలని, కాంట్రాక్టర్లు వారు ఇష్టానుసారం వేసుకుంటారని, దానికి రుజువులేకుండా మాట్లాడవద్దంటూ అడ్డుతగిలారు. జడ్పీ చైర్మన్ గూడూరు రవి జోక్యం చేసుకుని ప్రతిదానికి నువ్వుసమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో గూడూరు రవికి, ప్రభాకర్‌రెడ్డికి మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే జయరాములు మాట్లాడుతూ ఇక్కడ అక్రమాలు జరిగాయని, తనవద్ద రుజువులు ఉన్నాయని, తాను కూడా తెలుగుదేశంపార్టీ వాడినేనని, తనను కూడా నిర్లక్ష్యం చేయడంతగదని ప్రభాకర్‌రెడ్డిని ఉద్దేశించి నిరసన స్వరం వినిపించారు. కలెక్టర్ జోక్యం చేసుకుంటూ సబ్‌స్టేషన్‌లో అక్రమాలపై విచారణ జరిపించారా అని విద్యుత్ ఎస్‌ఇని ప్రశ్నించగా, విజిలెన్స్‌కు రాశానని ఎస్‌ఇ సమాధానం ఇవ్వడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా లింగాల ప్రాంతంలో లింగాల చెరువుకుమాత్రమే నీరు ఇవ్వకుండా మిగతా చెరువులకు నీరు ఇచ్చారని, లింగాల జడ్పీటీసీ అనసూయమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జిఎన్‌ఎస్‌ఎస్ అధికారులు జోక్యం చేసుకుంటూ త్వరలో ఈపనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. కానీ తమకు తాగునీటికి కూడా ఇబ్బందిగా ఉందని ఆమె ఆందోళన చేయగా, ప్రభాకర్‌రెడ్డి కలుగచేసుకుంటూ లింగాల మండలంలో అన్ని చెరువులకు నీరు ఇచ్చామని, సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల ఈప్రాంతానికి నీరు అందించలేదని వెల్లడించగా, ఇంతలో రాచమల్లుప్రసాదరెడ్డి అడ్డుపడుతూ పైడిపాలెం రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పెద్దఎత్తున నిధులుఇస్తే ఇప్పుడు రూ.20కోట్లు ఇచ్చి ప్రాజెక్టునుపూర్తిచేసి తాము పూర్తిచేసినట్లు తెలుగుదేశం నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, జిల్లా వ్యాప్తంగా తాగునీటికి తీవ్రస్థాయిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు ఇచ్చారన్న సంగతి వాస్తవమేనని, తాము అధికారంలోకి వచ్చాక ఈప్రాజెక్టును పూర్తిచేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మద్యాహ్నం 1.30గంటల వరకు ఇదే వాగ్వివాదం కొనసాగుతుండటంతో విధిలేక సమావేశాన్ని మద్యాహ్నానికి చైర్మన్ వాయిదా వేశారు.