కడప

ఒమేగా ఆసుపత్రిలో క్యాన్సర్‌కు అత్యాధునిక వైద్యచికిత్సలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప కల్చరల్,మే 26: కర్నూలు నగరంలోని ఒమెగా ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధి నివారణకు అత్యాధునిక వైద్యచికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఒమెగా హాస్పిటల్స్ డైరెక్టర్ , ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ వైద్యులు) డాక్టర్ వై.వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం కడపలోని తిరుమల ఆసుపత్రిలో నిర్వహించిన క్యాన్సర్ వైద్య శిబిరంలో పలువురిని పరీక్షించి , తగు వైద్యసలహాలు, సూచనలు, అవసరమైన వారికి ప్రాధమిక చికిత్సలు అందజేశారు. శనివారం నిర్వహించిన వైద్యశిబిరంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుడూ క్యాన్సర్‌కు శస్తచ్రికిత్స, హీమోథెరపీ, రేడియా థెరపీ ద్వారా మూడు పద్దతుల్లో చికిత్సలు అందించవచ్చునన్నారు. కడప జిల్లా ప్రజలకు క్యాన్సర్ వైద్యసేవలు అందించేందుకు రావాలని తిరుమల ఆసుపత్రి చైర్మన్ డా.పి.సురేంద్రబాబు ఆహ్వానం మేరకు కడపకు వచ్చి ఇక్కడి క్యాన్సర్ బాధితులకు రెండురోజులపాటు చికిత్సలు అందజేస్తున్నామన్నారు. ప్రతినెలా 4వ శనివారం, ఆదివారాల్లో తిరుమల ఆసుపత్రిలో అందుబాటులో ఉంటానని తెలియజేశారు. అధికంగా బరువు ఏర్పడటం, ఆకలి కాకపోవడం, దదగ్గు తగ్గకుండా ఉండటం, (స్ర్తిలలో) తెల్లమైలలు, రొమ్ములో గడ్డలు ఉండటం, క్యాన్సర్ లక్షణాలని తెలిపారు. అలాగే గొంతు బొంగురు పోవడం, మల మూత్రాలలో మార్పు, బ్లీడింగ్ తదితర లక్షణాలు కన్పిస్తాయన్నారు. అలవాట్లు, వ్యసనాలు, వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వ్యాధి వస్తుందన్నారు. ప్రధానంగా తెల్లరేషన్‌కార్డు, ఇహెచ్‌ఎస్ కార్డులు, ఆరోగ్యరక్ష, వర్కింగ్ జర్నలిస్టులకు ఉచితంగా సర్జరీలు చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఒమేగా ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ షేక్షావలి, తిరుమల ఆసుపత్రి ఇన్‌చార్జి రాజశేఖర్‌నాయుడు, నర్సింగ్ సూపరింటెండెంట్ టిఎన్ సుబ్బమ్మ, ఒమెగా ఆసుపత్రి జిల్లా సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ ఆరిఫ్ అలి తదితరులు పాల్గొన్నారు.