కడప

మహిళల అక్రమ రవాణాను అరికడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంబేపల్లె, ఏప్రిల్ 28:మహిళల అక్రమరవాణాను అరికడదామని జిల్లా న్యాయ సహాయ ప్రాధికారిత సంస్థ కార్యదర్శి ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మండల సమాఖ్య కార్యాలయంలో న్యాయవిజ్ఞాన సదస్సులో మహిళల అక్రమరవాణా-నివారణా పథకంపై అవగాహనా సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ పరిధిలో రాజీపడాల్సిన కేసులను లోక్‌అదాలత్ ద్వారా ఇరువర్గాలకు న్యాయాన్ని వివరించి రాజీ చేసే అంశమే ఈ లోక్‌అదాలత్‌లో ముఖ్యమైన పని అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, ప్రజ్వల న్యాయసేవా సంస్థ ద్వారా ఏడు స్కీంలను ప్రతిపాదించిందని ఇందులో ముఖ్యంగా మనుషుల అక్రమరవాణాకు సంబంధించి 1956 ఇమ్మోర్టల్ యాక్టు ప్రకారం లాభ ఉద్దేశ్యంతో మనుషులను రవాణా చేయడమనేది చట్టరీత్యా నేరం, ఇలాంటి సంఘటనలు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయన్నారు. గ్రామీణుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని పెట్టుబడిగా చేసుకుని మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని, ఇలాంటి సంఘటనలు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరమని, ఈ సంఘటనలను తమ ధృష్టికి తెస్తే న్యాయ సహాయం ఉచితంగా అందించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. అనంతరం ఐసీపీఎస్ అధికారి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్లు నిండని బాలురు చదువు మానేసి ఉంటే తమ ధృష్టికి తెస్తే వారికి చదువుతో పాటు వృత్తి విద్యలను నేర్పించడానికి జిల్లాలో పలు స్వచ్ఛంధ సంస్థలు, సంక్షేమ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామ పరిసరాలలో ఉండే వ్యక్తులు అలాంటి పిల్లలను చేర్పించడానికి ముందుకు రావాలని తెలిపారు. భారతరత్న మహిళా మండలి ప్రెసిడెంట్ సరస్వతమ్మ మాట్లాడుతూ మహిళలు చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, అత్యాచార బాధితులు తదితర అంశాలలో మహిళలు ప్రతి చోటా వివక్షతకు గురవుతూ అవమానభారంతో కుంగిపోతున్నారని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘ సభ్యులైన వీరు ఇలాంటి వ్యక్తుల గురించి సమాచారం అందిస్తే వారికి తగినంత సహాయం చేయడానికి మరియు ప్రభుత్వ పథకాల ద్వారా జీవనోపాధి కల్పించడానికి తమ సంస్థ పాటుపడుతుందన్నారు. అనంతరం జెండర్ ఏపీఎం వసుంధర మాట్లాడుతూ 1,626 మంది నిస్సహాయ మహిళలు ఉన్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘ సభ్యులు కుటుంబాన్ని ఆర్థికంగా ఎదుగుదల చేసేందుకు స్వయం ఉపాధి కోసం ఎన్నో రకాల శిక్షణలను అందిస్తోందన్నారు. ఇందులో భాగంగానే కుట్టుశిక్షన, అగరబత్తీలు, క్యాండిళ్లు, పచ్చళ్లు, ఊరగాయలు వంటి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థికంగా ప్రభుత్వం చేయూతనందిస్తోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబంలోని మిగతా సభ్యులను ఏదో ఒక పనిలో శిక్షణను ఇప్పించి ఆర్థికంగా ఎదుగుదలకు వెలుగు సంస్థ ఎంతో తోడ్పాటును అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చంద్రమ్మ, ఎంపీడీఓ రమేష్‌బాబు, ఏపీఎం నిరంజన్, సీసీలు, వెలుగు సిబ్బంది, మహిళా సంఘ సభ్యురాళ్లు పాల్గొన్నారు.