కడప

ఉక్కు ఫ్యాక్టరీని రాజకీయం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, జూన్ 14: ఉక్కు ఫ్యాక్టరీని రాజకీయ కోణం చేయొద్దని, రాజకీయాలకతీతంగా తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చెయాలని స్టీల్ ఫ్లాంట్ సాధన సమితి అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక టీబీ రోడ్డులోని ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీని రాజకీయ కోణం చేయవద్దని పేర్కొన్నారు. గతంలో రాష్టప్రతి ఎన్నికల సందర్భంగా టీడీపీ, వైసీపీ కలిసి ఒకే అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపించిన చందంగానే జిల్లాలో స్టీల్ ఫ్లాంట్ కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసి సాధించి పెట్టాలని వివరించారు. గత 2 సంవత్సరాల నుండి బిజేపి వారిని రాజకీయ డ్రామాలు ఆపాలని, ఉక్కు ఫ్యాక్టరీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరితే, తనను అవహేళన చేశారని వాపోయారు. గతంలో ఎబీఎంహెచ్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు వెంకయ్యనాయుడు భారత ఉపరాష్టప్రతి హోదాలో ప్రొద్దుటూరుకు వచ్చారని, ఆ సందర్భంలో పలువురు స్థానిక తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు కూడా ఉపరాష్టప్రతి ఛాంబర్‌లో మీటింగ్‌లో పాల్గొని, తామే ఉక్కు ఫ్యాక్టరీ తెప్పిస్తున్నామని పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ మీటింగ్‌లో పాల్గొన్న నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అల్టిమేటం జారీ చేయించి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని పేర్కొన్నారని ఇది చాలా బాధాకరమన్నారు. కర్నాటక ఎన్నికల సందర్భంగా బీజేపీకి అత్యధిక మెజార్టీ వచ్చిందని, ఆ సందర్భంలో ఇక్కడి స్థానిక నేతలు సంబరాలు చేసుకున్నారని, ఆ సమయంలో తాను ఉక్కు ఫ్యాక్టరీని తెప్పిత్తే ప్రజలు కూడా సంబరాలు చేసుకుంటారని పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెదేపా నాయకులు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష అంటున్నారని, కానీ తాను గత 2 సంవత్సరాల క్రిందటే 102 గంటలు ఆమరణ దీక్ష చేశానని గుర్తు చేశారు. తాను స్టీల్ ఫ్లాంట్ కోసం పోరాడుతుంటే తనను చిన్న పిల్లాడివని, ప్రస్తుత ఎమ్మెల్యే హేళన చేశారని, కానీ ప్రజాప్రతినిధిగా ఆయన ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. 18 నుండి 35 సంవత్సరాలలోపు వయస్సున్న యువకులను ఓట్లు అడుగుతారే కాని, వారు హక్కుల సాధన కోసం పోరాటాలు చెయకూడదా అని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై పోరాడాలని, రాజకీయ డ్రామాలు ఆపాలని పిలుపునిచ్చారు. తనతో కలిసి స్టీల్ ప్లాంట్ కోసం పోరాడక పోయినా ఇబ్బంది లేదని, కానీ స్టీల్ ప్లాంట్‌ను మాత్రం సాధించేందుకు పోరాటాలు చేస్తే చాలని పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రస్తుతం స్థానిక రాజకీయ నాయకులు ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటాలు చేస్తామని ప్రకటిస్తున్నారని తెలిపారు.బిజేపి నాయకులు ఆగస్టులో స్వయంగా ప్రధానే జిల్లాకు వచ్చి ఉక్కు ఫ్యాక్టరీకి శంఖు స్థాపన చేస్తారని పేర్కొంటే, తెలుగుదేశం పార్టీ వారు ముఖ్యమంత్రి స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేయిస్తారని పేర్కొంటున్నారని, తమకు ఈ ప్రకటనల మీద నమ్మకం లేదని, స్టీల్ ఫ్లాంట్ కోసం ఏ పార్టీ వారయితే నిస్వార్థంగా కృషి చేస్తారో వారికే ప్రజలు ఓట్ల ద్వారా బ్రహ్మరథం పడతారని తెలిపారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడుతున్నారని, కానీ 4 సంవత్సరాలు క్రితమే పట్టణంలో ఉక్కు ఉద్యమం పురుడు పోసుకున్నదని గుర్తు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఖర్చు చేసి, అప్పులు చేసి మరీ వారి పిల్లలను చదివించుకున్నారని, స్టీల్ ఫ్లాంట్ గురించి ఆశావాహ ప్రకటనలు వెలువడటంతో వారు ఆనందోత్సహాలు వెల్లిబుచ్చారని, కానీ ప్రస్తుత ప్రకటన విద్యార్థుల ఆశలపై నీరు జల్లేలా వున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపైన టిడిపి, వైసిపిలు రాజకీయాలు వీడి సమిష్టిగా కృషి చేసి జిల్లాకు స్టీల్ ఫ్లాంట్‌ను తీసుకవచ్చి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని కోరారు. కాగా కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కుదరదని సుప్రీం కోర్టులో అల్టిమేటం జారీ చేసి సీమకు చెందిన వేలాది మంది విద్యార్థుల, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినందుకు నిరసనగా నేడు ఉదయం 11 గంటలకు స్థానిక పుట్టపర్తి సర్కిల్‌లో ఉక్కు సైనికులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ సాధన సమితి కార్యదర్శి ఖలందర్, యువ నాయకులు ఓబుళరెడ్డి, కుళాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సీమకు ద్రోహం చేసిన మోదీ
కడప, జూన్ 14: కరవుకాటకాలకు నిలయమైన రాయలసీమకు ఉక్కుపరిశ్రమ ఏర్పాటు ద్వారా నిరుద్యోగం, పేదరికం తగ్గిపోతుందన్న ఆశతో ఎదురుచూస్తున్న సీమ వాసుల ఆశలపై ప్రధాని నరేంద్రమోదీ నీళ్లు చల్లారని సీపీఐ నేతలు ధ్వజమెత్తారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆపార్టీ కడపలోని ఏడురోడ్ల కూడలిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా నేత చంద్ర మాట్లాడుతూ ముమ్మాటికీ నరేంద్రమోదీ రాష్ట్రానే్న కాకుండా రాయలసీమ వాసులను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ ఏర్పాటుచేస్తామని, రాజ్యాంగ బద్దంగా పార్లమెంట్‌లో తీర్మానంచేయడం దీనికి బీజేపీ కూడా మద్దతు పలకడమేగాకుండా అధికారం చేపట్టాక రాష్ట్రానికి రావాల్సిన అన్ని సౌకర్యాలు, పథకాలు కల్పిస్తామని కళ్లబొళ్లి కబుర్లు చెప్పారన్నారు. నాలుగేళ్లుగా ఇదిగో అదిగో అంటూ కడపలో ఉక్క్ఫ్యుక్టరీ ఏర్పాటుచేస్తామని సర్వే నిర్వహిస్తున్నామని, అనుమతులు ఇస్తామని ఇలా రకరకాలుగా బుకాయించారన్నారు. కర్నాటకలో ఆపార్టీ పాచికలు పారకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ను కూడా ఆపార్టీకి దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుందని, ముందే గ్రహించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాలి జనార్ధన్‌రెడ్డి ఏర్పాటుచేసిన ఉక్కుపరిశ్రమ మూసివేయడంతో తమవారికి దక్కకుండా పోయిన ఉక్కుపరిశ్రమ ఈరాష్ట్రానికి ఎందుకు ఇవ్వాలన్న దుర్భుద్దితోనే ప్రధాన మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే సీమలో ఎంతోమంది నిరుద్యోగంతో తల్లడిల్లుతున్నారని, ఇప్పటికీ నాలుగేళ్లయినా కడపలో ఒక్క ఫ్యాక్టరీ కూడా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేయించలేక పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికితోడు కేంద్రం తోడైందని ధ్వజమెత్తారు. జిల్లాను అనాథగా వదిలేస్తారా అంటూ విరుచుకుపడ్డారు. ఇలాగే నిర్లక్ష్యంచేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి జనం తగిన బుద్దిచెప్పే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.