కడప

వానలు కురిసేనా.. పంటలు పండేనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, జూన్ 23: ఈ యేడాది సకాలంలో వర్షం కురిసి పంటలు బాగా పండాలని దేవుణ్ని ప్రార్థిస్తూ అన్నదాత పంటల సాగుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల రాకతో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండగా చాలా చోట్ల నల్లని మేఘాలు ఊరిస్తున్నాయి. కాగా నాలుగైదు సంవత్సరాలుగా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు పూర్తిగా నష్టపోయి కరవుతో అల్లాడుతున్న రైతన్న కష్టాల కడలిని ఈదుతూ ప్రస్తుత ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతుకు వరుణ దేవుడు కరుణచూపితే తప్ప గట్టెక్కే పరిస్థితులు లేవు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మామిడిపై రైతన్న ఆశపెట్టుకుంటే అది కూడా కొంత ఆలస్యంగా వచ్చి దిగుబడి గణనీయంగా తగ్గిపోయి నిరాశను మిగిల్చింది. సుండుపల్లె మండలం మామిడి తోటలకు ప్రసిద్ధి వేల హెక్టార్ల మామిడి తోటలను సాగు చేసిన రైతన్న ఈ ఏడాదైనా మామిడి తోటల ద్వారా అప్పుల ఊబి నుండి విముక్తి పొందాలని ఆశించినా ఫలితం దక్కలేదు. ప్రధానంగా సుండుపల్లె మండలంలో 1600 హెక్టార్లకు పైగా ప్రతి యేడాది వేరుశెనగ పంట సాగులో ఉంది. వరుణదేవుడిని నమ్ముకొని వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్న వర్షాభావం అకాల వర్షాలకు దెబ్బతింటోంది. దీనికోసం పెట్టుబడులు కూడా రాక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అయినా భూమిని నమ్ముకొని జీవించే రైతన్నకు ప్రత్యామ్నాయ అవకాశాలు లేకపోవడంతో కష్టాలు పడుతూనే ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనపు కాయలు, సబ్సిడీ ఎరువులను ఇస్తున్నప్పటికీ సరిపోవడం లేదు. దీంతో ప్రతిసారి పంటల సాగుకు అప్పులు తప్పడం లేదని రైతన్నలు చెబుతున్నారు. ఇప్పటికే మొలకల పౌర్ణమి వెళ్లిపోయి ఏరువాక పౌర్ణమి సమీపిస్తుండటంతో ఇటీవల కురిసిన అరకొర వర్షాలకు రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా మండలంలో పింఛా దిగువ ప్రాంతంలో బహుదానది పరివాహక ప్రాంతాలను పక్కన పెడితే పొలిమేరపల్లె, సుండుపల్లె, చిన్నగొల్లపల్లె, జి.రెడ్డివారిపల్లె, గుండ్లపల్లె, సొంఠంవారిపల్లె గ్రామాలు పూర్తి స్థాయిలో వర్షాధారంపై ఆధారపడి వేరుశెనగ సాగు చేయాల్సిన పరిస్థితి. ఖరీఫ్ పంటల సాగుకు నష్టాలను మిగిల్చడంతో చాలా మంది రైతులు వ్యవసాయానికి స్వస్తి పలికి వలసబాట పడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి కష్టాలు పడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ యేడాదైనా వర్షాలు బాగా పడి పంటలు రైతులు అప్పుల ఊబి నుండి విముక్తి పొందాలని వరుణదేవుడిని ప్రార్థిద్దాం.
800 క్వింటాళ్ల వేరుశెనగ పంపిణీ: సుమారు 800 క్వింటాళ్లకు పైగా వేరుశెనగ విత్తనాలను ఖరీఫ్ కోసం రైతులకు పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారి మురళీధర్ తెలిపారు. సరైన సమయంలో అరకొర వర్షాలు పడటంతో భారీగా రైతులు వేరుశెనగ విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ విత్తనం వేసేంత వర్షం కురవక ముఖం చాటేయడంతో ప్రస్తుతం రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.