కడప

నాలుగేళ్లుగా బీజేపీ, టీడీపీలు నాటకాలు ఆడాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 23: ఉక్కుసాధన కోసం టీడీపీ,బీజేపీ డ్రామాలు ఆడాయని, తెలుగుదేశంపార్టీ నాలుగేళ్ల తర్వాత ఉక్కుదీక్షలకు దిగడం ఆశ్చర్యకరంగా ఉందని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాల్సిందేనంటూ ఆపార్టీ శనివారం పాతకలెక్టరేట్ వద్ద ఉక్కుమహాదీక్షను నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ నాలుగేళ్లుగా బీజేపీతో హనీమూన్ చేసుకుంటూ ఇప్పుడు ప్రత్యేక హోదాలోనూ, కడపకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో బీజేపీ మోసం చేసిందంటూ మాట్లాడుతున్నారని, ఇప్పుడు కడప జిల్లా ప్రజలు గుర్తుకు వచ్చారా అంటూ వారు నిలదీశారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకోసం మొదటి నుండి వైసీపీ పోరాడుతోందని స్పష్టం చేశారు. తమపార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదాతోపాటు విభజన సమయంలో నిర్ణయించిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇందుకోసమే తమ పార్టీ ఎంపీలతో పదవులకు రాజీనామాలు చేయించి రాష్ట్ర హోదాతోపాటు చట్టాల ఆమలుకోసం ఎంపీలు పదవుల త్యాగాలు చేశారని వారు వెల్లడించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగేళ్లుగా ప్రధాని మోదీ పై ఎనలేని ఆపేక్ష చూపించి బీజేపీకి అతి దగ్గరయ్యారని దుయ్యబట్టారు. కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకుంటూ కాంట్రాక్టర్ల వద్ద నుండి పెద్ద ఎత్తున సొమ్ముదండుకున్నారని ఆరోపించారు. పోలవరం పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెల్లడౌతాయన్నారు. పట్టిసీమ పేరుతో రాయలసీమకు ఎలాంటి మేలుజరగలేదని, కేవలం విజయవాడ వాసులకు మాత్రమే దీనివల్ల మేలు జరుగుతుందన్నారు. గతంలో ఉక్కు పరిశ్రమకోసం తమ ఎంపీలు కూడా కేంద్రంపై వత్తిడి తీసుకురావడంతోనే ప్రధానమంత్రి జిల్లాకు కమిటీని నియమించారని, ఈ కమిటీ అన్ని పరిస్థితులు బాగా ఉన్నాయని వెల్లడించి చివరకు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పలేమని చెప్పడం దుర్మార్గమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కడపలో ఉక్కుపరిశ్రమ కోసమే మైలవరం వద్ద 10వేల ఎకరాల్లో బ్రహ్మణీ స్టీల్స్ వారికి అవకాశం కల్పించారని, అలాగే ఇక్కడ నీటి సౌకర్యం కూడా ఉందన్నారు. ఇదే విధంగా కడపలోని చింతకొమ్మదినె్న మండలంలో 6వేల ఎకరాలు భూములు సేకరించడమే గాకుండా రూ.1500 కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు, సౌకర్యాలు కల్పించారని ,సోమశిల బ్యాక్‌వాటర్‌నుండి నీటి వసతి కూడా సమకూర్చారని అలాంటప్పుడు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎందుకు కేంద్రం అడ్డంకులు సృష్టించిందని వారు ప్రశ్నించారు. కేవలం రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్పడుతున్న అక్రమాలు, అవినీతిపై ఆగ్రహించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ఎలాంటి మేలు చేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రానికి కోట్లాదిరూపాయలు నిధులు ఇస్తున్నా, వాటిని సక్రమంగా ఖర్చుపెట్టకుండా కేంద్రానికి వాటిపై సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతోనే రాష్ట్రానికి ఎలాంటి నిధులు మంజూరు చేయడంలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేష్ అవినీతి అక్రమాల్లో జోడు జంటగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు కూడా కేంద్రంలో నిర్ణయించిన మేరకు విభజన చట్టాలను అమలుచేయడంలో ఏమాత్రం పట్టించుకోవడంలేదని, కావాలనే రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, విరుచుకు పడ్డారు. కరవు కాటకాలకు నిలయమైన కడప జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు వల్ల వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఇందువల్ల సామాన్యుడు సైతం కడుపునిండా తిండితినే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఉక్కుపరిశ్రమ ఏర్పాటయ్యేవరకు తమపార్టీ కేంద్రంపై వత్తిడి తెచ్చే విధంగా ఉద్యమాలు సాగిస్తుందని వారు వెల్లడించారు. ఈ మహాధర్నాలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లుప్రసాదరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, రవీంద్రనాధరెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబు, సీపీఎం నేత నారాయణ, వైసీపీ నేతలు పులి సునీల్, ఎస్‌ఎండి షఫి, నిత్యానందరెడ్డి, త్యాగరాజు, టి.శివశంకర్, ప్రసాదరెడ్డి, అఫ్జల్‌ఖాన్, మహిళానాయకురాళ్లు బోలాపద్మావతి, వెంకటసుబ్బమ్మ, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

కడప ఉక్కుపై బీజేపీ, టీడీపీ, వైకాపా డ్రామాలు
* పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి
వేంపల్లె, జూన్ 23: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనడం జరిగిందని కానీ నేడు బీజేపీ, టీడీపీ, వైకాపా నాయకులు డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన వేంపల్లెలో విలేఖరులతో మాట్లాడారు. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్ధానం చేశారన్నారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కావాల్సిన వౌలిక సదుపాయాలు, భూమి, నీరు, విద్యుత్, రవాణా సౌకర్యాలను ఉన్నాయన్నారు. ముడి పదార్థాలైన సున్నపురాయి, డోలమైట్, కొంత మేరకు మేగ్నటైట్‌లు ఉన్నాయన్నారు. అవి ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 సంవత్సరాలైనా ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీ బీజేపీకి అధికార మిత్రపక్షంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉంటూ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా వాసి అయి ఉండి బీజేపీకి అనధికార మిత్రపక్షంగా ఉంటూ సాధించలేకపోతున్నారని తెలిపారు. ఇపుడేమో తగదునంటూ మూడు పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయన్నారు. నీకు చేతనైతే 15 రోజులలోపుల ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేయించి పనులు మొదలు పెట్టండి లేకపోతే మేము దద్దమ్మలము, చేతకాని అసమర్థలము, మా చేత కాదు అని చెప్పి తప్పుకోండన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన చేసి పనులు మొదలుపెడతామన్నారు. అంతే తప్ప డ్రామాలు ఆడవద్దని జిల్లా ప్రజలను మభ్యపెట్టవద్దని బీజేపీ, టీడీపీ, వైకాపా పార్టీల నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తుందన్నారు.