కడప

చంద్రబాబు జిల్లా పర్యటనకు ఎందుకు వస్తున్నారో చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ,ఆగస్టు 14: ఈనెల 17,18వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వస్తున్నారని, ఆయన ఎందుకు పర్యటనకువస్తున్నారో చెప్పాలని మైదుకూరు వైకాపా ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి మంగళవారం అన్నారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇదివరకే 25సార్లు జిల్లాకు వచ్చాడని అన్నిసార్లూ జిల్లావాసులకు వట్టిచేతులే చూపారు తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ఆయన వచ్చినందుకు కొత్త ప్రాజెక్టులా, కొత్త కళాశాలలా, కొత్త ఫ్యాక్టరీలా ఏం తెస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశాడు. అయితే జిల్లాలో టీడీపీ నేతల మధ్య స్పష్టమైన విబేధాలున్నాయని బద్వేలులో సైతం ముగ్గురు నడుమ యుద్ధం నడుస్తోందని వారికి సయోధ్యకుదుర్చేందుకే వస్తున్నట్లు ఉందన్నారు. బద్వేలు, కమలాపురం, రాయచోటి,ప్రొద్దుటూరు లాంటి పలు నియోజకవర్గాల్లో ఉన్న విబేధాలు ఎలా సరిదిద్దుతాడో వేచిచూడాలన్నారు. టీడీపీ నేతలు జిల్లాలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపాలన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని ఆయన ఆరోపించారు. వేలాది డబుల్ బెడ్‌రూమ్స్ ఇల్లు, మూడు సెంట్లస్థలం ఇస్తానన్న మాట ఏమైందో చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చిన గ్రాంట్‌లతో పాత ఇళ్లకు రంగులు వేసి కొత్తగా తాము ఇచ్చినట్లు బుకాయిస్తున్నారన్నారు. జిల్లాలో కర్నూలు, విజయవాడకు సైతం అస్తవ్యస్థంగా ఉన్నాయన్నారు. రైతులకు వర్షాభావంతో వేరుశెనగ, జొన్న పంటలకు అదును తప్పిందని, వ్యవసాయం కోసం రైతులకు ఇచ్చిన ఇన్‌ఫుట్స్, ట్రాక్టర్లు సైతం తెలుగుదేశం దళారీలకే దక్కాయన్నారు. జిల్లాలో ఎస్పీ, ఎస్టీ, బీసీలకు ఒక్క హాస్టల్ కానీ, ఒక్క అంగన్వాడీ కేంద్రం కానీ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. జిల్లాలోని రైతులకోసం కోల్డ్‌స్టోరేజ్, వేర్ హౌసెస్ ఎక్కడున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా టీడీపీ ఒక్క క్యాండెట్‌ను కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారని ప్రకటించే పరిస్థితి లేదన్నారు. కనీసం జమ్మలమడుగులోనై అభ్యర్థి ఎవరో ప్రకటించాలన్నారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు వస్తున్నాడు, తమకు ఎలాంటి వరాలు ఇస్తారో అంటూ ఎదురు చూస్తున్నారన్నారు. కేసీ కెనాల్‌కు నీటి సరఫరాలో కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయని , వెలుగోడు కాలువలో ఒకటి నుంచి 18వరకు మన జిల్లాలో 14కి.మీ.మేర కాలువ లైనింగ్ బాగాలేదని దాని పునరుద్దరణకు కేవలం స్వల్పంగా ఖర్చుపెడితే రైతాంగానికి ఎంతో మేలుజరుగుతుందన్నారు. తమ నియోజకవర్గంలో విజయమ్మ, జయరాములు, విజయజ్యోతిలకు పడటంలేదని , వచ్చిన నిధుల్లో ఎవరెంత తీసుకోవాలన్నదే వారి మధ్య విరోధానికి కారణమన్నారు. నీరు-చెట్టు కింద రూ.200కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో తమ వారికే అప్పగిస్తున్నారని ఆరోపించారు. సురేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాకు ఇది వరకే ఎన్నో వరాలు ప్రకటించిన చంద్రబాబు ఏం చేశారో చూపాలన్నారు. పేదలకు సెంటు స్థలం ఇవ్వలేదన్నారు. 840 ఇళ్ల స్థలాలు ఇస్తే 500టీడీపీ కార్యకర్తలకే దక్కాయన్నారు. చివరకు మీడియాకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
అనిబిసెంట్ మున్సిపల్ పాఠశాలను
సందర్శించిన జర్మనీ దేశీయులు

ప్రొద్దుటూరు, ఆగస్టు 14: స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ పాఠశాలలో మంగళవారం జర్మనీ దేశస్థులు థామస్, ఎబెలెన్‌లు సందర్శించారు. మునిసిపల్ ఛైర్మెన్ ఆసం రఘురామిరెడ్డి వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జర్మనీ దేశస్థులకు ఆసం రఘురామిరెడ్డి పాఠశాలను ఐర్లాండ్ వనిత అనిబిసెంట్ స్థాపించగా అందుకు అనుగుణంగానే ఈ పాఠశాలకు అనిబిసెంట్ పాఠశాలగా పెద్దలు నామకరణం చేశారన్నారు. ఈ సందర్భంగా జర్మనీ దేశస్తులు థామస్, ఎబెలెన్‌లు మాట్లాడుతూ ఈ పాఠశాల అందమైన, ఆనందమైన, ఆహ్లాదకరమైన, స్వచ్ఛ్భారత్ వాతావరణంలో ఉందని విద్యార్థులు చక్కటి క్రమశిక్షణలో ఉపాధ్యాయుల సారధ్యంతో నడుస్తోందని వారు కొనియాడారు. జర్మనీలో కెండర్ గార్డన్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నానని థామస్ తెలిపారు. డియఫ్‌వో గురుప్రభాకర్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులను అందించిన ఈ పాఠశాల ఆదర్శ పాఠశాల అన్నారు. ఎస్‌వి వెటర్నరీ విభాగం మాజీ వైస్ ఛాన్స్‌లర్ మాట్లాడుతూ అన్ని వసతులు ఉన్న పాఠశాల ఇదని, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలన్నారు. డాడి ఫౌండేషన్ రాజారెడ్డి తన సందేశంలో ప్రభుత్వ పాఠశాలలే దేశాభివృద్ధికి మూలం అని పేర్కొన్నారు. సాంస్కృత సేవా సంస్థ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలను జర్మనీలు సందర్శించడం మన అధృష్టం అని స్వచ్ఛ బాలబాలికలకు నిలయంగా ఉందని ఇక్కడి ఉపాధ్యాయులు ఆదర్శమని వృక్ష ప్రొద్దుటూరు ధ్యేయంగా పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. మునిసిపల్ ఛైర్మెన్ ఆసం రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులను చేకూర్చి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అన్నారు.
అనంతరం పాఠశాల ప్రాంగణంలో థామస్, ఎబెలెన్‌లు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆకెపాటి రామచంద్ర, స్పందన, రాజమోహన్‌రెడ్డి, సహదేవరెడ్డి, కొండయ్య, నరేష్, దస్తగిరి, స్వర్ణలత, విద్యార్థులు పాల్గొన్నారు.