కడప

అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, ఆగస్టు 17: రాయచోటి పట్టణ రూపు రేఖలు మారేలా అభివృద్ధి చేసుకునే దిశగా మున్సిపల్ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మున్సిపల్ అధికారులతో సమావేశమై చేపట్టిన, చేపట్టబోతున్న నిర్మాణ పనులపై ఆయన చర్చించి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ నసీబున్‌ఖానమ్ కోరిక మేరకు ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన కార్యక్రమాల రూపకల్పనపై ఎమ్మెల్యే పలు సలహాలు, సూచనలు చేశారు. 14వ ఫైనాన్స్ కింద చేపట్టిన నిర్మాణపు పనులు కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల పెండింగ్‌లో ఉన్నాయని, పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ సుందరీకరణకు మంజూరైన రూ.3 కోట్ల నిధులతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. బస్టాండు నుంచి నేతాజీ సర్కిల్ వరకు డివైడర్ల ఎత్తు పెంచాలని, కౌన్సిలర్ల వినతి మేరకు వెల్‌కం బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ భవనాల సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. శ్మశానవాటికలో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి ఇంటి నుండి ప్రతిరోజూ చెత్తను తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగు వరుసల జాతీయ రహదారిలో డివైడర్లలో మొక్కలు నాటితే వాహనాలకు అడ్డు వస్తాయన్న కారణంతో మొక్కలు నాటేందుకు అనుమతులు ఇవ్వనందున ఆ స్థానంలో పెద్ద పూలకుండీలు పెట్టేందుకు జాతీయ రహదారుల అధికారుల అనుమతి కోసం లేఖలు రాయాలని ఆయన అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి దిశానిర్దేశం, సూచనల ప్రకారం కౌన్సిలర్లు, అధికారులందరం కలిసి మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందుకెళ్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు సలావుద్దీన్, కౌన్సిలర్లు ఫయాజుర్‌రెహమాన్, చిల్లీస్ ఫయాజ్, మున్సిపల్ డీ ఈ చక్రవర్తి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.