కడప

తెలుగుతమ్ముళ్ల ఆధిపత్య పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మే 6: దశాబ్దకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపిలో ఆధిపత్యపోరు రోజురోజుకు పెరిగి పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సర్దుకుపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేష్ పలుమార్లు హెచ్చరించినా నేతలు పెడచెవిన పెడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ జిల్లాలో ఘోరపరాజయం చెందినా అధికారపార్టీ నేతల్లో ఏ మాత్రం మార్పు కన్పించడం లేదు. జిల్లా అధ్యక్షత పీఠం దక్కించుకున్న ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు)కి ఈ పదవి ముళ్లకిరీటంలా తయారైంది. పార్టీలో సీనియర్ నేతలు ఎవరికివారే సొంత కుంపటి పెట్టుకోవడంతో వాసుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్న రెండు సామాజికవర్గాలు అంతర్గత కుమ్ములాటలతో పార్టీని మరింత దిగజార్చుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగాలేని అసలైన సిసలైన తెలుగుదేశం పార్టీ నేతలకు అడుగడుగునా అన్యాయం జరుగుతూనే ఉంది. పార్టీలో వలస నేతల హవా రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి పూర్వవైభవం తేవాలని యత్నిస్తున్నా నేతల్లో మాత్రం మార్పు కన్పించడం లేదు.