కడప

జిల్లాపై సిఎం వరాల జల్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 7: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాపర్యటన సందర్భంగా జిల్లారైతాంగానికి, జలవనరుల అభివృద్ధికి వరాల జల్లు కురిపించారు. జిల్లాలో పండ్లతోటలు విస్తారంగా ఉండటంతో వాటిని భద్రపరిచేందుకు రూ.10కోట్లతో కోల్డ్‌స్టోరేజి ఏర్పాటుకు హామీ ఇచ్చారు. పులివెందులలో అరటి తోటకు 65 టన్నుల గెలలు వస్తున్నాయని, ఈ నేపధ్యంలో పులివెందులను హార్టికల్చర్ హబ్‌గా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అరటి, మామిడిని దేశ విదేశాల్లో డిమాండ్‌ను బట్టి రవాణా చేసేందుకు ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే పెన్నా, పాపాగ్ని నదుల్లో పెద్దఎత్తున సర్పేస్ డ్యామ్‌లను రూ.30కోట్లతో నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో మామిడి, అరటి, చీనీ, బొప్పాయి, ఆకుతోటలు, పసుపు, పులుపునిమ్మ తోటలు గల రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పండ్లతోటలు సాగుచేసుకునే రైతాంగానికి స్ప్రింకర్లు, డ్రిప్ ఇరిగేషన్ కింద ఎంత సాగుచేసుకున్నా ప్రభుత్వం సంబంధిత రైతులకు కావాల్సిన పరికరాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా చేపలు, గొర్రెలు, పౌల్ట్ఫ్రీమ్, డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకునే రైతాంగానికి కావాల్సిన నిధులను సమకూరుస్తామని అన్నారు. ఆసక్తిగల వారు ఆ యూనిట్లను ప్రారంభిస్తే వారికి వెంటనే రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ, సూక్ష్మబిందు సేద్యానికి సంబంధించి జలవనరుల శాఖలు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఈకార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు గంటా శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వవిప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, పౌరసరఫరా అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), ప్లానింగ్ బోర్డు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుటుంబరావు, కేంద్రమాజీ మంత్రి ఏ.సాయిప్రతాప్, రాష్టమ్రాజీ మంత్రులు డాక్టర్ ఎస్‌ఏ ఖలీల్‌బాషా, పి.బ్రహ్మయ్య, పి.రామసుబ్బారెడ్డి, డిసిసిబి చైర్మన్ జివి అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.జయరాములు, సి.ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, సి.నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జి.వీరశివారెడ్డి, ఎన్.వరదరాజులురెడ్డి, ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తానరసింహారెడ్డి, కడప నేత ఎస్.సుధా దుర్గాప్రసాద్, తెదెపా జిల్లా ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, రైల్వేకోడూరు ,బద్వేలు, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు కె.విశ్వనాధనాయుడు, ఎన్‌డి విజయజ్యోతి, ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, ఎస్.ప్రసాద్‌బాబు (చిన్నరాయుడు), పుట్టా సుధాకర్ యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిఎం రమేష్‌నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఎస్.గోవర్దన్‌రెడ్డి,రాష్ట్ర, జిల్లా నేతలు విఎస్ అమీర్‌బాబు, సుభాన్‌బాషా, జి.లక్ష్మిరెడ్డి, పొన్నోలు లక్ష్మీదేవమ్మ, పి.గిరిధర్‌రెడ్డి, శవనా వెంకటసుబ్బయ్య నాయుడు, పత్తిపాటి కుసుమకుమారిలు ముఖ్యమంత్రికి ఎయిర్ పోర్టులో స్వాగతం పలికినవారిలో ఉన్నారు. అలాగే జిల్లా నూతన కలెక్టర్ జెవి సత్యనారాయణ, ఏపిఎంఐపి కమిషనర్ చిరంజీవి చౌదరి, బదిలీ అయిన కలెక్టర్ కెవి రమణ, జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియో, జాయింట్ కలెక్టర్ -2 శేషయ్య, జిల్లా ఎస్పీ డా.నవీన్‌గులాఠి, ఐపిఎస్ అధికారులు అన్బురాజన్, సత్యయేసుబాబు తదితరులు ఉన్నారు.

సిఎం గారూ మీరు కష్టపడుతున్నారు..!
* నేతల్లో మార్పువస్తేనే జిల్లా బాగుపడుతుంది
* సిఎం సభలో రైతులు...కంగుతిన్న నాయకులు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, మే 7: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లా పర్యటన సందర్భంగా బహిరంగ సభలో కొందరు రైతులు ముఖ్యమంత్రికి చేసిన విన్నపం జిల్లా నాయకుల్లో కలకలం రేపింది. సిఎం గారూ... మీరు నిత్యం అభివృద్ధికోసం ప్రజల వద్దకు వస్తూ కష్టపడుతుంటే మా ప్రాంత ప్రజాప్రతినిధులు మొఖం చాటేసుకుని తిరుగుతున్నారని కొందరు రైతులు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ నేతలు , అధికారుల్లో మార్పులు రాకనే ఈ దుస్థితి దాపురించిందని, వారిలో మార్పు వస్తేనే దేశం అన్నిరంగాల్లో ముందుకెళ్తుందని ఆయన అన్నారు. జన్మభూమి-మా ఊరు, నీరు-చెట్టు, మీ ఇంటికి -మీ భూమి తదితర కార్యక్రమాల్లో మాత్రమే ప్రజాప్రతినిధులు తమకు కన్పిస్తున్నారని, మీరు జిల్లాకు నెలలో రెండు,మూడు పర్యాయాలు వస్తున్నారని రైతులు తెలిపారు. మీరు మండు టెండలను లెక్కచేయకుండా జిల్లాకు వస్తుంటే మా నేతల్లో ఏమాత్రం చలనమే లేదని వాపోయారు. దీంతో ముఖ్యమంత్రి నేతలను చూస్తూ నేతలు, అధికారుల మొఖాల వంక సీరియస్‌గా చూశారు.
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..!
ఆంధ్రభూమి బ్యూరో
కడప,మే 7: విభజన అనంతరం కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం జిల్లా పర్యటన సందర్భంగా నగరంలోని మున్సిపల్ మైదానంలో జరిగిన కార్యక్రమ వేదికపై ఇటీవల వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములను ముఖ్యమంత్రి సభకు పరిచయం చేస్తూ వీరు తమ నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడపాలనే తపనతోనే తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. అభివృద్ధి విషయంలో తాను ముందుంటానన్నారు. జిల్లాలో ఉన్న ఖనిజ సంపద, పండ్లతోటలు దేశంలో ఎక్కడా లేవన్నారు. తనకు కడపజిల్లా అంటే ప్రేమ ఎక్కువ అని, సమయం దొరికినప్పుడల్లా జిల్లా పర్యటనలు చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వం అమలుచేసే పథకాల్లో చాలా వరకు కడప జిల్లా నుంచే శ్రీకారం చుడుతున్నానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రపంచప్రఖ్యాతి గాంచిన దర్గా, భద్రాచలం కంటే అభివృద్ధిలో ముందంజలో ఉంటూ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్టను ఆయన ప్రస్తావిస్తూ ఇలాంటి ప్రసిద్ధ, చారిత్రక ప్రదేశాలు జిల్లాలో ఎన్నో ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు తమ
స్వలాభాల కోసం రాజకీయాలు చేయకుండా అభివృద్ధిని ఆకాంక్షిస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ప్రజలు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు.
రతనాల సీమగా మార్చడమే లక్ష్యం
కడప (కలెక్టరేట్), మే 7: రాయలసీమను రతనాల సీమగా చేయడమే రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం కడప మున్సిపల్ స్టేడియంలో ఉద్యానపంటల రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే రూ.25వేలకోట్ల రైతు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. రైతులకు అన్ని బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తున్నామన్నారు. రాయలసీమలోని ప్రతి ఎకరాకు నీరు అందించడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. రాయలసీమలో తాగు, సాగునీటి కొరత తీర్చేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారన్నారు. కడప జిల్లాను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. గతనెల 25వ తేదిన నీటి సంఘాల సమావేశానికి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి తిరిగి కడప జిల్లాకు రావడం చూస్తే కడప జిల్లాపై ఆయనకు ఎనలేని ప్రేమ ఉందని స్పష్టమవుతోందన్నారు. రైతులకు ఆదాయం పెరిగి వారి కళ్లల్లో ఆనందం చూడటమే చంద్రబాబు లక్ష్యమన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఉద్యానపంట రైతు రుణ ఉపశమన పత్రాలు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం 32 వేల 51 మంది రైతులకు రూ.67.35కోట్లు రుణ ఉపశమన పత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వవిప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, పౌరసరఫరా అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), ప్లానింగ్ బోర్డు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుటుంబరావు, కేంద్రమాజీ మంత్రి ఏ.సాయిప్రతాప్, రాష్టమ్రాజీ మంత్రులు డాక్టర్ ఎస్‌ఏ ఖలీల్‌బాషా, పి.బ్రహ్మయ్య, పి.రామసుబ్బారెడ్డి, డిసిసిబి చైర్మన్ జివి అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.జయరాములు, సి.ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, సి.నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జి.వీరశివారెడ్డి, ఎన్.వరదరాజులురెడ్డి, ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తానరసింహారెడ్డి, కడప నేత ఎస్.సుధా దుర్గాప్రసాద్, తెదెపా జిల్లా ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, రైల్వేకోడూరు ,బద్వేలు, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల ఇన్‌చార్జిలు కె.విశ్వనాధనాయుడు, ఎన్‌డి విజయజ్యోతి, ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, ఎస్.ప్రసాద్‌బాబు (చిన్నరాయుడు), పుట్టా సుధాకర్ యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిఎం సురేష్, కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఎస్.గోవర్దన్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నేతలు విఎస్ అమీర్‌బాబు, సుభాన్‌బాషా, జి.లక్ష్మిరెడ్డి, పొన్నోలు లక్ష్మీదేవమ్మ, పి.గిరిధర్‌రెడ్డి, శవనా వెంకటసుబ్బయ్య నాయుడు, అతికారి వెంకటయ్య, నూతన కలెక్టర్ జెవి సత్యనారాయణ, బదిలీ అయిన కలెక్టర్ కెవి రమణ, జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియో, జిల్లా ఎస్పీ డా.నవీన్‌గులాఠి, ఐపిఎస్ అధికారులు అన్బురాజన్, సత్యయేసుబాబు తదితరులు పాల్గొన్నారు.
సిఎం పర్యటన విజయవంతం
ఆంధ్రభూమి బ్యూరో
కడప,మే 7: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాపర్యటన సందర్భంగా జరిగిన బహిరంగ సభ, వివిధ కార్యక్రమాలు విజయవంతం కావడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈసభకు పెద్ద ఎత్తున రైతులు, మహిళలు మండుటెండను లెక్కచేయకుండా సమావేశానికి హాజరయ్యారు. కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో సభకు హాజరైన కార్యకర్తల ఆనందానికి అవధుల్లేవు. నేరుగా కార్యకర్తలే ముఖ్యమంత్రికి నేతలు, అధికారులు మీ తరహాలో పనిచేయడం లేదని, మీరు ప్రవేశపెడుతున్న పథకాల అమలులో వారికి చిత్తశుద్ధిలేదని ఏకరవు పెట్టారు. దీంతో ముఖ్యమంత్రికి ఇప్పటికే జిల్లాలో నేతల, అధికారుల పనిపట్టడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో నేతల ఆధిపత్య పోరు నేపధ్యంలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సభకు హాజరుకావడంతో నేతల మధ్య ఐక్యమత్యం కొట్టొచ్చినట్లు కన్పించింది. దీనికితోడు చాలా మంది అధికారుల తీరుపై రైతులు, మహిళలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో రెండు గ్రూపులు, మరికొన్ని నియోజకవర్గాల్లో మూడు గ్రూపులు ఏర్పాటుచేసుకుని అధికారులపై వత్తిళ్లు తెస్తూ పాలన ముందుకు సాగనీయడం లేదు. ఒక గ్రూపు అభివృద్ధి జరగాలని అధికారులకు హుకుం జారీ చేస్తే మరో వర్గం అడ్డుతగులుతుండటంతో జిల్లాలో అభివృద్ది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. జిల్లాలో ఉన్న గ్రూపులవల్లే ముఖ్యమంత్రి తరచూ జిల్లాకు పర్యటనలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో జగన్‌ను ఏ ఒక్కరూ సరిగా డీకొనలేకపోతున్నారని ఆయన గ్రహించారు. 2019 ఎన్నికల్లో 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకూడదన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి తరచూ జిల్లా పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక అసెంబ్లీనియోజకవర్గం మాత్రమే గెలుచుకున్నా బాధలేదని, జిల్లా అభివృద్ధే ధ్యేయమని వచ్చే ఎన్నికల్లో 10 నియోజకవర్గాలు గెలుచుకునేలా ప్రజలు సహకరించాలని కోరారు. దీన్నిబట్టి చూస్తే నేతలను నమ్మకనే జిల్లా బాధ్యతను స్వయంగా తన భుజస్కంధాలపై వేసుకున్నట్లు స్పష్టవౌతోంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి పర్యటనలతో కార్యకర్తల్లో ఆనందానికి అవధుల్లేవు.

ఇలాంటి నష్టాన్ని ఎన్నడూ చూడలేదు
* ఎంపి వై ఎస్.అవినాష్‌రెడ్డి
పులివెందుల, మే 7: శుక్రవారం కురిసిన వడగండ్ల వానతో పులివెందుల, లింగాల మండలాల్లో రైతులు సాగుచేసిన అరటిపంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని వైకాపా నాయకులు ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఢిల్లీ నుంచి పులివెందులకు చేరుకొని శనివారం వ్యవసాయశాఖ అధికారులతో ఎర్రబల్లి, చంద్రగిరి, నల్లపరెడ్డిపల్లె, కొత్తపల్లె, లింగాలమండలంలోని గునకనపల్లె, ఇప్పట్ల, రామట్లపల్లెలో పూర్తిగా దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి నష్టాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేలా పార్లమెంట్‌లో, ఇటు రాష్ట్రంలో కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. అధికారులు కూడా త్వరితగతిన పంటనష్ట నివేదికలు తయారు చేయాలని సూచించారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించి సత్వరమే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక్క కొత్తపల్లె గ్రామంలో ప్రసాద్ అను రైతుకు చెందిన 19000 అరటిచెట్లు, రామచంద్రారెడ్డి అను రైతుకు చెందిన 15000 అరటిచెట్లు కూలిపోయాయన్నారు. రైతులకు ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగినా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఘంటా శ్రీనివాసులు, శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను ఓదార్చిన పాపానపోలేదని విమర్శించారు. నల్లపురెడ్డిపల్లె చెరువు పక్కన వుండే మరం ద్వారా వర్షపునీరు పంట పొలాల్లోకి చేరి నష్టం జరుగుతోందని ఉపాధిహామీ పథకం ద్వారా నీరు పొలాల్లోకి వెళ్లకుండా చూడాలని ఎంపి ఆదేశించారు. అలాగే జమ్మలమడుగు ఆర్డీ ఓ వినాయకం స్థానిక అధికారులతో కలిసి పులివెందుల మండల పరిధిలోని పంటలను పరిశీలించి నష్టాన్ని వెంటనే నివేదికలు తయారుచేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
మద్యం అమ్మకాల ద్వారా రూ.723కోట్ల ఆదాయం
రైల్వేకోడూరు, మే 7:జిల్లాలో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ. 723 కోట్ల మేరకు ఆదాయం లభించినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసాచారి తెలిపారు. శనివారం స్థానిక ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానిక సిఐ శివసాగర్, ఎస్సైలు సుధాకర్, జాకీర్ అహ్మద్, సిబ్బందితో సారా నిర్మూలన, మద్యం విక్రయాలు తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. స్థానిక అధికారులు, సిబ్బంది పనితీరును ఆయన అభినందించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఇంకుడు గుంతను ఆయన తవ్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల సంరక్షణలో భాగంగా ప్రభుత్వం పిలుపుమేరకు ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వీలైనన్ని ఇంకుడు గుంతలను తవ్వాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 229 మద్యం షాపులు ఉన్నాయని, ఇందులో 7 షాపులను ప్రభుత్వమే అధికారుల ద్వారా విక్రయాలు సాగిస్తుందన్నారు. జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్ధేశ్యంతో నవోదయా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో సారా తయారీదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు. జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల తదితర ప్రాంతాలలో 87 గ్రామాల్లో సారా తయారీ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో తమ అధికారులు, సిబ్బంది సహకారంతో 72 గ్రామాలలో అవగాహన సదస్సులు, వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో సారా నిర్మూలన బాగా జరిగిందన్నారు. మరో 15 గ్రామాలలో మాత్రమే సారా ఉందని, ఆయా గ్రామాల్లో కూడా 2 వారాలలో సారా తయారీదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెవెన్యూ, పోలీస్, అటవీ, డిఆర్‌డిఏ తదితర శాఖల సమన్వయంతో సారా రహిత నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ చెండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో డిసిసి బ్యాంకుల కంప్యూటరీకరణ
* డిసిసి బ్యాంకు చైర్మన్ అనిల్
పెండ్లిమర్రి, మే 7: డిసిసిబి ఆధ్వర్యంలో నడుస్తున్న 24 బ్యాంకు బ్రాంచ్‌లను కంప్యూటరీకరించి ఆన్‌లైన్ ద్వారా సేవలందిస్తున్నామని, త్వరలో ఏటిఎం సౌకర్యం కూడా కల్పిస్తామని జిల్లాసహకార బ్యాంకు లిమిటెడ్ జిల్లా ఛైర్మన్ జివి అనిల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పెండ్లిమర్రికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటివరకు 51 మండలాల్లో 24 బ్యాంకు బ్రాంచిల ద్వారా 69 వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు రూ.485కోట్లు రుణాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ రుణాల్లో రూ.269కోట్లు ఆప్కాబ్ నుంచి అప్పుగా తెచ్చుకున్నామని, బ్యాంకు సొంత నిధుల నుంచి రూ.216కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గతంలో తమ బ్యాంకులకు రూ.177కోట్లు డిపాజిట్లు ఉండగా ఆ డిపాజిట్లు రూ.245కోట్ల చేరాయన్నారు. 2016 ఆర్థిక సంవత్సరానికిగాను స్వల్పకాలిక రుణాల కింద రూ.304.50కోట్లకు గాను రూ.155.50కోట్లు , దీర్ఘకాలిక అప్పుల కింద రూ.27.14కోట్లకు గాను, రూ.13.52కోట్లు ఏప్రిల్ నాటికి వసూలు చేశామని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వడ్డీలేని రుణాలు, రుణమాఫీ, గ్రామీణ రైతులకు అవసరమైన అన్ని రకాల అప్పులు, రైతులకు అవసరమయ్యే రసాయన ఎరువులు, పైర్ల మందులకు రూ.298కోట్ల స్వల్పకాలిక రుణాలు అందజేశామన్నారు. రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ గడువులోపు రుణాలు చెల్లిస్తే ఆపదలో ఉన్న మరికొంతమందికి రుణాల సౌకర్యాన్ని కల్పించవచ్చన్నారు. జాతీయ బ్యాంకులకు దీటుగా తమ బ్యాంకులు పనిచేస్తున్నాయని, డిపాజిట్లు అధికంగా చేసుకోవాలని అనిల్ విజ్ఞప్తి చేశారు.

లారీపై నుండి పడి క్లీనర్ మృతి
చక్రాయపేట, మే 7:మండలంలోని సురభి బాలతిమ్మాయగారిపల్లె వద్ద శుక్రవారం రాత్రి లారీ ఆపి లారీలో డ్రైవర్, పైన క్లీనర్ బస చేశారు. శనివారం ఉదయానే్న క్లీనర్ మస్తాన్ (35) క్రిందకు దిగుతుండగా నిద్ర మత్తులో తలక్రిందులుగా పడి అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వడదెబ్బకు ముగ్గురు మృతి
రాజంపేట, మే 7:పట్టణంలోని సాయినగర్‌లో నాగేశ్వరమ్మ(60) వడదెబ్బ తగిలి శనివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే నాగేశ్వరమ్మ సాయిబాబా గుడిలో దేవునికి సేవ చేసుకుంటూ ఉండేది. ఈమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, భర్త జీవనాధారం కూలి. వడదెబ్బ తగలి నాగేశ్వరమ్మ క్రింద పడిపోవడంతో ఆలయ కమిటీ సభ్యులు హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్సకు తిరుపతికి తరలించినా అప్పటికే నాగేశ్వరమ్మ మృతి చెందింది.
రైల్వేకోడూరు మండలంలో ఇద్దరు
రైల్వేకోడూరు: మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు వడదెబ్బకు గురై మృతి చెందారు. మండలంలోని వెంకరెడ్డిపల్లెకు చెందిన వెంకటయ్య (60) అనే వృద్ధుడు శనివారం వడదెబ్బతో మృతి చెందాడు. ఇతనికి భార్య సావిత్రమ్మ, ఒక కుమారుడు కలరు. అలాగే ఒ.కొత్తపల్లె గ్రామానికి చెందిన సుబ్బమ్మ (50) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తిరుపతి రూయాలో మృతి చెందింది.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
ఖాజీపేట, మే 7: మండలంలోని ఒక వ్యభిచారం గృహంపై పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు విటులను, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ రాజగోపాల్ తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఈదాడులు నిర్వహించామని, దాడుల్లో ఇద్దరు పురుషులు, మహిళ పట్టుబడ్డారని, వీరిని అరెస్టుచేశామని కోర్టుకు పంపనున్నామన్నారు.