కడప

అవినీతిపై గెలుపును చంద్రబాబు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, నవంబర్ 13: రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అన్యాయం, అవినీతిపై గెలుపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం దువ్వూరులోని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన బ్రహ్మాచారి స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ కేంద్రంలో బిజేపిపై నిందలు వేస్తూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని చంద్రబాబునాయుడు చెప్పడం దుర్మార్గంగా ఉందన్నారు. కేంద్ర నిధులతో లబ్ధిపొందుతూనే రాజకీయ లబ్ధికోసం బీజేపీపై చంద్రబాబు విమర్శలు చెయ్యడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి అనుకూలంగా ఉండే ప్రభుత్వం రావాలని చంద్రబాబు కోరడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం తమ అవినీతి అక్రమాలపై మోదీ ప్రభుత్వం ఐటి దాడులు చేస్తున్నందుకే అని దీనిని బట్టి స్పష్టం అవుతుందన్నారు. జన్మభూమ కమిటీల పేరుతో అన్ని స్వతంత్ర సంస్థలను బ్రష్టుపట్టించిన చంద్రబాబు వాటిని బీజేపీ చెడగొడుతుందని చెప్పడం ఏమాత్రం సబబుగా లేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి యువత ఆశలు నీరు కార్చడం ఆయనకే చెల్లునన్నారు. ఒక వైపు బీజేపీని దుమ్మెత్తిపోస్తూ ఎంతో కాలంగా శత్రువుగా ఉన్న కాంగ్రెస్‌ను వెనుకేసుకు రావడంలో ఆంతర్యమేమిటని అన్నారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని ఎవ్వరూ ఎంత మాత్రం పరిపాలన చేస్తారు, ప్రజలకు ఎవ్వరు న్యాయం చేస్తారో అందరికీ తెలుసునని సమయం వచ్చినప్పుడు చంద్రబాబుకు బుద్దిచెప్పే రోజులు దగ్గర పడ్డాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి అంబటి రామక్రిష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరవేటి హరిక్రిష్ణ, అసెంబ్లీ కన్వినర్ జిసి.గురప్ప, మండల అధ్యక్షులు అమ్మిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నాయకులు నేలటూరు రంగనాథ్, వెంకటేశ్, కిరణ్‌కుమార్, పీరయ్య, సుబ్బరామయ్య, మహేంద్రనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చాపాడు చానల్ చివరి ఆయకట్టుకు అందని నీరు.!
* 5 వేల ఎకరాలలో ఎండిన వరి పంట * పట్టించుకోని అధికారులు * ఆందోళనలో రైతులు
చాపాడు, నవంబర్ 13: ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సాగు నీటిని అందివ్వడంలో పూర్తిగా విఫలమై 5 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాపాడు చానల్ కింద 18 వేల ఎకరాల్లో ఆయకట్టు భూములు ఉండగా కేవలం రోజుకు 45 క్యూసెక్కుల నీటిని అందివ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాల్వలో 225 క్యూసెక్కులు నీరు ప్రవహిస్తుండాల్సి ఉండగా 10 శాతం మేరకు కూడా నీటిని విడుదల చేయకపోవడం అధికారుల వింత పోకడగా ఉందన్నారు. చాపాడు కాల్వకు 16 స్లూయిసులు ఉన్నాయి. అందులో 8 మంది ఔట్ సోర్సింగ్ లస్కర్లు 8 మంది, ఒక రెగ్యులర్ లస్కర్లతో పాటు ఓ ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు పని చేస్తున్నారు. కాల్వ పొడవునా అక్కడక్కడా వ్యర్థ పదార్థాలు, కంప చెట్టు అడ్డు పడటంతో ఆ వచ్చే కొద్ది పాటి నీరు పై తట్టు ప్రాంతాలకే పారుతూ చివరకు చేరడం లేదన్నారు. గోపవరం, సున్నపురాళ్ల పల్లె వద్ద 3 స్లూయిస్‌లు పూర్తిగా వ్యర్థాలతో పూడిపోయాయన్నారు. ఫలితంగా లింగాపురం నుంచి దిగువ భాగంలోని తాళ్లమాపురం, సీతంపల్లె, కల్లూరు, అయ్యవారిపల్లె, రాజువారిపేట, అనంతపురం, రాజుపాళెం ప్రాంతాలకు నీరు చేరక పంటలు అర్థాంతరంగా ఎండిపోతున్నాయని రైతులు వివరిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు రైతులు పేర్కొన్నారు. ఈ విషయంపై కెసికెనాల్ డివిజనల్ ఇంజనీర్ జిలానీ బాషాను వివరణ కోరగా పై తట్టు ప్రాంతాల నుంచి నీరు అంతంత మాత్రంగా వస్తుండటం వలన కెసికెనాల్, చాపాడు చానల్, ఆదినిమ్మాయపల్లె ఆనకట్టలకు వంతుల వారిగా నీరు సరఫరా చేస్తున్న మాట వాస్తవమే అన్నారు. చివరి ఆయకట్టుకు నీరు వెళ్లకుండా ఎక్కడైనా అడ్డు ఉంటే వాటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు.