కడప

నేటి నుంచి ధాన్యం సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,నవంబర్ 13: జిల్లా వ్యాప్తంగా వెలుగు ఆధ్వర్యంలో 11 కేంద్రాల్లో ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 27850 టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ఖరీఫ్‌లో వరిసాగైన ప్రాంతాల్లో రైతుల నుండి పంట పొలాల నుంచే ధాన్యం సేకరించేందుకు లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నట్లు జిల్లా సివిల్ సఫ్లై కార్పొరేషన్ మేనేజర్ పి.పద్మ తెలిపారు. ధాన్యం కొన్నవెంటనే రైతుల ఖాతాల్లో 24 గంటల లోపే నగదు జమ అయ్యేలా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఖరీఫ్ వరకు మాత్రమే 1001,1011 రకం దాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఈ రకం వడ్లు తినడానికి సరిగా లేనందున వీటిని ఈ ఏడాది సేకరణకు నిలుపుదల చేశారు. కేంద్రం వరి మద్దతు ధర బట్టి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు బుధవారం నుంచి శ్రీకారం చుట్టారు. ధాన్యం మద్దతు ధర పెంచిన నేపద్యంలో దళారులు, వ్యాపారులకంటే కొనుగోలు కేంద్రాల వద్దకే మొగ్గుచూపే పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటి వరకు ధాన్యం మద్దతు ధర సాధారణ రకం క్వింటా రూ.1570 వుంటే, ప్రస్తుతం రూ.1750కి పెరిగింది. ఏ-గ్రేడ్ రకం దాన్యం రూ.1590 నుంచి రూ.1770కి పెరిగింది. గతంలో ఉన్నధర కంటే రూ.180లు వంతున కొనుగోలు ధర పెంచింది. బయటమార్కెట్‌లో కానీ, ధాన్యం దళారుల వద్ద కానీ ఇంత ధర లేదు. ధాన్యం ఒకేసారి మార్కెట్‌లోకి వచ్చిన తరుణంలో క్వింటా రూ.1400 నుంచి రూ.1500 ధర పలకడమే కష్టం. ఈ తరుణంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించడం రైతులకు శుభపరిణామమే. కోతలు కోసిన వెంటనే దాన్యం అమ్మేసి, వచ్చిన డబ్బులతో రబీకి పెట్టుబడిపెట్టే ఆలోచన ఉన్నవారికి,కౌలుకు సాగుచేసి పండించే ధాన్యాన్ని దాచే అవకాశం లేక అమ్మేసుకుని పొలం ఖాళీ చేయాలనుకునే రైతులకు ఇది శుభపరిణామమే. ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించినా, కొనుగోలు చేయకుండా వుండేందుకు అవే నిబంధనలు సాకుగా చూపకుండా ఉంటే మంచిదని రైతు సంఘాలు అంటున్నాయి. ఖరీఫ్‌కోతలు వచ్చాక ధాన్యం కొనుగోళ్లు బాధ్యతలు వెలుగుసంఘాలు, పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో నాణ్యత ప్రమాణాల కోసం కొన్ని షరతులు పెట్టింది. కేంద్రాలు తెచ్చే ధాన్యంలో తేమ శాతం 17కు మించరాదు. కేళీలు 6శాతం మించరాదు. అయితే ఇది సాధారణ రకానికి సంబంధం లేదు. ఏ-గ్రేడ్ రకం ధాన్యానికి మాత్రమే వర్తిస్తుంది. పరిపక్వంకానీ, ముడుచుకుపోయిన దాన్యం గింజలు 3శాతానికి మించి ఉండరాదు. చెడిపోయినా రంగుమారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం గింజ 5.0శాతం మించరాదు. దాన్యంలో గడ్డి, చెత్త, తాలుడు, కలుపు విత్తనాలు కూడా ఒక శాతం మించి ఉండదారు. ఈనిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిన వారికి సూచించారు. ఈసారి 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తామని సివిల్‌సప్లై కార్పొరేషన్ డిఎం పి.పద్మ తెలిపారు. ఏదైనా ఇబ్బందివుంటే వెంటనే పరిష్కారం చూపుతామన్నారు.

నేటి నుంచి సహకార ఉద్యోగుల సమ్మెబాట

కడప,నవంబర్ 13: ప్రాథమిక సహకార పరపతి సంఘాల్లో పనిచేసే ఉద్యోగలు వేతన స్కేల్ సవరణ, హెచ్‌ఆర్ పాలసీ విడుదల కోరుతూ ఈనెల 14వ తేదీ నుంచి ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 69సంఘాల్లో పనిచేస్తున్న 300మంది సమ్మెలో పాల్గొననున్నారు. ప్రభుత్వం వేతన స్కేల్ సవరణ నిర్వహించాల్సివుండగా, 2016లో మానవ వనరుల విధానంపై 7మంది సభ్యులతో కూడిన కమిటిని నియమించింది. ఈ కమిటీ వేతన స్కేల్ సవరణ, నియామకాలు, పదోన్నతులు, పదవీ విరమణ, గ్రాడ్యుటీ, నిర్వహణ ఖర్చుల వంటి అంశాలపై అధ్యయనం చేసి గత ఏడాది ఫిబ్రవరిలో తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కానీ దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంవరకు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్లు బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. సోమవారం డీసీసీ బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు డీసీసీ బ్యాంకు స్టేట్ వైస్‌ప్రెసిడెంట్ వై.ప్రతాప్‌రెడ్డి, వారి సిబ్బంది ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు చేపట్టే ఉద్యోగుల నిరవధిక సమ్మెకు వీరు మద్దతు తెలిపారు. 25సంవత్సరాలు సర్వీసు గలవారి వేతనం ప్రభుత్వ సాధారణ ఉద్యోగుల వేతనాలతో పోలిస్తే నాలుగు రెట్లు తక్కువగా ఉంది.
నిలచిపోనున్న బ్యాంకుల సేవలు
ఈనెల 14వ తేది నుంచి ఉద్యోగులు సమ్మెబాట పడుతుండటంతో గ్రామాల్లో బ్యాంకుల సేవలునిలిచిపోనున్నాయి. బ్యాంకుల్లో వారు దాచుకున్న నగదును తెచ్చుకునేందుకు ఖాతాదారులు ఇబ్బందిపడతారు. సకాలంలో పరపతి, ఎరువులు అందక రైతులు అవస్థలు పడనున్నారు. డ్వాక్రా మహిళలకు లింకేజి రుణాలు సకాలంలో అందని పరిస్థితి నెలకొంటుంది. రుణాల రికవరీలు నిలచిపోనున్నాయి. రుణాలు చెల్లించేందుకు చెల్లించే అవకాశం లేకుండాపోవడంతో అదనపు వడ్డీబారం పడే అవకాశం ఉంది. ఆర్జితల సెలవులు 180రోజుల నుంచి 300రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకుల్లోని 5వ కేటగిరిలో భర్తీ చేయనున్న గుమస్తా ఉద్యోగుల ఖాళీల్లో 50శాతం సీనియార్టీ ప్రాతిపదికన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు. వేతన స్కేల్ సవరణ జివోనెం 71ని విడుదల చేయాలని సంఘం నాయకులు సమ్మె చేయనున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం జిల్లా అధ్యక్షుడు వీరశేఖర్, వైస్ ప్రెసిడెంట్ అన్సార్, డైరెక్టర్ పి.రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 24బ్రాంచ్‌ల నుంచి 69 పరపతి సంఘాల్లో పనిచేస్తున్న 300మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనబోతున్నారు.