కడప

ప్రమాణాలు పాటించని శుద్ధజల కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప అర్బన్,నవంబర్ 16:ప్రజల అవసరాలను అవకాశాలుగా మార్చుకుని జిల్లాలో తాగునీటి శుద్ధజల కేంద్రాలు ఆహారభద్రత, ప్రమాణాల ప్రాదికార సంస్థ నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. జిల్లాలో వీధి వీధిలో పుట్టగొడుగుల్లా శుద్ధజల కేంద్రాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు అన్నివర్గాల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండ్స్’ప్రమాణాలు పొందిన శుద్ధిజల కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా కేవలం ఆరుమాత్రమే ఉన్నాయని ఆహారభద్రత అధికారి శంకర్ తెలిపారు. ఈ అధికారి లెక్క ప్రకారం బట్టిచూస్తే నీటి శుద్ధికేంద్రాలు అనుమతి లేనివి వేల సంఖ్యలో ఉన్నాయి. తాగునీటిని ప్రజలకు డబ్బుకు విక్రయించే నీటి శుద్ధికేంద్రాలు ప్రజలకు అనారోగ్యాలను నేరుగా కట్టబెడుతున్నారు. శుద్ధిజలం క్లోరినేషన్‌కు నోచుకోకపోవడంతో చిన్నప్రేగులకు, పెద్దప్రేగులకు, అన్నవాహిక, జీర్థాశయానికి సంబంధించి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని రిమ్స్ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కాలేయానికి సంబంధించి ముఖ్యంగా టైఫాయిడ్ వంటి రోగాలు సంభవిస్తాయన్నారు. జిల్లాలో పలుచోట్ల బోరునీటిని, మున్సిపాలిటీ తాగునీటి కొళాయి కనెక్షన్ల ద్వారా నేరుగా క్యాన్లలో నింపుతున్నా పట్టించుకున్నవారే కరువయ్యారు. జిల్లాలో కడప పట్టణంతోపాటు ప్రధానపట్టణాలైన ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, రాయచోటి, జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో నీటి విక్రయ శుద్ధిజల కేంద్రాలు అనుమతిలేనివి అడుగడుగునా నిర్వాహకులు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. తనిఖీ చేయాల్సిన అధికారులు తూ.తూ మంత్రంగా కూడా తనిఖీలు నిర్వహించకపోవడంతో ప్రజలు, అధికారులపై మండిపడుతున్నారు. వీది వీధిలో, సందు సందులో సులువైన వ్యాపార మార్గంగా వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ప్రజల ఆరోగ్యంతో జలగాటమాడుతున్నారు. అధికశాతం నీటి శుద్ధికేంద్రాల్లో నిర్దేశిత ప్రమాణాలు నిర్వాహకులు పాటించలేదు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అవినీతి మార్గంలో, అక్రమార్జన రూపంలో తమ జేబులను నిర్వాహకులు నింపుకుంటూ, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టినప్పటికీ నిర్వాహకుల్లో ఏమాత్రం మార్పు కనిపించలేదనే విమర్శలు నెలకొన్నాయి. ఈప్లాంట్స్ ఏర్పాటుచేయాలంటే తొలుత భూగర్భజలశాఖ అనుమతి పొందాల్సివుంది. ఈశాఖతోపాటు ఆహారభద్రత విభాగపు అధికారుల నుంచి కూడా అనుమతి పొందాలి. గ్రామాల్లో అయితే పంచాయతీ, నగరాలు, పట్టణాల్లో సంబంధిత గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల నుండి, మున్సిపాల్టీ తాగునీటి రవాణా సరఫరా ఇంజినీరింగ్ సెక్షన్ విభాగం నుండి అనుమతులు తప్పనిసరిగా వాటర్ ప్లాంట్ నిర్వహించే నిర్వాహకులు తీసుకోవాల్సివుంది. ఈప్లాంట్స్‌లో కూడా శిక్షణ పొందిన సాంకేతి నిపుణులు ఉండాలన్న చట్టబద్దత ఉంది. వివిధ విభాగాల నుంచి తగిన రీతిలో ధృవీకరణ పత్రాలు శుద్ధిజల కేంద్ర నిర్వాహకులు పొందాలి. అయితే ఏ ఒక్కనిబంధన పాటించకుండా ఇష్టానుసారంగా ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. తాగేనీటి వనరులలో శుద్దిప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. దీనికితోడు వాటర్ ప్లాంట్ కేంద్రాల్లో పరిశుభ్రతను సరిగా పాటించకపోవడంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కేసులు జేసీ కోర్టులో నడుస్తుండగా మరికొన్ని కేసులు ఇతర కోర్టు పరిధిలో ఉన్నాయి. ఈనేపధ్యంలో సంబంధిత ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టి జిల్లాలోని శుద్ధిజలకేంద్రాలు నిబంధనలు పాటించేలా చూడాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ఈప్లాంట్స్‌ను ఆహారభద్రత ప్రమాణాల ప్రాదికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలకు అనుగుణంగా లేకపోవడాన్ని అధికారులు గుర్తించి ప్రజల ఆరోగ్యపరిస్థితి పట్ల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా తాగునీటిని శుద్ధిజలాల నుంచి తీసుకునేముందు ఆ వాటర్‌ప్లాంట్స్ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయో లేదో గమనించాల్సిన అవసరం ఉంది. త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించి షాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న స్టేట్‌ఫుడ్ లేబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపుతామని ఆహార భద్రత అధికారి శంకర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే శుద్ధజల కేంద్రాల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.