కడప

రాచినాయపల్లె ఘర్షణలో ఆరుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నూరు,మే 10:మండలంలోని రాచినాయపల్లె గ్రామంలో జరిగిన ఘర్షణ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ హుస్సేన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన శివారెడ్డి ఆయన సోదరుడు హరినాథ్‌రెడ్డిపై ఈనెల 5న అదే గ్రామానికి చెందిన సర్పంచ్ సొంటం నారాయణరెడ్డితోపాటు వారి బంధువులు సొంటం హరినాథ్‌రెడ్డి, సొంటం సుబ్బరాయుడు, సొంటం కృష్ణారెడ్డి, సొంటం రమణారెడ్డిలు కర్రలు, రాళ్లతో దాడి చేయగా ఇద్దరు తీవ్రంగా గాయపడడటంతో ఒకరిని తిరుపతికి తరలించగా మరొకరని కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘర్షణ సంఘటనలో ప్రమేయమున్న ఆరుమందిని అరెస్టు చేసి బుధవారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్‌ఐ హుస్సేన్ చెప్పారు.

మట్కాబీటర్లు అరెస్టు
* రూ.9,270 నగదు స్వాధీనం
ప్రొద్దుటూరు,మే10:స్థానిక ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని ఓ ఇంటిలో మట్కా నిర్వహిస్తున్న ఐదుగురు నిర్వాహకులను అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. మంగళవారం స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం రాత్రి 8గంటలకు ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని ఓ ఇంటిలో మట్కా నిర్వహిస్తున్నారన్న స్పష్టమైన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. దాడిలో నిర్వాహకులు నరసింహ, సీతాల్‌రెడ్డి, అశోక్, నల్లయ్యలతోపాటు కుమారి అనే మహిళను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద నుండి రూ.9,270 నగదు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ట్రైనీ ఎస్‌ఐ వినోద్‌కుమార్, కానిస్టేబుళ్లు రామ్‌భూపాల్‌రెడ్డి, నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వేధింపుల కేసులో తండ్రి,కొడుకుల అఠెస్టు
రైల్వేకోడూరు, మే 10:కోడలి వేధింపు కేసుకు సంబంధించి రైల్వేకోడూరు పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన పోలి మధుసూదన్‌రెడ్డి అతని కుమారుడు జయభారత్‌రెడ్డిలను మంగళవారం పట్టణంలోని హెచ్‌ఎంఎం హైస్కూల్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. వివరాలిలావున్నాయి. స్థానిక చింతంనగర్‌కు చెందిన లక్ష్మీకరరెడ్డి కుమార్తె శే్వతను జయభారత్‌రెడ్డి వివాహం చేసుకున్నాడు. అంతకు మునుపే జయభారత్‌రెడ్డి తిరుపతిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదివే సమయంలో బీహార్‌కు చెందిన షబానాతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఈ సంఘటనను జయభారత్‌రెడ్డి తండ్రి మధుసూదన్‌రెడ్డి, తల్లి శంకుతల, చెల్లెలు ప్రత్యూష రహస్యంగా ఉంచారని, పట్టణానికి చెందిన శే్వతను జయభారత్‌రెడ్డి పెళ్లి చేసుకున్నాడని ఎస్సై చెప్పారు. వివాహం చేసుకున్న నాటి నుండి అదనపు కట్నం కొరకు భర్త, అత్త, మామ, ఆడపడుచు తరుచూ వేధింపులకు గురి చేయడం జరిగిందన్నారు. ఒకసారి హత్యాయత్నం చేయబోయారని, దీనిని దృష్టిలో పెట్టుకుని బాధితురాలు శే్వత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి భర్త, మామలను అరెస్టు చేశామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచామన్నారు.